Friday, December 31, 2010

నన్నిడిసి పెట్టెల్లినాడే! , యెంకి పాటలు

Audio link : play list Sri Srirangam Gopalaratnam
రచన: నండూరి సుబ్బారావు
నన్నిడిసి పెట్టెల్లినాడే!
నా రాజు....


మొన్న తిరిగొస్తనన్నాడే!
నీలుతేబోతుంటె, నీతోడె - వోలమ్మి!
నాయెంటె యెవరోను నడిసి నట్టుంటాదె!
నన్నిడిసి పెట్టెల్లినాడే
నా రాజు....

అద్దములో సూత్తుంటె అది యేటో సిగ్గమ్మి!
నా యనక యెవురోను నవ్వి నట్టుంటాదె!
నన్నిడిసి పెట్టెల్లినాడే
నా రాజు....

సల్లని యెన్నెట్లో సాపేసి కూకుంటె...
ఒట్టమ్మి - ఒల్లంత ఉలికులికిపడతాదె!
నన్నిడిసి పెట్టెల్లినాడే
నా రాజు....

నీతైనవోడె, నా రాతెట్ట గుంటాదో!
కళ్ళలో సత్తెముగ కట్టినట్టుంటాదె!
నన్నిడిసి పెట్టెల్లినాడే
నా రాజు...
మొన్న తిరిగొస్తనన్నాడే!


Monday, December 13, 2010

బడలిక తీర పవ్వళించవే - త్యాగరాజ కృతి , రీతిగౌళ రాగం

ప. బడలిక తీర పవ్వళించవే

అ. సడలని దురితములను తెగ కోసి
సార్వభౌమ సాకేత రామ (బ)

చ. పంకజాసనుని పరితాపము కని
పంకజాప్త కుల పతివై వెలసి
పంకజాక్షితో వనమునకేగి
జింకను వధియించి
మంకు రావణుని మదముననణచి
నిశ్శంకుడగు విభీషణునికి బంగారు
లంకనొసగి సురుల బ్రోచిన
నిష్కళంక త్యాగరాజుని హృదయమున (బ) 

Monday, December 6, 2010

వేదాల్లో ఏముంది , పులిహోర ?

