Wednesday, August 12, 2009

రామా ఇక నన్ను బ్రోవ రాదా దయ లేదా - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

సహానా రాగం లో శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి సంకీర్తన
Audio : Bombay Jayashree 
పల్లవి
రామా ఇక నన్ను బ్రోవ రాదా దయ లేదా శ్రీ
అనుపల్లవి
తామసంబు జేసితే ఇక తాళను పలరును వేడను
చరణం
ఆరు శత్రువులను బట్టి హతము జేసి

పూర్వార్జిత ఘోర పాపములను బోగొట్టి నే జేసినట్టి
నేరములను మన్నించి నీవే కావ వలెను గాని
వేరెవరున్నారు శ్రీ వేంకటేశ్వర దయాకర