Saturday, October 11, 2008

నారాయణ స్తోత్రం


Audio donwload link : Priya sisters
నారాయణ నారాయణ జయగోవింద హరే 
నారాయణ నారాయణ జయగోపాల హరే  
కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ (1)
నవనీరద సంకాశ కృతకలికల్మషనాశ నారాయణ  (2)
యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ (3)
పీతాంబరపరిధాన సురకల్యాణనిధాన నారాయణ  (4)
మంజులకుంజాభూష మాయామానుషవేష నారాయణ (5)
రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ  (6)
మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ (7)
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ(8) 
జలరుహదలనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ(9)
పాతకరజనీసంహర కరుణాలయ మాముధ్ధర నారాయణ(10) 
అఘబకక్షయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ (11)
హాతకనిభ పీతాంబర అభయం కురు మే మామవ నారాయణ  (12)
దశరథరాజ కుమార దానవమద సంహార నారాయణ (13)
గోవర్ధనగిరిరమణ గోపీమానసహరణ నారాయణ  (14)
సరయూతీరవిహార సజ్జన ఋషిమందార నారాయణ (15)
విశ్వామిత్రమఖత్ర వివిధపరాసుచరిత్ర నారాయణ (16)
ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ (17)
జనకసుతాప్రతిపాల జయజయ సంస్మృతిలీల నారాయణ  (18)
దశరథవాగ్ధృతిభార దండకవనసంచార నారాయణ (19)
ముష్టికచానూరసంహార మునిమానసవిహార నారాయణ (20)
వాలినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ(21)
మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ (22)
జలనిధిబంధనధీర రావణకంఠవిదార నారాయణ(23)
తాటకమర్దనరామ నటగుణవివిధధనాఢ్య నారాయణ (24) 
గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ (25)
సంభ్రమసీతాకార సాకేతపురవిహార నారాయణ  (26)
అచలోద్ధృతిచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ(27) 
నైగమగానవినోద రక్షితసుప్రహ్లాద నారాయణ  (28)
ఇతిశ్రీమత్ శంకరాచార్యవిరచిత నారాయణ స్తోత్రం



Saturday, September 20, 2008

త్యాగరాజ యోగ వైభవం


ఈ దీక్షితార్ కీర్తన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.
ఆనంద భైరవి రాగంలో స్వరపరచబడిన ఈ కృతి లో రెండురకాల యతులను దీక్షితార్ వారు అధ్బుతంగా ప్రకటించారో చూడండి.


Click here to listen/download this kriti
పల్లవి
త్యాగరాజ యోగ వైభవం సదాశివం
త్యాగరాజ యోగ వైభవం సదాశ్రయామి
త్యాగరాజ యోగ వైభవం
అగ రాజ యోగ వైభవం
రాజ యోగ వైభవం
యోగ వైభవం
వైభవం
భవం
వమ్

సమష్టి చరణమ్
నాగ రాజ వినుత పదం నాద బిందు కలాస్పదం
యోగి రాజ విదిత పదం యుగపద్భోగ మోక్ష ప్రదమ్
యోగ రూఢ నామ రూప విశ్వ సృష్ట్యాది కరణం
యుగ పరివృత్యబ్ద మాస దిన ఘటికాద్యావరణమ్
(మధ్యమ కాల సాహిత్యమ్)
శ్రీ గురు గుహ గురుం సచ్చిదానంద భైరవీశం
శివ శక్త్యాది సకల తత్వ స్వరూప ప్రకాశం
శం
ప్రకాశం
స్వరూప ప్రకాశం
తత్వ స్వరూప ప్రకాశం
సకల తత్వ స్వరూప ప్రకాశం
శివ శక్త్యాది సకల తత్వ స్వరూప ప్రకాశమ్
Muthuswami Dikshitar's song: Tyagarajayoga Vaibhavam in
Anandabhairavi contains the two Yatis - Gopuccha Yati and
Srotovaha Yati. The phrases are:
For Gopuccha Yati (like a cow's tail!):
Tyagaraja Yoga Vaibhavam
Agaraja Yoga Vaibhavam
Rajayoga Vaibhavam
Yoga Vaibhavam
Vaibhavam
Bhavam
Vam
and the Srotovaha Yati (Flowing r iver) in
sam
Prakasham
Svaroopa Prakasham
Tattva Svaroopa Prakasham
Sakala Tattva Svaroopa Prakasham
Sivasaktyadi Sakala Tattva Svaroopa Prakasham

Wednesday, June 25, 2008

కాకతాళీయంగా !

అనగనగ ఒక కాకి రుయ్ మని ఎగురుకుంటూ వచ్చి తాటి చెట్టు మీద వాలిందట. అది అలావాలిందో లేదో , చెట్టుకున్న ఒక తాటి కాయ కిందపడింది.
అది చూశి, మన కాకి గారు , ఆహా ! మన బరువు తట్టుకోలేక తాటి కాయ క్రింద పడింది అని జబ్బలు (రెక్కలు) చరుచుకుందట.


ఇదండి, "కాకతాళీయంగా ! " అన్న పదం హిస్టరీ !

Wednesday, February 6, 2008

"తు.చ తప్పకుండా" ఎలా వచ్చింది ?

తు. చ. లు సంస్కృత పదాలట.
సంస్కృత శ్లోకాలు రాసేటప్పుడు , కొన్ని నియమాలు ఉండేవట.
అందులో ఒకటి , "పంక్తి కి 8 అక్షరాలు ఉండాలి."
ఒక్కోసారి 8అక్షరాలు రాయటం కుదరనప్పుడు, కొన్ని అక్షరాలను ఉంచవచ్చు.(padding)
అవి :
తు, చ, స్వ, హి, వై, ....

ఉదా : రామాయ లక్ష్మనశ్చతు

మరి ఇవి తెలుగులోకి ఎలా వచ్చాయి ?

పూర్వ కాలంలో , సంస్కృత కావ్యాలను తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు , కొంత మంది కవులు, దేవభాష మీది గౌరవంతో , ఈ తు, చ, స్వ, హి, వై లకు కుద ఎవొ అర్ధాలు (కాని,మరియు...) కల్పించి అనువాదం చేసేవారట .
ఇలాంటి అనువాదాన్ని , తు.చ. తప్పకుండా అనువాదం చెయ్యటం అనేవారట.


అలా వచ్చింది ఈ "తు.చ. తప్పకుండా"

భక్తి టివి లొ గరికపాటి నరసింహా రావు గారు చెప్పగా విన్నాను.