Thursday, October 29, 2009

సామెతలు - 1

మొగుడు మొట్టితే ఏడవలేదు గాని, తోడికోడలు నవ్విందని ఏడిచిందట
ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట
మొదలులేదుమొగుడ అంటే పెసరపప్పు వండు పెళ్ళామా అన్నాడట
అనగా అనగా రాగం తినగా తినగా రోగం
రాత రాజ్యమెలుదామంటే బుధ్ధి భూమినేలుదామంటుందట(దున్నుదామంటుంది)
అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
మంచోడు మంచోడు అంటే మంచమెక్కి ఉచ్చపోశాడట
నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడాట వెనకటికి
అప్పిచ్చువాడు బాగు కోరతాడు, తీసుకున్నవాడు చెడు కోరతాడు






Friday, October 23, 2009

పాహి రామ దూత - త్యాగరాజ - వసంతవరాళి / షడ్విధమార్గిని




Audio link : Hyderabad Brothers
ప. పాహి రామ దూత జగత్-
ప్రాణ కుమార మాం

అ. వాహినీశ తరణ దశ
వదన సూను తను హరణ (పా)

చ1. ఘోరాసుర వారాన్నిధి
కుంభ తనయ కృత కార్య
పారిజాత తరు నివాస
పవన తుల్య వేగ (పా)

చ2. పాద విజిత దుష్ట గ్రహ
పతిత లోక పావన
వేద శాస్త్ర నిపుణ వర్య
విమల చిత్త సతతం మాం (పా)

చ3. తరుణారుణ వదనాబ్జ
తపన కోటి సంకాశ
కర ధృత రఘువర సు-చరణ
కలి మలాభ్ర గంధ వాహ (పా)

చ4. కరుణా రస పరిపూర్ణ
కాంచనాద్రి సమ దేహ
పరమ భాగవత వరేణ్య
వరద త్యాగరాజ వినుత (పా)



Get this widget | Track details | eSnips Social DNA

Friday, October 16, 2009

గజానన యుతమ్ - రాగం వేగ వాహిని - దీక్షితార్


గజానన యుతమ్ - రాగం వేగ వాహిని/చక్రవాకం - దీక్షితార్
పల్లవి
గజానన యుతం గణేశ్వరం
భజామి సతతం సురేశ్వరమ్


సమష్టి చరణమ్
అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం
గణాది సన్నుత పద పద్మ కరం
(మధ్యమ కాల సాహిత్యమ్)
కుంజర భంజన చతుర-తర కరం
గురు గుహాగ్రజం ప్రణవాకారమ్

Audio: Veena fusion by Rajesh Vaidhya (listen to this only if you like fusion..)
youtube play list:
1. violin Aishu Venkataraman
2. vocal Parasala B Ponnammal , K.Bhama
3. Bangalore Brothers (S. Ashok, M.B. Hariharan)
4. Trichur Brothers, Sri Ramkumar Mohan & Srikrishna Mohan
5. Bentonville Violin Concert - S.D Sridhar and N.Vijaya Kumar
6. vocal , Pancha Rang
7. vocal Prince Rama Varma
8. violin Dr. Jyotsna Srikanth at London