Wednesday, February 22, 2012

హరి హరి రామ నన్నరమర జూడకు , hari hari rAma - రామదాసు కీర్తన


Audio link : Malladi Bros , kanada ragam 
Audio link : Sri Nedunuri Krishnamurthy teaching to Malladi bros in కానడ రాగం, ఆది తాళం

హరి హరి రామ నన్నరమర జూడకు
నిరతము నీ నామస్మరణ మేమరను


దశరధ నందన దశముఖ మర్దన
పశుపతి రంజన పాప విమోచన


మణిమయ భూషణ మంజుల భాషణ
రణ జయ భీషణ రఘుకుల పోషణ


పతితపావన నామ భద్రాచలధామ
సతతము శ్రీరామదాసు నేలు రామ