Friday, January 28, 2011

హెచ్చరికగా రారా హే రామ చంద్ర - త్యాగరాజ కృతి , యదుకులకాంభోజి రాగం

Audio link : GeethaRaja
Audio link : MS Subbalakshmi
Audio link : Violin TN Krishnan
Audio link : Veena Mysore Doraiswamy Iyengar
ప. హెచ్చరికగా రారా హే రామ చంద్ర
హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర

అ. పచ్చ విల్తునికన్న పాలిత సురేంద్ర (హెచ్చరిక)

చ1. కనక మయమౌ మకుట కాంతి మెరయగను
ఘనమైన కుండల యుగంబు కదలగను
ఘనమైన నూపుర యుగంబు ఘల్లనను
సనకాదులెల్ల కని సంతసిల్లగను (హెచ్చరిక)

చ2. ఆణి ముత్యాల సరులల్లలాడగను
వాణి పతీంద్రులిరు వరుస పొగడగను
మాణిక్య సోపానమందు మెల్లగను
వీణ పల్కుల వినుచు వేడ్క చెల్లగను (హెచ్చరిక)

చ3. నిను జూడ వచ్చు భగిని కరంబు చిలుక
మనసు రంజిల్ల నీ మహిమలను పలుక
మిను వాసులెల్ల విరులను చాల జిలుక
ఘన త్యాగరాజు కనుగొన ముద్దు గులుక (హెచ్చరిక)

Video Play list Mangalampalli Balamulalikrishna, Bombay Jayashri


No comments: