Friday, December 12, 2014

నాద యోగికి నివాళి !

నాద యోగికి నివాళి !
-------
ప|| ఇన్నిచదువనేల ఇంత వెదకనేల | కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి ||
చ|| పుట్టెడిదొకటే పోయెడిదొకటే | తిట్టమై రెంటికిని దేహమే గురియౌను |
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము | వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే ||
-------
సద్గురువులు, విద్వాంసులు, కళాకారులు వీరికొక ప్రత్యేకత ఉంది. వీరు మరణించినా వారి వారి చిహ్నాలు ఈ ధరిత్రి మీద మరి కొంత కాలం జీవించి ఉంటాయి. గురువు ద్వారా జ్ఞానాన్ని అందిపుచ్చుకున్న శిష్యపరంపర గురువు పేరుని బ్రతికిస్తూ ఉంటుంది. త్యాగరాజ స్వామి పరంపర ఉదాహరణ. విద్వాంసుడి విద్వత్తు, కళాకారుడు సృష్టించిన కళాఖండాలు వారిని సజీవంగా ఉంచుతాయి.
సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు సద్గురువు , మహా విద్వాంసుడు & గొప్ప కళాకారుడు.
తెల్లాటి పంచె, లాల్చి , నుదుట విభూది రేఖలు, ముఖాన సరస్వతి కళ , గంభీరమైన గాత్రము చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించే గురువుగారిని కొన్ని సార్లు దర్శించే భాగ్యం నాకు కలిగింది. తాళ్ళాపాక లో జరిగిన అన్నమయ్య 600 వ జయంతి లో ఆయన ఆలపించిన సకల శాఇంతి కరము సర్వేశ కీర్తన పల్లవి నాకు గుర్తు. కర్ణాటక సంగీతంలో తెలుగు వారి కీర్తి పతాకలు చాటిన మహా విద్వాంసులలో నేదునూరి గారు అగ్ర స్థానంలో ఉంటారు. ఆయన నిర్యాణ వార్త విని ఆంధ్ర రాష్త్రంలో కంటే తమిళనాట బాధ పడేవారు ఎక్కువ ఉంటారంటె అతిశయోక్తి కాదు.
కొన్ని వేల కచేరిలు భారతదేశంలో , ఇతర దేశాలలో ఇచ్చి ఎన్నో బిరుదులు పొందిన సంగీత విద్యా భాస్కరుడు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి. ఒకసారి ఇంటర్వూ లో నేదునూరి గారు చెప్పినట్టు గుర్తు , ఇన్ని కచేరీలలో వచ్చిన పేరు కంటే , అన్నమాచార్య కీర్తనలకు ఈయన కూర్చిన స్వరాలు మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అన్నమాచార్య కీర్తనాల మీద స్వతహాగా ఉన్న మక్కువ వలన నాకు, ఆ కీర్తనలకు రాగాన్ని కట్టి ప్రాణం పోసే సంగీతజ్ఞులు అంటే నాకు భక్తి, గౌరవం. ఆ విధంగా నాకు నేదునూరి గారు, సంగీత విద్వాసుడి కంటే , అన్నమాచార్య కీర్తనల స్వర కర్త గా ఎక్కువ పరిచయం. నేదునూరి కృష్ణమూర్తి గారి పేరు తెలియకపోయినా , ఆయన స్వరపరిచిన కీర్తనలు (నానాటి బ్రతుకు, ముద్దుగారే యశోద, భావము లోన, ఇట్టి ముద్దులాడి, ఒకపరికొకపరి, పలుకు తేనెల తల్లి) వినని వెంకన్న భక్తుడు ఉండడేమో ! తమిళనాట పెళ్ళిళ్ళల్లో కూడ నానాటి బ్రతుకు సన్నాయి వాయిస్తూ ఉంటారు. ఈ ఒక్క సంకీర్తన చాలు ఆయన్ని సంగీత కళానిధిని చేయటానికి అని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఒక సభలో అన్నారు. నేదునూరి గారు స్వరపరిచిన 108+ అన్నమాచార్య కీర్త్నలలొ , ప్రతి ఒక్కటి ఒక్కో ఆణిముత్యం. చిక్కటి సంగీతంతో అన్నమయ్య సాహిత్యం లోని భక్తి భావాన్ని, వేంకటేశ్వర తత్వాన్ని కర్ణ రంజకమైన రాగాలలో మనసుకు చేరవేసే విధంగా ఉంటాయి. ఈ సాహిత్యానికి ఇంతకంటె నప్పే స్వర కూర్పు అసాధ్యమనిపించేవిధంగా ఉంటాయి కొన్ని పాటలు. నేదునూరి గారు స్వరపరిచిన కొన్ని కీర్తనలు నా బ్లాగు లో సేకరించాను. ఎమ్మెస్ అమ్మ పాడిన బాలాజి పంచరత్న మాలలో సింహభాగం నేదునూరి గారు స్వరపరిచినవే. స్వర కర్త గా నేదునూరి గారి స్థాయి ని గొప్పదనాన్ని ఆవిష్కరించే మరొక కీర్తన  'తెలిసితే మోక్షము ' నాకు చాలా ఇష్టం.
శరణు శరణు సురేంద్ర సన్నుతరామచంద్రుడితదురామభద్ర రఘువీరసకల శాంతికరమువెనకేదో ముందరేదొఇన్ని చదువానేల , ఆదిదేవ పరమాత్మపలు విచారములేల , పురుషోత్తముడ వీవుతెలిసితే మోక్షము , అవధారు రఘుపతి, అదె చూదరే, అలర చంచలమైన : నేదునూరి గారు స్వరపరిచిన మరికొన్ని సంకీర్తనా కుసుమాలు.

వేంకటేశ్వరుడికి అన్నమయ్య కట్టిన పదాల కోవెల లో , రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గార్లు ప్రాకారాలైతె , పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు , కామిశెట్టి శ్రీనివాసులు గారు నిలబెట్టిన గరుడ ద్వజం నేదునూరి గారు. ఆ ద్వజం మీదున్న 108 సంకీర్తన స్వర దీపాలు అజ్ఞాన తిమిరాలోనున్న భక్తులను ఆకర్షిస్తూ నిజమైన జ్ఞానానికి దారిని చూపిస్తుంటాయి.

మరొక తెలుగు వాగ్గేయకారుడైన భద్రాచల రామదాసు రచించిన కీర్తనలకి స్వరాలు కట్టి గురువుగారు మన తెలుగు జాతి కి వెలకట్టలేని నిధిని ఇచ్చి వెళ్ళారు. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి స్పూర్థి తో 2006 లో ప్రారంభమైన రామదాసు జయంత్యోత్సవాలు వారి శిష్యులు భద్రాద్రి లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వెబ్సైటు లో నేదునూరి గారు స్వరపరిచిన/పాడిన కొన్ని రామదాసు కీర్తనలు వినవచ్చు. ఈ ఉత్సవాలలో పాల్గొని ఆయన కూర్చిన కీర్తనలు పాడుకోవటం ఆయనకు మనమిచ్చే ఘన నివాళి. ఆయన ప్రాచుర్యం చేసిన ఏమయ్య రామ కీర్తన ఎక్కువగా కచేరిలలో వినిపిస్తూ ఉంటుంది. శ్రీ రామ నామమే, శ్రీరాముల దివ్య నామ, హరి హరి రామ, కంటి నేడు మా రాముల , గురువుగారు స్వరపరిచిన మరికొన్ని ప్రాచురం పొందిన రామదాసు కీర్తనలు.

సంగీత ప్రపంచంలో ఒక ధృవతార భూమిని వదిలి వెంకన్న పాదాల చెంతకు చేరింది. ఆయనకు ప్రదానం చేసిన "సంగీత కళానిధి" కి విలువ పెరిగింది, ఆయనకు దక్కని పద్మాలు , (వి)భూషణాలు కుంచించుకుపోయి మరింత వెలిగే అవకాశాన్ని కోల్పోయినాయి. ఈ కలియుగంలో తిరుమల కొండ పై వేంకటేశ్వరుడి భక్తులు ఉన్నంతవరకు , అన్నమయ్య పదాలు , ఎమ్మెస్ అమ్మ గళం , నేదునూరి స్వరాలు తెలుగునాట ప్రతిధ్వనిస్తూనే ఉంతాయి. ఆ మహాగురువు శిష్యులకు ఆ శైలిని కాపాడి, స్వరాలను ప్రాచుర్యం చేసి భవిష్యత్తరాలకు అందజేసే శక్తిని ఇవ్వాలని ఆ ఏడుకొండల వాదిని ప్రార్ధిస్తూ , నాదయోగికి నమస్కారాలతో వీడ్కోలు.
                                                   || సకల శాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ ||

Would like to share the following video here :

Malladi Brothers Tribute to Nedunuri

Sunday, November 30, 2014

allakallolamayenamma - అల్లకల్లోలమాయెనమ్మ , thyagaraja kriti

composer: thyagaraja, ragam : saurashtram
Audio link : Mangalampalli Balamuralikrishna
ప. అల్లకల్లోలమాయెనమ్మ యమునా దేవి

మాయార్తులెల్లను తీర్పవమ్మ

అ. మొల్లలచే పూజించి మ్రొక్కెదము బ్రోవుమమ్మ (అ)

చ1. మారు బారికి తాళ లేకయీ రాజ
కుమారుని తెచ్చితిమిందాక
తారుమారాయె బ్రతుకు తత్తళించునదెందాక (అ)

చ2. గాలి వానలు నిండారాయె మా పనులెల్ల
గేలి సేయుటకెడమాయె
మాలిమితో మమ్మేలు మగనియెడ బాయనాయె (అ)

చ3. సొమ్ములెల్ల నీకొసగెదమమ్మ యమునా దేవియీ
సుముఖుని గట్టు జేర్పుమమ్మ
ఎమ్మె కాని బలిమినియేల తెచ్చితిమమ్మ (అ)

చ4. నళిన భవుడు వ్రాసిన వ్రాలుయెట్లైన కాని
నాథుడు బ్రతికియుంటే చాలు
ప్రళయములయ్యెను ఏ పని జేసిన భామలు (అ)

చ5. దేహములెల్లనొసగెదమమ్మ ఓ దేవి కృష్ణ
దేవుని గట్టు జేర్పుమమ్మ
మోహనాంగుని మేము మోస-బుచ్చితిమమ్మ (అ)

చ6. మేమొక్కటెంచ పోతిమమ్మ మా పాలి దేవు-
డేమోమో ఎంచుకొన్నాడమ్మ
రామరో శ్రీ త్యాగరాజాప్తుని బాయమమ్మ (అ)

pallavi
allakallOlam(A)yen(a)mma yamunA dEvi
mA(y)Artul(e)llanu tIrp(av)amma
1anupallavi
2mollalacE pUjinci mrokkedamu brOvum(a)mma (alla)
caraNam 1
mAru 3bAriki tALa lEka(y)I rAja
kumAruni teccitim(i)ndAka
tArumAr(A)ye bratuku 4tattaLincunad(e)ndAka (alla)
caraNam 2
gAli vAnalu niNDAr(A)ye mA panul(e)lla
gEli sEyuTak(e)Dam(A)ye
mAlimitO mamm(E)lu magani(y)eDa bAyan(A)ye (alla)
caraNam 3
sommul(e)lla nIk(5o)sagedam(a)mma yamunA dEvi(y)I
sumukhuni gaTTu jErpum(a)mma
6emme kAni balimini(y)Ela teccitim(a)mma (alla)
caraNam 4
naLina bhavuDu vrAsina vrAlu(y)eTl(ai)na kAni
nAthuDu bratiki(y)uNTE cAlu
praLayamul(a)yyenu E pani cEsina bhAmalu (alla)
caraNam 5
dEhamul(e)llan(5o)sagedam(a)mma O dEvi kRshNa
dEvuni gaTTu jErpum(a)mma
mOhan(A)nguni mEmu mOsa-buccitim(a)mma (alla)
caraNam 6
mEm(o)kkaT(e)nca pOtim(a)mma mA pali dEvuD-
(E)mEmO encukonnAD(a)mma
7rAmarO SrI tyAgarAj(A)ptuni bAyam(a)mma (alla)


Wednesday, November 26, 2014

దేవి కృతి : rAjarAja rAdhitE - రాజరాజ రాధితే నాదనిధే శారదే,, H.N. Mutthiah Bhaagavatar , nirOshTa ragam

raagam: nirOshTa , Composer: H.N. Mutthiah Bhaagavatar
YouTube link : TN Seshagopalan
Audios available here : priya sisters/ Amolya-Anamika/ Gayatri Girish/ TN Seshagopalan
పల్లవి
రాజరాజ రాధితే నాదనిధే శారదే  (రాజ)
అనుపల్లవి
తేజాశ్ర్తే /తేజాశ్రితే శ్రీ లలితే శ్రీ ఈశ సహజాతే (రాజ)
చరణం

నీనే హరికేశ రా(గి)ణి నీనే నిత్య కల్యాణి నీనే శ్రీ కృష్ణేంద్రన రక్షణశణే జయ జనని (రాజ)

pallavi: rAjarAja rAdhitE nAdanidhE shAradE (rAja)
anupal: tEjashrtE shrI lalitE shrI Isha sahajAtE (rAja)
caraNa: nInE harikEsha rAgjni nInE kalyANi nInE shrI krSNEndrana rakSaNachaNE jayajanani (rAja)

దేవి కృతి : SivagangA nagara nivAsini - శివగంగా నగర నివాసిని

రాగం: పున్నాగ వరాళి, పాపనాశన్ శివం , rAGam : punnAga varALi, pApanAsan Sivam
YouTube link : Dhanya Subramainan
Archive link
శివగంగా నగర నివాసిని
శ్రీ రాజరాజేశ్వరి మామవ

అభయ వరదే అంబ మాయే
నిగమాగణిత విభవే పరమశివ జాయే

వదన రుచి విజిత కమలే
ఉభయ పార్శ్వ విరాజిథ వాణీ కమలే

సదా రామదాసనుతే శరణాగత
జన పాలన చణ శుభ చరితే
SivagangA nagara nivAsini
SrI rAjarAjESvari mAmava

abhaya varadE amba mAyE
nigamAgaNita vibhavE paramaSiva jAyE

vadana ruci vijita kamalE
ubhaya pArSva virAjitha vANI kamalE

sadA rAmadAsanutE SaraNAgata
jana pAlana caNa Subha caritE

Saturday, November 15, 2014

దేవి కృతి : mahA lakshmi karuNA మహా లక్ష్మి కరుణా రస లహరి


మహా లక్ష్మి కరుణా - రాగం మాధవ మనోహరి - తాళం ఆది , ముత్తుస్వామి దీక్షితార్
muttuswAmy dIkshitAr , ragam : mAdhava manOhari
Archive Audio link : MS Subbualakshmi
YouTube link : MS Subbulakshmi
పల్లవి
మహా లక్ష్మి కరుణా రస లహరి
మామవ మాధవ మనోహరి శ్రీ

అనుపల్లవి
మహా విష్ణు వక్ష స్థల వాసిని
మహా దేవ గురు గుహ విశ్వాసిని
(మధ్యమ కాల సాహిత్యమ్)
మహా పాప ప్రశమని మనోన్మని
మార జనని మంగళ ప్రదాయిని

