Thursday, October 29, 2009

సామెతలు - 1

మొగుడు మొట్టితే ఏడవలేదు గాని, తోడికోడలు నవ్విందని ఏడిచిందట
ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట
మొదలులేదుమొగుడ అంటే పెసరపప్పు వండు పెళ్ళామా అన్నాడట
అనగా అనగా రాగం తినగా తినగా రోగం
రాత రాజ్యమెలుదామంటే బుధ్ధి భూమినేలుదామంటుందట(దున్నుదామంటుంది)
అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
మంచోడు మంచోడు అంటే మంచమెక్కి ఉచ్చపోశాడట
నాడా దొరికిందని గుఱ్ఱాన్ని కొన్నాడాట వెనకటికి
అప్పిచ్చువాడు బాగు కోరతాడు, తీసుకున్నవాడు చెడు కోరతాడు






No comments: