Saturday, November 14, 2009

ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైన - రామదాసు కీర్తన -

Audio link : Sri Nedunuri Krishnamurty

రామదాసు కీర్తన - రాగం : కాంభోజి
ఏమయ్య రామ బ్ర-హ్మేంద్రాదులకునైన
నీ మాయ దెలియ వశమా ?
కామారివినుతగుణ - ధామ కువలయదళ
శ్యామా నను గన్న
తండ్రీ రామా ||




చ:సుతుడనుచు దశరథుడు - హితుడనుచు సుగ్రీవు
డతి బలుండనుచు కపులు
క్షితినాథుడనుచు భూ- పతులు కొలిచిరిగాని
పతితపావనుడనుచు - మతిదెలియ లేరయిరి ||

చ: చెలికాడనుచు బాండ-వులు విరోధివటంచు
నల జరాసంధాదులు
కలవాడవని కుచేలుడు నెఱింగిరి గాని
జలజాక్షుడని నిన్ను - సేవింపలే రయిరి ||

చ:
నరుడవని నరులు తమ - దొరవనుచు యాదవులు
వరుడనుచు గోపసతులు
కరివరద భద్రాది- పురనిలయ రామదాస
పరమాత్ముడని నిన్ను - భావింపలేరైరి||

No comments: