తు. చ. లు సంస్కృత పదాలట.
సంస్కృత శ్లోకాలు రాసేటప్పుడు , కొన్ని నియమాలు ఉండేవట.
అందులో ఒకటి , "పంక్తి కి 8 అక్షరాలు ఉండాలి."
ఒక్కోసారి 8అక్షరాలు రాయటం కుదరనప్పుడు, కొన్ని అక్షరాలను ఉంచవచ్చు.(padding)
అవి :
తు, చ, స్వ, హి, వై, ....
ఉదా : రామాయ లక్ష్మనశ్చతు
మరి ఇవి తెలుగులోకి ఎలా వచ్చాయి ?
పూర్వ కాలంలో , సంస్కృత కావ్యాలను తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు , కొంత మంది కవులు, దేవభాష మీది గౌరవంతో , ఈ తు, చ, స్వ, హి, వై లకు కుద ఎవొ అర్ధాలు (కాని,మరియు...) కల్పించి అనువాదం చేసేవారట .
ఇలాంటి అనువాదాన్ని , తు.చ. తప్పకుండా అనువాదం చెయ్యటం అనేవారట.
అలా వచ్చింది ఈ "తు.చ. తప్పకుండా"
భక్తి టివి లొ గరికపాటి నరసింహా రావు గారు చెప్పగా విన్నాను.
Wednesday, February 6, 2008
Subscribe to:
Posts (Atom)