Monday, December 6, 2010

వేదాల్లో ఏముంది , పులిహోర ?

వేదాల్లో ఏముంది , పులిహోర ? మా సాఫ్ట్ వేర్ స్నేహితుడు ఒకరోజు లంచ్ అయ్యాక తిన్నది అరగటానికి అలా గాలికి తిరుగుతూ లోకాభిరామాయణం చర్చించుకునే సమయంలో లేవనెత్తిన టాపిక్. ఇదే ప్రశ్నని చాలా సార్లు అడిగేవాడు, ఆ అడిగే విధానంలో తెలుసుకుందామనే జిజ్ఞాస కంటె వెటకారమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది నాకు. వేదం లో మొత్తం శాఖలు 1195. ఆది శంకరుల కాలం అంటే దాదాపు ఒక 1500 సంవత్సరాల క్రితం వరకు అన్ని శాఖలు అందుబాటులో ఉన్నట్లు మనకి ఆధారలు ఉన్నాయి. అందులొ మనకి ఇప్పుదు మిగిలింది 7. అంతె , 1 % కంటే తక్కువ. ఈ 7 శాఖలని రేవెళ్ళ అవధానులు గారు, ఒక మహారాష్ట్ర పండితుడి చేత చదివించి రికార్డు చేయించటానికి 10 సంవత్సరాల క్రితం పూనుకున్నారు , ఇంక 40 సంవత్సరాల పని మిగిలి ఉందని అంటున్నారు. వేద పరిధి ని తెలుసుకోవటానికి ఈ ఉదాహరణ చాలు. ఒక చిన్న నెల పరీక్షకు సిలబస్ మొత్తం చదివే ఓపిక లేక , ఒకరాత్రి బ్యాటింగ్ చెస్తూ డిగ్రేఏలు సంపాదించే మనకి , ఒక వేదశాఖని 12 సంవత్సరాలు కష్టాపడి నేర్చుకునే ఓపిక వస్తుందా ? ఒక వేద శాఖకి 12 సంవత్సరాలు పడితే , ఇక 1100+ శాఖలకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది , ఆలోచించండి. అందుకే 4 భాగాలుగా విభజించారు. ఇప్పుడు లభ్యమైన 7 శాఖలని నేర్చుకోవటానికి మన కలికాలపు బుర్రలకి జీవితాలు చాలిచావటం లేదు. మనలాంటి మహనుభావులు పుడతారని తెలీదు కాబోలు వేదాలని కొంచెం క్లిష్టాంగా సృష్టించాడు బ్రహ్మ. కెన్నిగన్ రిచీ వ్రాసిన సి పుస్తకం చదవలేక యస్వంత్ కనిత్కర్ లెట్ ఉస్ సి చదివే పులిహార గాళ్ళం మనం. మనకి వేదాల్లో ఎముందో ఎలా తెలుస్తుంది ?[The value of pi is embedded in compled slokas . and also the concept of inifinity, error correction/detection methods , calculas and details of geometry. http://www.hindupedia.com/en/Mathematics_of_the_Vedas ] ఇవన్ని భగవంతుని ఉపాసనా విధాన్ని వివరిస్తూ చెప్పిన విశేషాలే కాని , ఇఈఈ పేపర్లు కావు. పిచ్చి హిందూ సన్యాసులు ఆత్మ/దేవుడి మీద చేసిన పరిశోధన రుద్దుకునే సబ్బుల మీద తిరిగే కార్ల మీద చెయ్యలేదు. అయినా , సిరివెన్నెల పాటలు అర్థం కాని మన బుఱ్ఱలకి వేదాల్లో ఎముందో ఇట్టే ప్రయత్నం లేకుండా తెలిసిపోవాలి. తెలియనందుకు వేదాల్లో ఉన్నది పులిహోర అని విమర్శలు, అలా తెలియజెప్పనందుకు ఈ హిందూ మతం చెడ్డది , దీనికి ఈ గతే పట్టాలి అని సెటైర్లూ. రేమెళ్ళ అవధానులు గారు , వేదాల్లో ఆయన గమనించిన , ఇప్పటి జనాలకి కావాల్సిన కొన్ని విషయాలని ఈ పుస్తకంలో అందించారు. వేదాల్లో ఎముంది అనేవాళ్ళకి? ఎముందో తెలుసుకోవలనుకునే వాళ్ళకి(రెండిట్లోతేడా ఉందండోయ్) ఈ పుస్తకం చక్కటి సమాధానం.[Title of the book : SCIENCE AND TECHNOLOGY IN VEDAS AND SASTRAS Author : Dr.RVSS Avadhanulu ]
Book Review and Where you can get it :

4 comments:

మందాకిని said...

అన్ని శాఖలే...అమ్మో! ఎంత గొప్ప విషయమండీ!
సినిమా పాటలే అర్థం కాని యువతరం.... నిజమే!

durgeswara said...
This comment has been removed by a blog administrator.
కొత్త పాళీ said...

Interesting

Srinivas Udumudi said...

వేదాల్లో సైన్సు ఉంది అని అంటే వేదాలకి గౌరవం పెరుగుంది అనుకుని ఇలాంటివి (పుస్తకం) వ్రాసిన వాళ్ళని అంతగా పట్టించుకోనవసరం లేదు. సైన్సుకు గౌరవం ఉంది కాబట్టి వేదాలకీ గౌరవమా? లేక పోతే అక్కరలేదా?

వేదాలు అపౌరుషేయం అయినా, వాటిని 1800 BCE లో అని కొందరు, కాదు 4000 BCE లో అని కొందరు అమర్చారు అని అంటారు (నిజానికి, ఋగ్వేద సంహిత మాత్రమే.. మిగతావన్నీ ఆ తరువాతే). కానీ, 800 BCE కే వేదాలలో వ్రాసింది ఏంటి అని అర్ధం చేసుకోవడం కష్టం అయింది. అందుకే పూర్వ మీమాంస శాస్త్రం పుట్టింది. పద్నాలుగవ శతాబ్దం లో సాయనుడు వేదప్రకాశ అనే గ్రంధం లో వ్రాసిందే ఇప్పుడు వేదాల అర్థం అని భావిస్తారు (మన తరం వరకు).

గొప్పగా చెప్పుకోవలసినది ఏంటి అంటే, అర్థం తెలియక పోయినా వాటిని వల్లే వేస్తూ ఇలా ఇన్ని వేల సంవత్సరాలు పోడుపరచ్గలగడం. అది కూడా తప్పు లేకున్డా. తప్పులు వస్తాయేమో నని చాలా శాఖలు పెట్టారు. అంటే, ఒకే వేదాన్ని చాలా గ్రూప్స్ పొందుపరిస్తే, వాటిని సరిచూసుకుని ఎక్కడ తప్పులు దోర్లాయో తెలుసుకున్తారన్న మాట. మన CRC redundancy check లాగా.