Wednesday, October 17, 2007

వరవీణా మృదుపాణీ - FUSION

రాగం : మోహన :: తాళం : రూపకము :: రచన : అప్పయ్య దీక్షితులు
వరవీణా మృదుపాణీ - వనరుహలోచనరాణీ
సురుచిర బంబరవేణీ - సురనుత కళ్యాణీ
నిరుపమ శుభగుణ లోలా - నిరత జయాప్రద శీలా
వరదాప్రియ రంగనాయకి- వాంఛిత ఫలదాయకి
సరసీజాసన జననీ - జయజయజయ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
నిన్న(17/10/07) మూలా నక్షత్రం , సరస్వతీ దేవి అవతారం అని అలా గుడికి వెళ్ళి వచ్చి , సరదాగా నెట్ లో ఎమన్నా సరస్వతీ దేవి మీద కీర్తనలు ఉంటాయేమో వెతికాను.
అలా వెతుకుతూండగా ఈ FUSION VERSION దొరికింది, నాకు చాలా నచ్చింది (ఆడియో)


ఈ కీర్తన లక్ష్మీ దేవిపై కీర్తన అని సాహితి.ఆర్గ్ లొ ఒకసారి చర్చ జరిగింది

Meaning: (Adapted From: Perfecting Carnatic Music, Level 1 by Chitraveena Ravikiran)
[This is a beautiful song on goddess Lakshmi/Saraswati]
You hold the divine ("vara") veena in your soft ("mrudu") hands ("paani"). You are the queen ("raani") of the omniscient. Your eyes ("lochana") are like the lotus petals ("vanaruha"). Your curly ("suruchira") tresses ("veni") resemble the bees ("bambhara"). Devas ("Sura") worship ("nuta") your auspicious form ("kalyaani"). You have ("lola") unequaled ("nir-upama") virtuous ("shuba") qualities ("guna"). You ("sheela") give ("prada") endless ("narathi") victory ("jaya"). You are Ranganaayaki, the consort ("priya")of the Ranganatha ("varadaa"). You grant ("daayaki") the boons ("phala") desired ("vaanchita") by your devotees. O Mother ("janani") of Brahma, who is seated on a lotus ("saraseeja-asana")! Victory ("jaya") to you.

Friday, October 12, 2007

Friday, June 1, 2007

సీతారామకళ్యాణ మహోత్సవం.

ఎప్రిల్27, 2007 మంగళవారం, శ్రీరామనవమి రోజు , పిడుగురాళ్ళ,గుంటూరు జిల్లా లో దీపాల కనకదుర్గ, సుబ్రహ్మణ్యం దంపతులు జరిపించిన శ్రీ సీతారామకళ్యాణ మహోత్సవం.



sriramanavami

Powered by eSnips.com

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి!


అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే |
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి ||


నా చిన్నప్పుడు తాడికొండ గురుకుల విద్యాలయం లొ చదువుతుండగా, ఏదో సందర్భం వచ్చి మా సంస్కృతం మాష్టారు చెపిన స్లోకం ఇది. అలా మెదడు లో అచ్చు పడి పోయింది.

ఇంతకీ దీని అర్థమేంటంటే, లంకను జయించిన తర్వాత , లక్ష్మణుడు రాముడితో , "అన్నా ఈ లంక బంగారంలోకం లా ఉంది , ఇక్కడె ఉండి పొదామా " అన్నాడట.
అప్పుడు రాముడు "లక్ష్మణా ! జనని, జన్మ భూమి స్వర్గం కంటే గొప్పవి "
అన్నాడట.

ఇలా , ఈ శ్లోకంతో , నా బ్లాగును ప్రారంభిస్తున్నాను, నా చిన్ననాటి స్కూల్ ని , మా సంస్కృతం మాష్టారు ని తలుచుకుంటూ.

ఏది ఒక్కసరి అందరూ రామా అనండి !