వేదాల్లో ఏముంది , పులిహోర ? మా సాఫ్ట్ వేర్ స్నేహితుడు ఒకరోజు లంచ్ అయ్యాక తిన్నది అరగటానికి అలా గాలికి తిరుగుతూ లోకాభిరామాయణం చర్చించుకునే సమయంలో లేవనెత్తిన టాపిక్. ఇదే ప్రశ్నని చాలా సార్లు అడిగేవాడు, ఆ అడిగే విధానంలో తెలుసుకుందామనే జిజ్ఞాస కంటె వెటకారమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది నాకు. వేదం లో మొత్తం శాఖలు 1195. ఆది శంకరుల కాలం అంటే దాదాపు ఒక 1500 సంవత్సరాల క్రితం వరకు అన్ని శాఖలు అందుబాటులో ఉన్నట్లు మనకి ఆధారలు ఉన్నాయి. అందులొ మనకి ఇప్పుదు మిగిలింది 7. అంతె , 1 % కంటే తక్కువ. ఈ 7 శాఖలని రేవెళ్ళ అవధానులు గారు, ఒక మహారాష్ట్ర పండితుడి చేత చదివించి రికార్డు చేయించటానికి 10 సంవత్సరాల క్రితం పూనుకున్నారు , ఇంక 40 సంవత్సరాల పని మిగిలి ఉందని అంటున్నారు. వేద పరిధి ని తెలుసుకోవటానికి ఈ ఉదాహరణ చాలు. ఒక చిన్న నెల పరీక్షకు సిలబస్ మొత్తం చదివే ఓపిక లేక , ఒకరాత్రి బ్యాటింగ్ చెస్తూ డిగ్రేఏలు సంపాదించే మనకి , ఒక వేదశాఖని 12 సంవత్సరాలు కష్టాపడి నేర్చుకునే ఓపిక వస్తుందా ? ఒక వేద శాఖకి 12 సంవత్సరాలు పడితే , ఇక 1100+ శాఖలకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది , ఆలోచించండి. అందుకే 4 భాగాలుగా విభజించారు. ఇప్పుడు లభ్యమైన 7 శాఖలని నేర్చుకోవటానికి మన కలికాలపు బుర్రలకి జీవితాలు చాలిచావటం లేదు. మనలాంటి మహనుభావులు పుడతారని తెలీదు కాబోలు వేదాలని కొంచెం క్లిష్టాంగా సృష్టించాడు బ్రహ్మ. కెన్నిగన్ రిచీ వ్రాసిన సి పుస్తకం చదవలేక యస్వంత్ కనిత్కర్ లెట్ ఉస్ సి చదివే పులిహార గాళ్ళం మనం. మనకి వేదాల్లో ఎముందో ఎలా తెలుస్తుంది ?[The value of pi is embedded in compled slokas . and also the concept of inifinity, error correction/detection methods , calculas and details of geometry. http://www.hindupedia.com/en/Mathematics_of_the_Vedas ] ఇవన్ని భగవంతుని ఉపాసనా విధాన్ని వివరిస్తూ చెప్పిన విశేషాలే కాని , ఇఈఈ పేపర్లు కావు. పిచ్చి హిందూ సన్యాసులు ఆత్మ/దేవుడి మీద చేసిన పరిశోధన రుద్దుకునే సబ్బుల మీద తిరిగే కార్ల మీద చెయ్యలేదు. అయినా , సిరివెన్నెల పాటలు అర్థం కాని మన బుఱ్ఱలకి వేదాల్లో ఎముందో ఇట్టే ప్రయత్నం లేకుండా తెలిసిపోవాలి. తెలియనందుకు వేదాల్లో ఉన్నది పులిహోర అని విమర్శలు, అలా తెలియజెప్పనందుకు ఈ హిందూ మతం చెడ్డది , దీనికి ఈ గతే పట్టాలి అని సెటైర్లూ. రేమెళ్ళ అవధానులు గారు , వేదాల్లో ఆయన గమనించిన , ఇప్పటి జనాలకి కావాల్సిన కొన్ని విషయాలని ఈ పుస్తకంలో అందించారు. వేదాల్లో ఎముంది అనేవాళ్ళకి? ఎముందో తెలుసుకోవలనుకునే వాళ్ళకి(రెండిట్లోతేడా ఉందండోయ్) ఈ పుస్తకం చక్కటి సమాధానం.[Title of the book : SCIENCE AND TECHNOLOGY IN VEDAS AND SASTRAS Author : Dr.RVSS Avadhanulu ]
Book Review and Where you can get it :

Saturday, November 13, 2010

వర్ణం - బాలమురళి - అమ్మా ఆనంద దాయిని , గంభీరనాట


Wonderful Varnam written and composed by MBK.
Audio link : Dr.Mangalampalli Balamuralikrishna (from fusion album sensations)
Veena by Rajesh Vaidhya , album:SilkenStrings
ప: అమ్మా ఆనంద దాయిని అకార ఉకార మకార రూపిణి
అను: విమ్మ నిను నమ్మిట బాల మురళీగానము చేసి ధన్యుడనైతిని
(ముక్తాయి స్వర)
నీ నిర్వికార నిరామయ మూర్తి తరణి శత కిరణ సుశమ మయము గని
లిచే ఇది సకలము నవరస భరితము నిరతము నిరవధిక సుఖములనుభవ
(ఎత్తుగడ)
శివే శివే శివే వే వేల వరా లరా శివే మొరాలించు
1: సదా నంతా నందామ్ర్తం సత్యం గీతం/సదానందామృతం సత్సంగీతం
2: ఏది నిజం బెయ్యద సత్యమని తెల్పగ ప్రార్థింతును నే తెలియ
3: ఇన బింబ సమాన ముఖ బింబ కదంబ నికురుంబ మదంబ ఉమసాంబ
4: అంతర్యాగమున నిను గొలిచి పురాక్ర్త ఖలముల విముక్తునిగ
నేనైతి సకల శుభ గుణా వినుత మునిగణావన గుణ త్రి-
గుణాతీతా విధిహరి గణపతి శరవణభవ శుక సనక అసుర సుర
గణ రతిపతి సురపతి వినుత శివే నిరతిశయ శివే శివే పరమ పర
(note : kindly let me know if there are any mistakes in the above lyrics...)

youtube play list : ArunaSairam, Prince Varma , MBK,

Sunday, October 17, 2010

పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కృపాకరి శంకరి - మహా వైద్యనాథ అయ్యర్ - జనరంజని రాగం


Audio link :
Composer : Sri MahaVaidhyanatha Iyer


పల్లవి
పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కృపాకరి శంకరి

అనుపల్లవి
ఏహి సుఖం దేహి సింహవాహిని దయా ప్రవాహిని మోహిని

చిట్ట స్వరం
పా ప మ రి స ధ ప ప మ మ రి రి స రి స రి గ మ పా సా రి గ
మ పా ధ ప మ ప ధ ప నీ స ప ని స రి స రి గ మ రి
సా స ధ ప మ రీ సా రి గ మ

చరణం
భండ చండ ముండ ఖండని మహిశ భంజని రంజని నిరంజని
పండిత శ్రీ గుహదాస పోషణి సుభాషిణి రిపు భీషణి వర భూషణీ


Saturday, October 16, 2010

శ్రీ కమలాంబికాయాం భక్తిం కరోమి -దీక్షితార్ - సహాన రాగం

శ్రీ కమలాంబికాయాం భక్తిం - రాగం సహాన - తాళం త్రిపుట
Audio link : 
పల్లవి
శ్రీ కమలాంబికాయాం భక్తిం కరోమి
శ్రిత కల్ప వాటికాయాం చండికాయాం జగదంబికాయాం
అనుపల్లవి
రాకా చంద్ర వదనాయాం రాజీవ నయనాయాం
పాకారి నుత చరణాయాం ఆకాశాది కిరణాయాం
(మధ్యమ కాల సాహిత్యం)
హ్రీంకార విపిన హరిణ్యాం హ్రీంకార సు-శరీరిణ్యాం
హ్రీంకార తరు మంజర్యాం హ్రీంకారేశ్వర్యాం గౌర్యాం
చరణం
శరీర త్రయ విలక్షణ సుఖ-తర స్వాత్మానుభోగిన్యాం
విరించి హరీశాన హరి-హయ వేదిత రహస్య యోగిన్యాం
పరాది వాగ్దేవతా రూప వశిన్యాది విభాగిన్యాం
చరాత్మక సర్వ రోగ హర నిరామయ రాజ యోగిన్యాం
(మధ్యమ కాల సాహిత్యం)
కర ధృత వీణా వాదిన్యాం కమలా నగర వినోదిన్యాం
సుర నర ముని జన మోదిన్యాం గురు గుహ వర ప్రసాదిన్యాం

Thursday, October 14, 2010

సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే - G.N.బాలసుబ్రమణ్యన్ - సరస్వతి రాగం


పల్లవి
సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే

అనుపల్లవి
కరధృత వీణా పుస్తక వరమణి మాలాలంకృత

చరణం
నరహరి సుత విధి లాలిత నవమణి యుత కంభుగళే
సుర సేవిత పద యుగళే సుధాకర సమధవళే
composer : G.N.Balasubramaniyan
Audio :
Trichur V Ramachndran

Youtube Playlist (Priya Sisters, Sri U Sriram Kaushik(flute), Sri S.Sowmya, Sri Chandrika pai, Sri Lakshmi narayana, Sri Jyothsna Srikant (voilin) )

Wednesday, October 13, 2010

భాగ్యద లక్ష్మీ బారమ్మ - పురందరదాసు కీర్తన - మధ్యమావతి రాగం

Audio : Sri ML Vasantakumari
Sri Chitra
Sri Bhimsen Joshi

Sri Seshampathi T Sivalimgam (nadaswaram)
Sri Kadri Gopalanath (Saxophone)
Sri Nadaswaroopam G Ramesh (fusion)
భాగ్యద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ
సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ

హెజ్జెయ మేలే హెజ్జెయ నిక్కుత
గెజ్జె కాల్గళ ధ్వనియ1 తోరుత
సజ్జన సాధు పూజెయ వేళెగె
మజ్జిగెయొళగిన బెణ్ణెయంతె

కనక వృష్టియ కరెయుత బారె
మనకామనెయ2 సిద్ధియ తోరె
దినకర కోటి తేజది హొళెయువ
జనకరాయన కుమారి బేగ

అత్తిత్తగలద భక్తర మనెయలి - నిత్య మహోత్సవ నిత్య సుమంగళ
సత్యవ తోరువ సాధు సజ్జనర - చిత్తది హొళెవ పుత్థళి బొంబె

సంఖ్యెయిల్లద భాగ్యవ కొట్టు - కంకణ కైయ తిరువుత బారె
కుంకుమాంకిత పంకజ లోచనె - వెంకటరమణన బింకద రాణి

సక్కరె తుప్పద కాలువె హరిసి - శుక్రవారద పూజెయ వేళెగె
అక్కరెయుళ్ళ అళగిరి రంగన - చొక్క పురందర విఠలన రాణి
Youtube Play list : Sri MS Subbalakshmi, Sri Bhimsen Joshi, Sri Sudha Raghunathan

Tuesday, October 12, 2010

శ్రీ గాయత్రీ దేవీ సనాతని - ఓగిరాల వీరరాఘవ శర్మ - వలజి రాగం


శ్రీ గాయత్రీ దేవీ సనాతని - ఓగిరాల వీరరాఘవ శర్మ - వలజి రాగం
listen to this krit online (use Internet Explorer, and click on the "play song" which is on the right side) photo of composer from karnatik.com

Audio link : SubhashiniSowmya, Sushma Nittala
పల్లవి
శ్రీ గాయత్రీ దేవీ సనాతని సేవక జన సుశ్రేయోదాయిని

అనుపల్లవి
వాగాధిపతి సురేంద్ర పూజితే వరదాయకి పంచదనే సువా(హా)సిని

చరణం
రాగద్వేష రహితాంతరంగ హితే రత్నకచిత మణిహార మణ్డితే
రసయుత సంగీత మోదితే రాఘవాది భక్త రక్షణ చరితే

Another version by Kum.Tripada (recorded in Shilparamam Hyd , 12/10/2010 @7pm with my phone) , ఇవాళ శిల్పారామం వెళ్ళివుండకపోతే , నాకు ఈ కీర్తన వినే భాగ్యం దక్కేది కాదెమో !

Monday, October 11, 2010

దారిని తెలుసుకొంటి త్రిపుర సుందరి - త్యాగరాజ - శుద్ధసావేరి

త్యాగరాజ  కృతి - శుద్ధసావేరి
------------------------------
Audio link:
Flute Sri.N.Ramani from my fav fusion album UNIQUE

Sri Maharajapuram Santanam
Sri Bombay Jayashri
Sri M.L.Vasantakumari (till 10min alapana)
ప. దారిని తెలుసుకొంటి త్రిపుర - సుందరి నిన్నే శరణంటి

అ. మారుని జనకుడైన మా దశరథ - కుమారుని సోదరి దయా-పరి మోక్ష (దా)

చ1. అంబ త్రి-జగదీశ్వరి ముఖ జిత విధు - బింబ ఆది పురమున నెలకొన్న
కనకాంబరి నమ్మిన వారికభీష్ట - వరంబులొసగు దీన లోక రక్షకి
అంబుజ భవ పురుహూత సనందన - తుంబురు నారదులందరు నీదు
పదంబును కోరి సదా - నిత్యానందాంబుధిలోనోలలాడుచుండే (దా)

చ2. మహదైశ్వర్యమొసగి తొలి కర్మ - గహనమును కొట్టి బ్రోచు తల్లి
గుహ గజ ముఖ జనని అరుణ పంకే- రుహ నయనే యోగి హృత్సదనే
తుహినాచల తనయా నీ చక్కని - మహిమాతిశయమ్ముల చేతను ఈ
మహిలో ముని గణములు ప్రకృతి - విరహితులై నిత్యానందులైన (దా)

చ3. రాజిత మణి గణ భూషణి మద గజ - రాజ గమని లోక శంకరి దనుజ
రాజ గురుని వాసర సేవ - తనకే జన్మ ఫలమో కనుగొంటిని
ఆ-జన్మము పెద్దలు తమ మదిలో - నీ జపమే ముక్తి మార్గమనుకొన
రాజ శేఖరుండగు శ్రీ త్యాగరాజ - మనో-హరి గౌరి పరాత్పరి (దా)

Youtube Playlist : PriyaSisters(Sri Shanmukhapriya and Sri haripriya), Sri MS Subbalakshmi, Sri A.Kanyakumar(violin)

Sunday, October 10, 2010

సకల లోకనాయికే త్వమేవ - ఊతుక్కాడు వెంకటకవి - ఆరభి

ఊతుక్కాడు వెంకటకవి - ఆరభి
Audio : Sri Bombay Jayashri

పల్లవి :
సకల లోకనాయికే త్వమేవ
శరణం ప్రపద్యే

మధ్యమకాలం:
సర్వరోగహరచక్రమయి
సర్వానందమయి మంగళమయి

అనుపల్లవి:
అ క చ ట త ప య ర ల వ శాది క్షాంత
అక్షరమయి వాఙ్మయి చిన్మయి
శుకనారదకుంభజమునివర
శృతిదాయక జనసన్నుతే

మధ్యమకాలం:
నాగనాయక శతదసారఫణ(?)
లోకవహితధరకరవలయే
లోకలోకసమ్మోహితహితకర
సిధ్ధిబుధ్ధినతపురనిలయే

చరణం:
భవరోగహరవైభవే
పరమకల్యాణగుణనికరే
నవరసాలంకారకావ్యనాటక
వర్ణితే శుభకరే
కువళయదళనవనీలశరీరి(ర)
గోవిందసోదరి శ్రీకరి
శివహృదయకమలనిలయే
త్రిపురసిద్ధీశ్వర నటశ్రీనగరే

మధ్యమకాలం:
అవనతరహస్యయోగినికూలే
శతదినసమకరముఖద్యుతిజలే(?)/
శతదినసమకరద్యుతిముఖజాలే
భువనప్రసిద్ధహ్రీంకార
కామేశ్వరబీజమంత్రమూలే

Friday, October 8, 2010

హిమాచల తనయ బ్రోచుటకి - శ్యామశాస్త్రి , ఆనందభైరవి రాగం

శ్యామశాస్త్రి కృతి, ఆనందభైరవి రాగం
------------------------------------
Audio link
హిమాచల తనయ బ్రోచుటకి
ది మంచి సమయము రావే అంబా ||

కుమార జనని సమానమెవరిల
ను మానవతి శ్రీ బ్రుహన్నాయకి ||

సరోజముఖి బిరాన నీవు
వరాలొసగుమని నేను వేడితి
పురారి హరి సురేంద్రనుత
పురాణి పరా ముఖ మేలనే తల్లి ||

ఉమా హంస గమా తామ
సమా బ్రోవ దిక్కెవరు నిక్కముగ
ను మాకిపుడభిమానము చూపు
భారమా వినుమా దయ తోను ||

సదా నత వర దాయకి ని
జ దాసుడను శ్యామక్రిష్ణ సోదరి
గదా మొర వినవా దురిత
విదారిణి శ్రీ బ్రుహన్నాయకి ||

1.Sri M.BalamuraliKrishna


2.Sri S.Sowmya

కనకశైల విహారిణీ అంబ - శ్యామశాస్త్రి , పున్నాగవరాళి రాగం


రాగం: పున్నాగవరాళి
తాళం: ఆది
-> original painting of Shyama sastry


పల్లవి:
కనకశైల విహారిణీ అంబ - కామకోటీ బాలే, సుశీలే
అనుపల్లవి:
వనజభవహరి నుతే దేవి - హిమగిరిజే లలితే సతతం
వినతం మాం పరిపాలయ శంకర - వనితే సతి మహాత్రిపుర సుందరి

చరణం:
1. చండ భండన ఖండన పండితేక్షు
ఖండ కోదండమండితపాణే
పుండరీక నయనార్చిత పద
పురవాసిని శివే హరవిలాసిని

2. కంబుకంఠి కంజసదృశ వదనే
కరిరాజ గమనే మణిసదనే
శంబరవిదారి తోషిణీ
శివ శంకరి సదా మధురభాషిణి

3. శ్యామలాంబికే భవాబ్ధితరణే
శ్యామకృష్ణ పరిపాలిని జననీ
కామితార్ధ ఫలదాయకి
కామాక్షి సకలలోక సాక్షి

Youtube play list : MSS, Sowmya, Chitra, T.K.Govinda Rao,

Sunday, September 19, 2010

నిను వినా నా మదియెందు - త్యాగరాజ కృతి, నవరసకన్నడ రాగం


who said classical is slow, listen to this kriti.singer : Sri M.S.Subbalkshmi.
ప. నిను వినా నా మదియెందు నిలువదే శ్రీ హరి హరి

అ. కనులకు నీ సొగసెంతో క్రమ్మియున్నది గనుక (నిను)

చ1. నీదు కథలు వీనులందు నిండియున్నది రామ
శ్రీ-ద నీ నామము నోట చెలగియున్నది గనుక (నిను)

చ2. నేనుయెచట జూచినను నీవైయున్నది రామ
భాను వంశ తిలక నీదు భక్తుడనుచు పేరు గనుక (నిను)

చ3. కపటమౌ మాటలెల్ల కమ్మనైనది రామ నా
తపము యోగ ఫలము నీవే త్యాగరాజ సన్నుత (నిను)



Sunday, July 25, 2010

నన్ను విడిచి కదలకురా రామయ్య వదలకురా -



త్యాగరాజ కృతి, రీతిగౌళ రాగం
veena : Jayanthi Kumaresh
ప. నన్ను విడిచి కదలకురా రామయ్య వదలకురా

అ. నిన్ను బాసియర నిమిషమోర్వనురా (న)

చ1. తరము కానియెండ వేళ కల్ప
తరు నీడ దొరిగినట్లాయెనీ వేళ (న)

చ2. అబ్ధిలో మునిగి శ్వాసమును పట్టి
ఆణి ముత్యము కన్నట్లాయె శ్రీ రమణ (న)


చ3. వసుధను ఖననము చేసి ధన
భాండమబ్బిన రీతి కనుకొంటి డాసి (న)

చ4. వడలు తగిలియున్న వేళ గొప్ప
వడ-గండ్లు కురిసినట్లాయెనీ వేళ (న)


చ5. బాగుగ నన్నేలుకొమ్ముయిల
త్యాగరాజ నుత తనువు నీ సొమ్ము (న)

sung by , Sri Maharajapuram Santanam

Tuesday, June 8, 2010

మేలుకో దయానిధి , త్యాగరాజ కృతి , రాగం : సౌరాష్ట్రం

ప. మేలుకో దయా నిధీ మేలుకో దాశరథీ

అ. మేలుకో దయా నిధీ మిత్రోదయమౌ వేళ (మే)

చ1. వెన్న పాలు బంగారు గిన్నలో నేనుంచినాను
తిన్నగారగించి తేట కన్నులతో నన్ను జూడ (మే)

చ2. నారదాది మునులు సురులు వారిజ భవుడిందు కలా
ధరుడు నీ సన్నిధిలో కోరి కొలువు కాచినారు (మే)

చ3. రాజ రాజాది దిగ్రాజులెల్ల వచ్చినారు
రాజ నీతి తెలియ త్యాగరాజ వినుత నన్ను బ్రోవ (మే)

Audio : Sri Mangalampalli Balamuralikrishna

Friday, May 14, 2010

మేలుకోవయ్య మమ్మేలుకో రామ - త్యాగరాజ కృతి, బౌళి రాగం


ప. మేలుకోవయ్య మమ్మేలుకో రామ | మేలైన సీతా సమేత నా భాగ్యమా

చ1. నారదాదులు నిన్ను కోరి నీ మహిమ- లవ్వారిగా పాడుచున్నారిపుడు తెల్ల
వారగా వచ్చినది శ్రీ రామ నవనీత - క్షీరములు బాగుగానారగింపను వేగ (మే)

చ2. ఫణి శయన అనిమిష రమణులూడిగము సేయ - అణుకువగ నిండారు ప్రణుతి జేసెదరు
మణి-మయాభరణులౌ అణిమాదులిడు దీప- మణులు తెలుపాయెను తరణి వంశ వర తిలక (మే)

చ3. రాజ రాజేశ్వర భ-రాజ ముఖ సాకేత - రాజ సద్గుణ త్యాగరాజ నుత చరణ
రాజన్య విబుధ గణ రాజాదులెల్ల నిను - పూజింప కాచినారీ జగము పాలింప
(మే)

Thursday, May 6, 2010

నరసింహాగచ్చ - మోహన రాగం , దీక్షితార్ కృతి

Audio link : Sri Mangalampalli Balamuralikrishna (esnips not working will provide another link soon)

Alternative link 1
Alternative link 2
పల్లవి
నరసింహాగచ్చ
పర-బ్రహ్మ పుచ్చ స్వేచ్ఛ స్వచ్ఛ

అనుపల్లవి
హరి హర బ్రహ్మేంద్రాది పూజితాత్యచ్ఛ
పరమ భాగవత ప్రహ్లాద భక్త్యచ్ఛ

చరణం
ధీర-తర ఘటికాచలేశ్వర
సౌర-తర హేమ కోటీశ్వర
వీర వర మోహన విభాస్వర
మార వర మానవ హరీశ్వర

(మధ్యమ కాల సాహిత్యం)
ముర హర నగ ధర సరసిజ కర
పరమ పురుష పవనజ శుభ-కర
సురుచిర కరి గిరి వరద విచర
సరస గురు గుహ హృదయ సహ-చర

Monday, January 25, 2010

నాద తనుమనిశం శంకరం

త్యాగరాజ - చిత్తరంజని రాగం

raga : chittaranjani
Audio : Sri Maharajapuram Santanam
ప. నాద తనుమనిశం శంకరం
నమామి మే మనసా శిరసా

అ. మోదకర నిగమోత్తమ సామ
వేద సారం వారం వారం (నా)

చ. సద్యోజాతాది పంచ వక్త్రజ
స-రి-గ-మ-ప-ధ-ని వర సప్త-స్వర
విద్యా లోలం విదళిత కాలం
విమల హృదయ త్యాగరాజ పాలం
(నా)