Saturday, October 1, 2011

నవరాత్రి దేవి కృతులు : సరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీ , శ్యామశాస్త్రి కృతి, శంకరాభరణం రాగం

Audio link : Priya Sisters

Audio link : M.Balamuralikrishna
Audio link : 
Nadaswaram : DSD Desure Selvarathinam
పల్లవి
సరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీ
నీ పదాంబుజములే
సదా నమ్మినానమ్మా శుభమిమ్మా
శ్రీ మీనాక్షమ్మా


అనుపల్లవి
పారాకు సేయక వర దాయకీ నీ
వలే దైవము లోకములో గలదా
పురాణీ శుక పాణీ మధుకర వేణీ
సదా-శివునికి రాణీ (సరోజ)


చరణం 1
కోరి వచ్చిన వారికెల్లను
కోర్కెలొసగే బిరుదు గదా అతి
భారమా నన్ను బ్రోవ తల్లి
కృపాలవాల తాళ జాలనే (సరోజ)


చరణం 2
ఇందు ముఖీ కరుణించుమని నిను
ఎంతో వేడుకొంటిని
నాయందు జాగేలనమ్మా మరియాద
గాదు దయావతి నీవు (సరోజ)


చరణం 3
సామ గాన వినోదినీ గుణ
ధామ శ్యామ కృష్ణ నుతా శుక
శ్యామళా దేవీ నీవే గతి రతి
కామ కామ్యద కావవే నన్ను (సరోజ)

Youtube video playlist : Yesdas, PriyaSisters and Violin : Sandep Bharadwaj

1 comment:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

మంచి సమయాన, మంచి కృతి పోస్ట్ చేశారు.

మూడు ఆడియో లింకులుకూడా మాస్టర్ పీస్లే.
యేసుదాస్ గారిది హైలైట్...
MBK గారు కొంచం హై పిట్చ్లో పాడారు కదా ఈ కృతి?
అక్కవాళ్ళు ఎప్పట్లాగే ప్లసంట్..