Friday, May 14, 2010

మేలుకోవయ్య మమ్మేలుకో రామ - త్యాగరాజ కృతి, బౌళి రాగం


ప. మేలుకోవయ్య మమ్మేలుకో రామ | మేలైన సీతా సమేత నా భాగ్యమా

చ1. నారదాదులు నిన్ను కోరి నీ మహిమ- లవ్వారిగా పాడుచున్నారిపుడు తెల్ల
వారగా వచ్చినది శ్రీ రామ నవనీత - క్షీరములు బాగుగానారగింపను వేగ (మే)

చ2. ఫణి శయన అనిమిష రమణులూడిగము సేయ - అణుకువగ నిండారు ప్రణుతి జేసెదరు
మణి-మయాభరణులౌ అణిమాదులిడు దీప- మణులు తెలుపాయెను తరణి వంశ వర తిలక (మే)

చ3. రాజ రాజేశ్వర భ-రాజ ముఖ సాకేత - రాజ సద్గుణ త్యాగరాజ నుత చరణ
రాజన్య విబుధ గణ రాజాదులెల్ల నిను - పూజింప కాచినారీ జగము పాలింప
(మే)

Thursday, May 6, 2010

నరసింహాగచ్చ - మోహన రాగం , దీక్షితార్ కృతి

Audio link : Sri Mangalampalli Balamuralikrishna (esnips not working will provide another link soon)

Alternative link 1
Alternative link 2
పల్లవి
నరసింహాగచ్చ
పర-బ్రహ్మ పుచ్చ స్వేచ్ఛ స్వచ్ఛ

అనుపల్లవి
హరి హర బ్రహ్మేంద్రాది పూజితాత్యచ్ఛ
పరమ భాగవత ప్రహ్లాద భక్త్యచ్ఛ

చరణం
ధీర-తర ఘటికాచలేశ్వర
సౌర-తర హేమ కోటీశ్వర
వీర వర మోహన విభాస్వర
మార వర మానవ హరీశ్వర

(మధ్యమ కాల సాహిత్యం)
ముర హర నగ ధర సరసిజ కర
పరమ పురుష పవనజ శుభ-కర
సురుచిర కరి గిరి వరద విచర
సరస గురు గుహ హృదయ సహ-చర