Saturday, May 30, 2009

ఆనంద నటన ప్రకాశం



అదేంటో, దీక్షితార్ కృతులు వింటుంటే, కర్ణాటక సంగీతం లో రాగాలని ఇంత అద్భుతంగా మరెవ్వరూ వాడుకోలేరేమో అనిపిస్తుంది. చిదంబర శంకరుడిని కీర్తుస్తూ కేదర రాగంలో , బాంబే జయశ్రీ గారి గాత్రంలో (3rd in this album)

పల్లవి
ఆనంద నటన ప్రకాశం చిత్సభేశం
ఆశ్రయామి శివ కామ వల్లీశం

అనుపల్లవి
భానుకోటి కోటి సంకాశం
భుక్తి ముక్తి ప్రద దహరాకాశం
దీన జన సంరక్షణ చనం
దివ్య పతంజలి వ్యాఘ్రపాద
దర్శిత కుంజితాబ్జ చరణం

చరణం
చితాంసు గంగాధరం నీలకంధరం
శ్రీ కేదారాది క్షేత్ర ఆధారం భూదేశం శార్దూల చర్మాంబరం చిదంబరం
భూసురాద్రి సహస్ర మునీశ్వరం విశ్వేశ్వరం
నవనీత హృదయం సదయ గురుగుహ
దాద మధ్యం వేద వేద్యం
వీత రాగిణ మప్రమేయాద్వైత ప్రతిపాద్యం
సంగీత వాద్య వినోద తాండవ
జాత బహుతర వేద చోద్యం

ప ని ని స త క జ ను త స ని ని
జం తరి త స మ గ మ ప; ని మ గ
త జ ను త క మ గ మ మ ప సా ని ని
త జం తరి ప; మ గ త రి కి తోం

Saturday, April 18, 2009

ninnE bhajana- నిన్నే భజన సేయువాడను nATa ragam, thyagaraj kriti

ప. నిన్నే భజన సేయువాడను

అ. పన్నగ శాయి పరుల వేడలేను (ని)

చ. స్నానాది జప తప యోగ ధ్యాన
సమాధి సుఖ ప్రద
సీతా నాథ సకల లోక పాలక
త్యాగరాజ సన్నుత (ని)

ninnE bhajana sEyu vADanu

pannaga zAyi parula vEDa lEnu (ninnE)

snAn(A)di japa tapa yOga dhyAna
samAdhi sukha prada 
sItA nAtha sakala lOka pAlaka
tyAgarAja sannuta (ninnE)

Gist
O Lord reclining on the couch of zESa!
O Lord who bestows all the comforts that accrues from such actions like bath in holy waters, mental repetition of Your names (with rosary), penance, asceticism, meditation and identification with object of meditation etc! O Consort of sItA! O Nourisher of the entire Worlds! O Lord well-praised by this tyAgarAja!
I chant Your names only.
I shall not beseech others.

Saturday, October 11, 2008

నారాయణ స్తోత్రం


Audio donwload link : Priya sisters
నారాయణ నారాయణ జయగోవింద హరే 
నారాయణ నారాయణ జయగోపాల హరే  
కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ (1)
నవనీరద సంకాశ కృతకలికల్మషనాశ నారాయణ  (2)
యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ (3)
పీతాంబరపరిధాన సురకల్యాణనిధాన నారాయణ  (4)
మంజులకుంజాభూష మాయామానుషవేష నారాయణ (5)
రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ  (6)
మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ (7)
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ(8) 
జలరుహదలనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ(9)
పాతకరజనీసంహర కరుణాలయ మాముధ్ధర నారాయణ(10) 
అఘబకక్షయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ (11)
హాతకనిభ పీతాంబర అభయం కురు మే మామవ నారాయణ  (12)
దశరథరాజ కుమార దానవమద సంహార నారాయణ (13)
గోవర్ధనగిరిరమణ గోపీమానసహరణ నారాయణ  (14)
సరయూతీరవిహార సజ్జన ఋషిమందార నారాయణ (15)
విశ్వామిత్రమఖత్ర వివిధపరాసుచరిత్ర నారాయణ (16)
ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ (17)
జనకసుతాప్రతిపాల జయజయ సంస్మృతిలీల నారాయణ  (18)
దశరథవాగ్ధృతిభార దండకవనసంచార నారాయణ (19)
ముష్టికచానూరసంహార మునిమానసవిహార నారాయణ (20)
వాలినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ(21)
మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ (22)
జలనిధిబంధనధీర రావణకంఠవిదార నారాయణ(23)
తాటకమర్దనరామ నటగుణవివిధధనాఢ్య నారాయణ (24) 
గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ (25)
సంభ్రమసీతాకార సాకేతపురవిహార నారాయణ  (26)
అచలోద్ధృతిచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ(27) 
నైగమగానవినోద రక్షితసుప్రహ్లాద నారాయణ  (28)
ఇతిశ్రీమత్ శంకరాచార్యవిరచిత నారాయణ స్తోత్రం



