Wednesday, December 14, 2011

నీ పదసారస రతులకు - కృష్ణామాచార్య కృతి

నీ పదసారస రతులకు - NCh కృష్ణామాచార్య కృతి  , హైమవతి రాగం(?) 
Audio :  TK Sisters

నీ పదసారస రతులకు నిఱయబాధలుండునే రామ

తాపత్రయమనియెడు పెను దావమందు చిక్కుకొనక

మనసున నీ మంత్రమహిమ, మఱి నాల్కను నామమహిమ
ఒనఱ వీనులందు నీ గుణోత్తర మహిమ
ఘనముగ రోమాంచమడఱ తనువు మఱచి ఆడి పాడి
అనవరతము వర్ధిల్లు మహామహులకు రామ సదా

Thursday, December 8, 2011

గజవదనమాశ్రయే , NC కృష్ణమాచార్యులు , కేదారం

రాగం : కేదారం , రచన/సంగీతం : శ్రీ NC కృష్ణమాచార్యులు 
గజవదనమాశ్రయే, గజవదన మాశ్రయే సతతం, 
గజవదనమాశ్రయే కైలాసాచల సదనం గజవదనమాశ్రయే 
సుజనార్తి శోషణం, శుభగుణం విజయైక కారణం విధృతాహిగణాభరణం  
ఖగవాహన సత్కలావతీర్ణం, కాయజారిరివ పాండురవర్ణం
నిగమశాఖీ సత్ఫలం, ధృతకలం, నీరజారి మదహరం భాస్వరం 
విగళిత మాయామోహావేశం, విరచిత శ్రీగుహ సహసంచరణం
అగణిత మోదక ఖాదన నిపుణం, అగరాట్ దౌహిత్రం సుపవిత్రం
Sri NCh Krishnamacharyulu


కృతి విని సాహిత్యం వ్రాసి అందించిన కౌటిల్య గారికి కృతజ్ణతలు.