చరణమ్
క్షీర సాగర సుతే వేద నుతే
క్షితీశాది మహితే శివ సహితే
భారతీ రతి శచీ పూజితే
భక్తి యుత మానస విరాజితే
(మధ్యమ కాల సాహిత్యమ్)
వారిజాసనాద్యమర వందితే
నారదాది ముని బృంద నందితే
నీరజాసనస్థే సుమనస్థే
సారస హస్తే సదా నమస్తే

pallavi
mahA lakshmi karuNA rasa lahari - mAmava mAdhava manOhari SrI

anupallavi
mahA vishNu vaksha sthala vAsini - mahA dEva guru guha viSvAsini
(madhyama kAla sAhityam) - 
mahA pApa praSamani manOnmani - mAra janani mangaLa pradAyini

caraNam
kshIra sAgara sutE vEda nutE - kshitISAdi mahitE Siva sahitE
bhAratI rati SacI pUjitE - bhakti yuta mAnasa virAjitE
(madhyama kAla sAhityam) 
vArijAsanAdyamara vanditE  - nAradAdi muni bRnda nanditE
nIrajAsanasthE sumanasthE - sArasa hastE sadA namastE

Thursday, September 25, 2014

నవరాత్రి దేవి కృతులు / స్తోత్రాలు : త్రిపురసుందర్యష్టకం , TripuraSundari ashTakam


Archive Audio link
YouTube Link: 

కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం - నితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్
నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం - త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౧ ||
కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం - మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్
దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం - త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౨ ||
కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా - కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా - కయాపి ఘననీలయా కవచితా వయం లీలయా || ౩ ||
కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం - షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్
విడంబితజపారుచిం వికచచంద్ర చూడామణిం - త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౪ ||
కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం - కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం - మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే || ౫ ||
స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం - గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాంచలామ్
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం - త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౬ ||
సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం - సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్
అశేషజనమోహినీమరుణమాల్య భూషాంబరాం - జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికామ్ || ౭ ||
పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం - పితామహపతివ్రతాం పటుపటీర చర్చారతామ్
ముకుందరమణీ మణీ లసదలంక్రియాకారిణీం - భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ || ౮ ||

    kadaMbavanachaariNeeM munikadaMbakaadaMbineeM
    nitaMbajitabhoodharaaM suranitaMbineesaevitaam^
    navaaMburuhalOchanaamabhinavaaMbudaSyaamalaaM
    trilOchanakuTuMbineeM tripurasuMdareemaaSrayae || ~1 ||

    kadaMbavanavaasineeM kanakavallakeedhaariNeeM
    mahaarhamaNihaariNeeM mukhasamullasadvaaruNeem^
    dayaavibhavakaariNeeM viSadarOchanaachaariNeeM
    trilOchanakuTuMbineeM tripurasuMdareemaaSrayae || ~2 ||

    kadaMbavanaSaalayaa kuchabharOllasanmaalayaa
    kuchOpamitaSailayaa gurukRpaalasadvaelayaa
    madaaruNakapOlayaa madhurageetavaachaalayaa
    kayaapi ghananeelayaa kavachitaa vayaM leelayaa || ~3 ||

    kadaMbavanamadhyagaaM kanakamaMDalOpasthitaaM
    shaDaMburuhavaasineeM satatasiddhasaudaamineem^
    viDaMbitajapaaruchiM vikachachaMdra chooDaamaNiM
    trilOchanakuTuMbineeM tripurasuMdareemaaSrayae || ~4 ||

    kuchaaMchitavipaMchikaaM kuTilakuMtalaalaMkRtaaM
    kuSaeSayanivaasineeM kuTilachittavidvaeshiNeem^
    madaaruNavilOchanaaM manasijaarisammOhineeM
    mataMgamunikanyakaaM madhurabhaashiNeemaaSrayae || ~5 ||

    smaraetprathamapushpiNeeM rudhirabiMduneelaaMbaraaM
    gRheetamadhupaatrikaaM madavighoorNanaetraaMchalaam^
    ghanastanabharOnnataaM galitachoolikaaM SyaamalaaM
    trilOchanakuTuMbineeM tripurasuMdareemaaSrayae || ~6 ||

    sakuMkumavilaepanaamaLikachuMbikastoorikaaM
    samaMdahasitaekshaNaaM saSarachaapapaaSaaMkuSaam^
    aSaeshajanamOhineemaruNamaalya bhooshaaMbaraaM
    japaakusumabhaasuraaM japavidhau smaraamyaMbikaam^ || ~7 ||

    puraMdarapuraMdhrikaaM chikurabaMdhasairaMdhrikaaM
    pitaamahapativrataaM paTupaTeera charchaarataam^
    mukuMdaramaNee maNee lasadalaMkriyaakaariNeeM
    bhajaami bhuvanaaMbikaaM suravadhooTikaachaeTikaam^ || ~8 || 

Thursday, July 24, 2014

బాలసుబ్రహ్మణ్యం భజేహం - bAlasubrahmanyam bhajeham, dIkshiAr , suraTi ragam


రాగం: సురటి           దీక్షితార్ కృతి    తాళం: ఆది
II పల్లవి II
బాలసుబ్రహ్మణ్యం భజేహం భక్తకల్పభూరుహం శ్రీ
II అనుపల్లవి II
నీలకంఠ హృదానందకరం నిత్య శుద్ధ బుద్ధ ముక్తాంబరమ్
II చరణమ్ II
వేలాయుధధరం సుందరం వేదాంతార్థబోధ చతురం
ఫాలాక్ష గురుగుహావతారం పరాశక్తిసుకుమారం ధీరమ్
పాలిత గీర్వాణాది సమూహం పఙ్చభూతమయ మాయామోహం
నీలకంఠ వాహం సుదేహం నిరతిశయానంద ప్రవాహమ్

 ఈ కీర్తన చేసిన క్షేత్రంతిరుచెందూర్
meaning :  http://shaktiputram.blogspot.in/2014/07/blog-post_17.html
pallavi
bAla subrahmaNyaM bhajE(a)haM 

bhakta kalpa bhU-ruhaM SrI

anupallavi
nIla kaNTha hRdAnanda-karaM
nitya Suddha buddha muktAmbaram
caraNam
vElAyudha dharaM sundaraM
vEdAntArtha bOdha caturaM
phAlAksha guru guhAvatAraM
parA Sakti sukumAraM dhIram
(madhyama kAla sAhityam)
pAlita gIrvANAdi samUhaM 
panca bhUta maya mAyA mOhaM
nIla kaNTha vAhaM sudEhaM
niratiSayAnanda pravAham

Tuesday, July 22, 2014

గురు గుహ స్వామిని - guruguha swamini , ragam:bhanumati , dikshitar kriti

గురు గుహ స్వామిని- రాగం భానుమతి - తాళం ఖండ త్రిపుట, దీక్షితార్ కృతి 
Archive Audio link

పల్లవి
గురు గుహ స్వామిని భక్తిం కరోమి
నిరుపమ స్వే-మహిమ్ని పరంధామ్ని

అనుపల్లవి
కరుణాకర చిదానంద నాథాత్మని
కర చరణాద్యవయవ పరిణామాత్మని
తరుణోల్లాసాది పూజిత స్వాత్మని
ధరణ్యాద్యఖిల తత్వాతీతాత్మని

చరణమ్
నిజ రూప జిత పావకేందు భానుమతి
నిరతిశయానందే హంసో విరమతి
అజ శిక్షణ రక్షణ విచక్షణ సుమతి
హరి హయాది దేవతా గణ ప్రణమతి
(మధ్యమ కాల సాహిత్యమ్)
యజనాది కర్మ నిరత భూ-సుర హితే
యమ నియమాద్యష్టాంగ యోగ విహితే
విజయ వల్లీ దేవ సేనా సహితే
వీరాది సన్నుతే వికల్ప రహితే

dIkshitAr kriti : 
allavi
guru guha svAmini bhaktiM karOmi - nirupama svE-mahimni paraM-dhAmni

anupallavi
karuNAkara cidAnanda nAtha-Atmani - kara caraNa-Adi-avayava pariNAma-Atmani
taruNa-ullAsa-Adi pUjita sva-Atmani - dharaNi-Adi-akhila tatva-atIta-Atmani

caraNam
nija rUpa jita pAvaka-indu bhAnumati - niratiSaya-AnandE haMsO viramati
aja SikshaNa rakshaNa vicakshaNa sumati - hari haya-Adi dEvatA gaNa praNamati
yajana-Adi karma nirata bhU-sura hitE - yama niyama-Adi-ashTa-anga yOga vihitE
vijaya vallI dEva sEnA sahitE - vIra-Adi sannutE vikalpa rahitE
Youtube Link

Friday, June 27, 2014

palukav(E)mi nA daivamA - ప. పలుకవేమి నా దైవమా , రాగం: పూర్ణ చంద్రిక, త్యాగరాజ కృతి


Archive link : M. Balamuralikrishna
lyrics in other languages & meaning


ప. పలుకవేమి నా దైవమా
పరులు నవ్వేది న్యాయమా


అ. అలుగ కారణమేమిరా రామ
నీవాడించినట్లుయాడిన నాతో (ప)





చ. తల్లి తండ్రి భక్తినొసగి రక్షించిరి తక్కిన వారలెంతో హింసించిరి
తెలిసియూరకుండేదియెన్నాళ్ళురా దేవాది దేవ త్యాగరాజునితో (ప)

pallavi
palukav(E)mi nA daivamA
parulu navvEdi nyAyamA

anupallavi
aluga kAraNam(E)mirA rAma
nIv(1A)Dincin(a)Tlu(y)ADina nAtO (paluka)

caraNam
talli taNDri bhaktin(o)sagi rakshinciri - takkina vAral(e)ntO himsinciri
telisi(y)Urak(u)NDEdi(y)ennALLurA - dEv(A)di dEva tyAgarAjunitO (paluka)

Monday, February 17, 2014

శ్రీ వేంకట గిరీశం ఆలోకయే - SrI vEnkaTa girISaM AlOkayE , ముత్తుస్వామి దీక్షితార్ , Dikshitar kriti, surati


Audio link : Balaji Sankar
శ్రీ వేంకట గిరీశం - రాగం సురటి - తాళం ఆది
పల్లవి
శ్రీ వేంకట గిరీశం ఆలోకయే 
వి-నాయక తురగారూఢం

అనుపల్ల్వి
దేవేశ పూజిత భగవంతం
దిన-కర కోటి ప్రకాశవంతం
(మధ్యమ కాల సాహిత్యం)
గోవిందం నత భూ-సుర బృందం
గురు గుహానందం ముకుందం

చరణం
అలమేలు మంగా సమేతం 
అనంత పద్మ నాభం అతీతం
కలి యుగ ప్రత్యక్ష విభాతం
కంజజాది దేవోపేతం 
(మధ్యమ కాల సాహిత్యం)
జల ధర సన్నిభ సుందర గాత్రం
జలరుహ-మిత్రాబ్జ-శత్రు నేత్రం
కలుషాపహ గోకర్ణ క్షేత్రం
కరుణా రస పాత్రం చిన్మాత్రం

pallavi
SrI vEnkaTa girISaM AlOkayE 
vi-nAyaka turagArUDham

anupallvi
dEvESa pUjita bhagavantaM
dina-kara kOTi prakASavantaM
(madhyama kAla sAhityam)
gOvindaM nata bhU-sura bRndaM
guru guhAnandaM mukundam

caraNam
alamElu mangA samEtaM 
ananta padma nAbhaM atItaM
kali yuga pratyaksha vibhAtaM
kanjajAdi dEvOpEtam 
(madhyama kAla sAhityam)
jala dhara sannibha sundara gAtraM
jalaruha-mitrAbja-Satru nEtraM
kalushApaha gOkarNa kshEtraM
karuNA rasa pAtraM cinmAtram