Friday, June 1, 2007

సీతారామకళ్యాణ మహోత్సవం.

ఎప్రిల్27, 2007 మంగళవారం, శ్రీరామనవమి రోజు , పిడుగురాళ్ళ,గుంటూరు జిల్లా లో దీపాల కనకదుర్గ, సుబ్రహ్మణ్యం దంపతులు జరిపించిన శ్రీ సీతారామకళ్యాణ మహోత్సవం.



sriramanavami

Powered by eSnips.com

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి!


అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే |
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి ||


నా చిన్నప్పుడు తాడికొండ గురుకుల విద్యాలయం లొ చదువుతుండగా, ఏదో సందర్భం వచ్చి మా సంస్కృతం మాష్టారు చెపిన స్లోకం ఇది. అలా మెదడు లో అచ్చు పడి పోయింది.

ఇంతకీ దీని అర్థమేంటంటే, లంకను జయించిన తర్వాత , లక్ష్మణుడు రాముడితో , "అన్నా ఈ లంక బంగారంలోకం లా ఉంది , ఇక్కడె ఉండి పొదామా " అన్నాడట.
అప్పుడు రాముడు "లక్ష్మణా ! జనని, జన్మ భూమి స్వర్గం కంటే గొప్పవి "
అన్నాడట.

ఇలా , ఈ శ్లోకంతో , నా బ్లాగును ప్రారంభిస్తున్నాను, నా చిన్ననాటి స్కూల్ ని , మా సంస్కృతం మాష్టారు ని తలుచుకుంటూ.

ఏది ఒక్కసరి అందరూ రామా అనండి !