Wednesday, October 5, 2011

నవరాత్రి దేవి కృతులు : యోగ యోగేశ్వరీ త్రిపుర వాసిని , ఊతుక్కాడు వేంకట కవి , ఆనందభైరవి రాగం

Audio  : Bombay Sisters

పల్లవి:
యోగ యోగేశ్వరీ త్రిపుర వాసిని
మధ్యమకాలం:
యోజయ మామపి తవ పాద పద్మ మూలే
ముని జనానుకూలే
శ్రీ విద్యా జ్ఞాన భక్తి నాద [గాన] (యోగ)

అనుపల్లవి:
త్యాగేశ హృదయేశ్వరి ప్రసిద్ధ
చతుర్దశ కోణేశ్వరి
భోగ మోక్ష వరదాయకి సర్వ -
సౌభాగ్య దాయక చక్రేశ్వరి (అంబ)
మధ్యమకాలం:
ఆగమాది సకల శాస్త్రార్థ రూపే
అఖిల భువన పాలిత వర ప్రతాపే
నాగరత్న తాళ పత్ర కనకాభే
నతజన మన పర కరుణాయుత శోభే (యోగ)

చరణం:
సంప్రదాయ యోగిని పరివారే
సదాశివ హృదయ విహారే అంబ
హంసతూలికా తల్ప సారే మహా-
మాయా మంత్రార్థ సారే ఏకామ్ర
తరుమూలే శ్రీ కాంచిపుర క్షేత్రే(అంబ)
పవిత్రే తామ్ర వర్ణాంగ మతంగ ముని
పుత్రే సుచరిత్రే (యోగ)
మధ్యమకాలం:
ఈంకారకామకళామంత్రవిహారే
ఈశ్వరతత్వవిచారే ఆనందాది
అధికరణభావ భువనాత్మకానంద-
రూపే చతుర్దశప్రాకారే
youtube Video : 

Tuesday, October 4, 2011

నవరాత్రి దేవి కృతులు : సుధామయి సుధానిధి , ముత్తయ్య భాగవతార్, అమృతవర్షిణి రాగం

Audio : Priya Sisters 

 Audio : Bombay Jayashree 

Youtube : Smt. Gayathri Venkataraghavan
 పల్లవి
సుధామయి సుధానిధి సుమచరేక్షు కోదండే

అనుపల్లవి
విధీంద్రనుతే విమలే సలహౌ వేదసారే విజయాంబికే

చరణం
సరసిజాక్ష జగన్మోహిని సరసరాగ మణిభూషణి 
హరికేశ ప్రియ కామిని ఆనందామృతక(వ)ర్షణి

Flute : Sikkil Mala Chandrasekhar
 
 Veena : Rajesh Vaidhya
 
 Mandolin U Srinivas
 
Saxophone Kadri Gopalanath
 

Monday, October 3, 2011

నవరాత్రి దేవి కృతులు : కామాక్షీ నాతో వాదా దయ లేదా , శ్యామశాస్త్రి కృతి, బేగడ రాగం

Audio link : Vijay Siva 

Audio link : Vijay Siva , Hummaa.com
పల్లవి
కామాక్షీ నాతో వాదా దయ లేదా
కమలాక్షీ నన్నొకని బ్రోచుట భారమా బంగారు (కామాక్షీ)


అనుపల్లవి
తామసము జేసితే నే తాళనమ్మా నీ
నామ పారాయణము విన వేడితినమ్మా మాయమ్మా (కామాక్షీ)


చరణం
శ్యామ కృష్ణ సోదరీ తల్లీ (అంబా) శుక
శ్యామళే నిన్నే కోరియున్నానమ్మా
మాయమ్మయని నే దలచి దలచి
మాటి మాటికి కన్నీరు విడువ లేదా అంబా
నీవు మాటాడకుండిన నే తాళ లేనమ్మా
నీ బిడ్డను లాలించవే దొడ్డ తల్లివే
కామాదుల చపల చిత్త పామరుడై
తిరిగి తిరిగి ఇలలో
కామిత కథలు విని విని
వేసారి నేను ఏమారి పోతునా (కామాక్షీ)

Youtube Video : Vijay Siva

Sunday, October 2, 2011

నవరాత్రి దేవి కృతులు : అంబా వాణి నన్నాదరించవే - హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్ - కీరవాణి రాగం

Audio link : Subhashini, SowmyaSushma Nittala
Audio link : Bombay Sisters
Audio link : Bombay Jayashree
పల్లవి
అంబా వాణి నన్నాదరించవే


అనుపల్లవి
శంబరారి వైరి సహోదరి కంబు గళేసిత కమలేశ్వరి


చరణం
పరదేవి నిన్ను భజియించే (నిజ) భక్తులను బ్రోచే పంకజాసని
వర వీణాపాణి వాగ్విలాసిని హరికేశపుర అలంకారి రాణి

Saturday, October 1, 2011

నవరాత్రి దేవి కృతులు : సరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీ , శ్యామశాస్త్రి కృతి, శంకరాభరణం రాగం

Audio link : Priya Sisters

Audio link : M.Balamuralikrishna
Audio link : 
Nadaswaram : DSD Desure Selvarathinam
పల్లవి
సరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీ
నీ పదాంబుజములే
సదా నమ్మినానమ్మా శుభమిమ్మా
శ్రీ మీనాక్షమ్మా


అనుపల్లవి
పారాకు సేయక వర దాయకీ నీ
వలే దైవము లోకములో గలదా
పురాణీ శుక పాణీ మధుకర వేణీ
సదా-శివునికి రాణీ (సరోజ)


చరణం 1
కోరి వచ్చిన వారికెల్లను
కోర్కెలొసగే బిరుదు గదా అతి
భారమా నన్ను బ్రోవ తల్లి
కృపాలవాల తాళ జాలనే (సరోజ)


చరణం 2
ఇందు ముఖీ కరుణించుమని నిను
ఎంతో వేడుకొంటిని
నాయందు జాగేలనమ్మా మరియాద
గాదు దయావతి నీవు (సరోజ)


చరణం 3
సామ గాన వినోదినీ గుణ
ధామ శ్యామ కృష్ణ నుతా శుక
శ్యామళా దేవీ నీవే గతి రతి
కామ కామ్యద కావవే నన్ను (సరోజ)

Youtube video playlist : Yesdas, PriyaSisters and Violin : Sandep Bharadwaj