Saturday, September 20, 2008

త్యాగరాజ యోగ వైభవం


ఈ దీక్షితార్ కీర్తన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.
ఆనంద భైరవి రాగంలో స్వరపరచబడిన ఈ కృతి లో రెండురకాల యతులను దీక్షితార్ వారు అధ్బుతంగా ప్రకటించారో చూడండి.


Click here to listen/download this kriti
పల్లవి
త్యాగరాజ యోగ వైభవం సదాశివం
త్యాగరాజ యోగ వైభవం సదాశ్రయామి
త్యాగరాజ యోగ వైభవం 
అగ రాజ యోగ వైభవం
రాజ యోగ వైభవం 
యోగ వైభవం
వైభవం 
భవం 
వమ్

సమష్టి చరణమ్
నాగ రాజ వినుత పదం నాద బిందు కలాస్పదం
యోగి రాజ విదిత పదం యుగపద్భోగ మోక్ష ప్రదమ్
యోగ రూఢ నామ రూప విశ్వ సృష్ట్యాది కరణం
యుగ పరివృత్యబ్ద మాస దిన ఘటికాద్యావరణమ్
(మధ్యమ కాల సాహిత్యమ్)
శ్రీ గురు గుహ గురుం సచ్చిదానంద భైరవీశం
శివ శక్త్యాది సకల తత్వ స్వరూప ప్రకాశం
శం 
ప్రకాశం
స్వరూప ప్రకాశం
తత్వ స్వరూప ప్రకాశం
సకల తత్వ స్వరూప ప్రకాశం
శివ శక్త్యాది సకల తత్వ స్వరూప ప్రకాశమ్
Muthuswami Dikshitar's song: Tyagarajayoga Vaibhavam in
Anandabhairavi contains the two Yatis - Gopuccha Yati and
Srotovaha Yati. The phrases are:
For Gopuccha Yati (like a cow's tail!):
Tyagaraja Yoga Vaibhavam
Agaraja Yoga Vaibhavam
Rajayoga Vaibhavam
Yoga Vaibhavam
Vaibhavam
Bhavam
Vam
and the Srotovaha Yati (Flowing r iver) in
sam
Prakasham
Svaroopa Prakasham
Tattva Svaroopa Prakasham
Sakala Tattva Svaroopa Prakasham
Sivasaktyadi Sakala Tattva Svaroopa Prakasham

Wednesday, June 25, 2008

కాకతాళీయంగా !

అనగనగ ఒక కాకి రుయ్ మని ఎగురుకుంటూ వచ్చి తాటి చెట్టు మీద వాలిందట. అది అలావాలిందో లేదో , చెట్టుకున్న ఒక తాటి కాయ కిందపడింది.
అది చూశి, మన కాకి గారు , ఆహా ! మన బరువు తట్టుకోలేక తాటి కాయ క్రింద పడింది అని జబ్బలు (రెక్కలు) చరుచుకుందట.


ఇదండి, "కాకతాళీయంగా ! " అన్న పదం హిస్టరీ !