Sunday, July 25, 2010

నన్ను విడిచి కదలకురా రామయ్య వదలకురా -



త్యాగరాజ కృతి, రీతిగౌళ రాగం
veena : Jayanthi Kumaresh
ప. నన్ను విడిచి కదలకురా రామయ్య వదలకురా

అ. నిన్ను బాసియర నిమిషమోర్వనురా (న)

చ1. తరము కానియెండ వేళ కల్ప
తరు నీడ దొరిగినట్లాయెనీ వేళ (న)

చ2. అబ్ధిలో మునిగి శ్వాసమును పట్టి
ఆణి ముత్యము కన్నట్లాయె శ్రీ రమణ (న)


చ3. వసుధను ఖననము చేసి ధన
భాండమబ్బిన రీతి కనుకొంటి డాసి (న)

చ4. వడలు తగిలియున్న వేళ గొప్ప
వడ-గండ్లు కురిసినట్లాయెనీ వేళ (న)


చ5. బాగుగ నన్నేలుకొమ్ముయిల
త్యాగరాజ నుత తనువు నీ సొమ్ము (న)

sung by , Sri Maharajapuram Santanam

5 comments:

Sravan Kumar DVN said...

Gist
O Lord rAma! O Beloved of lakshmI! O Lord praised by this tyAgarAja!
Please do not move away leaving me; do not abandon me at this moment.
I shall not bear separation from You even for half a minute.
It is as if –
(a) when there is unbearable heat, finding shadow of the celestial tree;
(b) diving into sea holding breath and finding a perfect pearl; and
(c) when it is parched, there is heavy hailstorm;
In the same manner as quarrying the earth and attaining a treasure trove, I discovered You; therefore having come near me, please do not move away leaving me.
Please govern me well here; this (my) body is Your property.

---
meaning from :
http://thyagaraja-vaibhavam.blogspot.com/2007/07/thyagaraja-kriti-nannu-vidachi-raga.html

కొత్త పాళీ said...

దివంగత ముసిరి సుబ్రహ్మణ్యయ్యరుగారు ఈ పాట పాడుతుంటే అచ్చం త్యాగరాజు పాడుతున్నట్టే ఉందా అనిపించేది అని చెప్పింది మా అమ్మ. ఆయన గొంతు వినే భాగ్యం ణాకు లేకపోయిందిగానీ ఆయన శిష్యురాలు సుగుణా పురుషోత్తమన్ గారి గొంతులో ఈ పాట విని తరించాను.

Sravan Kumar DVN said...

కొత్తపాళీ గారూ, సుగుణా పురుషోత్తమన్ గారు పాడిన వర్షన్ ఉంటే దయచేసి పంపగలరు.
మహారాజపురం సంతానం గారు కూడ చలా చక్కగా పాడారనిపించింది నాకు.
-శ్రవణ్

కొత్త పాళీ said...

I heard it in a live concert long ago. The lady did not record much on albums.

Sravan Kumar DVN said...

http://www.telugubloggers.com/2007/01/09/%E0%B0%A8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE/