
అ. మేలుకో దయా నిధీ మిత్రోదయమౌ వేళ (మే)
చ1. వెన్న పాలు బంగారు గిన్నలో నేనుంచినాను
తిన్నగారగించి తేట కన్నులతో నన్ను జూడ (మే)
చ2. నారదాది మునులు సురులు వారిజ భవుడిందు కలా
ధరుడు నీ సన్నిధిలో కోరి కొలువు కాచినారు (మే)
చ3. రాజ రాజాది దిగ్రాజులెల్ల వచ్చినారు
రాజ నీతి తెలియ త్యాగరాజ వినుత నన్ను బ్రోవ (మే)
Audio : Sri Mangalampalli Balamuralikrishna