Sunday, September 19, 2010

నిను వినా నా మదియెందు - త్యాగరాజ కృతి, నవరసకన్నడ రాగం


who said classical is slow, listen to this kriti.singer : Sri M.S.Subbalkshmi.
ప. నిను వినా నా మదియెందు నిలువదే శ్రీ హరి హరి

అ. కనులకు నీ సొగసెంతో క్రమ్మియున్నది గనుక (నిను)

చ1. నీదు కథలు వీనులందు నిండియున్నది రామ
శ్రీ-ద నీ నామము నోట చెలగియున్నది గనుక (నిను)

చ2. నేనుయెచట జూచినను నీవైయున్నది రామ
భాను వంశ తిలక నీదు భక్తుడనుచు పేరు గనుక (నిను)

చ3. కపటమౌ మాటలెల్ల కమ్మనైనది రామ నా
తపము యోగ ఫలము నీవే త్యాగరాజ సన్నుత (నిను)