Thursday, June 30, 2011

మాధవ మామవ దేవ - నారాయనతీర్థ - నీలాంబరి రాగం

Audio link : Sheik ChinaMoulana (nadaswaram)
Audio link : Karukuruchi P Arunachalam(nAdaswaram)
మాధవ మామవ దేవ
యాదవ కృష్ణ యదుకుల కృష్ణ ||


సాధు జనా ధార సర్వ భావ
మాధవ మామవ దేవ ||


అంబుజ లోచన కంబు శుభ గ్రీవ
బింబాధర చంద్ర బింబానన
చాంపేయ నాసాగ్ర లగ్న సుమౌక్తిక
శారద చంద్ర జనిత మదన ||


కపట మానుష దేహ కల్పిత - జగదండ కోటి మోహిత భారతీ రమణ
అపగత మోహ తదుద్భవ నిజ జనక - కరుణయా ధ్రుత సేహ సులక్షణ ||


తరళ కుండల రవిమండల వికసిత - నిజ జన మానస పంకేరుహ
కరుణ హాస సుధా నిధి కిరణ - శమిత భవ తాపస జన మోహ ||


మురళీ గాన రసామ్రుత పూరిత - వ్రజ యువతీ మానసార్ణవ భో
సరస గుణార్ణవతీర్ణ భవార్ణవ - సతత గీత కీర్తి మండల భో ||


శంఖ చక్ర పద్మ శార్జ గదా ఖడ్గ - వ్య్జయంతీ కౌస్తుభాది భూష
స్వీక్రుత బుధ్యాది తత్వ సమన్విత - దివ్య మంగళ గోపబాలక వేష ||


ఆగమ గిరి శిఖరొ దిత సత్య చిద - ద్వయ లక్ష్ణ సుఖ భానో
భోగి కులోత్తమ భోగ శయన - దుగ్ధ సాగరాజ లక్షణఢ్య తనో ||


ఇందిరయా సహ సుందర కృష్ణ - పురుందరాది వంద్య పద కమల
నంద నందన యోగి వర్య ధురంధర - నారాయణ తీర్థ మతి విహార ||

Youtube Play list (Unnikrishnan, - B.Sasikumar-Balabhaskar Violin Duo,

A.K.C. Natarajan-Clarionet )



The Hindu Article on NarayanaTirtha

Wednesday, June 22, 2011

నీతనయు చేత బ్రతుకమే యశోదమ్మ

Audio link : Sri Mangalampalli Balamuralikrishna
నీతనయు చేత బ్రతుకమే యశోదమ్మ

నీతనయు చేత అతి/అదె ఘాతుకము కాపురము
యేతీరున జేతు మమ వ్రాతఫల మేతీరౌనో

నిన్న నాదు చిన్నకోడలన్న పిన్నకన్నె
మున్నే ఉన్న తానె మిన్నానంచు భర్ణాసరము(??) వెనువేసి
నిన్నే నమ్మియున్నాననెనే దాని చన్నుబట్టి కెంగాలించుకెన్నో చేసెనే
ఆవాడ మాయన్నగారన్నీ చూచెనే యశోదమ్మ

ఉట్టి పాలచట్టి తూట్లుగొట్టి నోరుబట్టి త్రాగునట్టి వేళ నాదు
పట్టి జుట్టుబట్టి కొట్టబోగ వట్టు కొట్టకుమనెనే
నావంటి కుర్రబుట్టుని(??) వట్టు రమ్మనెనే(??)
యీలాంటి సుతునెట్టు గంటివోయమ్మా
మాగుట్టు పోగొట్టి చనుబట్టి మోవినట్టే కరచి పూల/ఁగూల కొట్టెనే యశోదమ్మా

ధరణి వేడురీ జోగి కనయు సుందరాంగ విని వదల జాలక
వ్రేతతరుణి మానధనములెల్ల చూరగొనెనే
ధరణి పరిపూర్ణుడాయనె వీరలకెల్ల(??) కోరికలదీర బ్రోచెనె
భవబంధముల పారద్రోలి చేరదీసెనే యశోదమ్మా

(సాహిత్యంలో తప్పులుంటే దయచేసి తెలియజేయగలరు.
పాట విని లిరిక్స్ వ్రాసినందుకు నారాయణం సుబ్రహ్మణ్యం , ప్రశాంత్ నేతి, శైలజ గార్ల కు ధన్యవాదాలు)

Sunday, June 5, 2011

రామ రామ నీవారము గామా రామ - త్యాగరాజకృతి - ఆనందభైరవి రాగం

Word by Word Meaning :
ప. రామ రామ నీవారము గామా రామ సీతా
రామ రామ సాధు జన ప్రేమ రారా

చ1. మెరుగు చేలము కట్టుక మెల్ల రారా రామ
కరగు బంగారు సొమ్ములు కదల రారా (రామ)

చ2. వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామ
మరుగు జేసుకొనునట్టి మహిమ రారా (రామ)

చ3. మెండైన కోదండ కాంతి మెరయ రారా కనుల
పండువగయుండు ఉద్దండ రారా (రామ)

చ4. చిరు నవ్వు గల మోము జూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా (రామ)

చ5. కందర్ప సుందరానంద కంద రారా నీకు
వందనము జేసెద గోవింద రారా (రామ)

చ6. ఆద్యంత రహిత వేద వేద్య రారా భవ
వేద్య నే నీవాడనైతి వేగ రారా (రామ)

చ7. సు-ప్రసన్న సత్య రూప సుగుణ రారా రామ
అ-ప్రమేయ త్యాగరాజునేల రారా (రామ)

Get this widget | Track details | eSnips Social DNA