Friday, January 28, 2011

హెచ్చరికగా రారా హే రామ చంద్ర - త్యాగరాజ కృతి , యదుకులకాంభోజి రాగం

Audio link : GeethaRaja
Audio link : MS Subbalakshmi
Audio link : Violin TN Krishnan
Audio link : Veena Mysore Doraiswamy Iyengar
ప. హెచ్చరికగా రారా హే రామ చంద్ర
హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర

అ. పచ్చ విల్తునికన్న పాలిత సురేంద్ర (హెచ్చరిక)

చ1. కనక మయమౌ మకుట కాంతి మెరయగను
ఘనమైన కుండల యుగంబు కదలగను
ఘనమైన నూపుర యుగంబు ఘల్లనను
సనకాదులెల్ల కని సంతసిల్లగను (హెచ్చరిక)

చ2. ఆణి ముత్యాల సరులల్లలాడగను
వాణి పతీంద్రులిరు వరుస పొగడగను
మాణిక్య సోపానమందు మెల్లగను
వీణ పల్కుల వినుచు వేడ్క చెల్లగను (హెచ్చరిక)

చ3. నిను జూడ వచ్చు భగిని కరంబు చిలుక
మనసు రంజిల్ల నీ మహిమలను పలుక
మిను వాసులెల్ల విరులను చాల జిలుక
ఘన త్యాగరాజు కనుగొన ముద్దు గులుక (హెచ్చరిక)

Video Play list Mangalampalli Balamulalikrishna, Bombay Jayashri


Wednesday, January 5, 2011

ఏహి ముదం దేహి శ్రీ కృష్ణ - నారాయణతీర్థ తరంగం , ఆనందభైరవి -

Audio link : Malladi Brothers (hummaa.com down)
YouTube link : Malladi Brothers
meaning from sangeethasudha.orgఏహి ముదం దేహి శ్రీ కృష్ణ మాం
పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ

నంద గోప నందన శ్రీ కృష్ణ కృష్ణ - యదు
నందన భక్త చందన కృష్ణ కృష్ణ ||

కలభగతిం దర్శయ శ్రీ కృష్ణ కృష్ణ - తవ
కర్ణౌ చలయ శ్రీ కృష్ణ కృష్ణ ||

ధావ ధావ మాధవ శ్రీ కృష్ణ కృష్ణ - నవ్య
నవనీత మాహర శ్రీ కృష్ణ కృష్ణ ||

విక్రమ బలం దర్శయ శ్రీ కృష్ణ కృష్ణ - విధి
శక్రాది సన్నుత శ్రీ కృష్ణ కృష్ణ ||

భవ్య నటనం కురు శ్రీ కృష్ణ కృష్ణ - బల
భద్ర సహోదర శ్రీ కృష్ణ కృష్ణ ||

చంచల మణి కుండల శ్రీ కృష్ణ కృష్ణ - చారు
చంపక నాస మౌక్తిక శ్రీ కృష్ణ కృష్ణ ||

కుంకుమ పంకిల దేహ శ్రీ కృష్ణ కృష్ణ - భక్త
శంకర చరణ శ్రీ కృష్ణ కృష్ణ ||

సాధు సాధు క్రుత మిహ శ్రీ కృష్ణ కృష్ణ - లొక
సాధక హితాయ శ్రీ కృష్ణ కృష్ణ ||

నారదాది మునిగేయ శ్రీ కృష్ణ కృష్ణ - శివ
నారాయణ తీర్థ వరద కృష్ణ కృష్ణ ||