Monday, December 13, 2010

బడలిక తీర పవ్వళించవే - త్యాగరాజ కృతి , రీతిగౌళ రాగం

ప. బడలిక తీర పవ్వళించవే

అ. సడలని దురితములను తెగ కోసి
సార్వభౌమ సాకేత రామ (బ)

చ. పంకజాసనుని పరితాపము కని
పంకజాప్త కుల పతివై వెలసి
పంకజాక్షితో వనమునకేగి
జింకను వధియించి
మంకు రావణుని మదముననణచి
నిశ్శంకుడగు విభీషణునికి బంగారు
లంకనొసగి సురుల బ్రోచిన
నిష్కళంక త్యాగరాజుని హృదయమున (బ) 

No comments: