Friday, December 31, 2010

నన్నిడిసి పెట్టెల్లినాడే! , యెంకి పాటలు

Audio link : play list Sri Srirangam Gopalaratnam
రచన: నండూరి సుబ్బారావు
నన్నిడిసి పెట్టెల్లినాడే!
నా రాజు....


మొన్న తిరిగొస్తనన్నాడే!
నీలుతేబోతుంటె, నీతోడె - వోలమ్మి!
నాయెంటె యెవరోను నడిసి నట్టుంటాదె!
నన్నిడిసి పెట్టెల్లినాడే
నా రాజు....

అద్దములో సూత్తుంటె అది యేటో సిగ్గమ్మి!
నా యనక యెవురోను నవ్వి నట్టుంటాదె!
నన్నిడిసి పెట్టెల్లినాడే
నా రాజు....

సల్లని యెన్నెట్లో సాపేసి కూకుంటె...
ఒట్టమ్మి - ఒల్లంత ఉలికులికిపడతాదె!
నన్నిడిసి పెట్టెల్లినాడే
నా రాజు....

నీతైనవోడె, నా రాతెట్ట గుంటాదో!
కళ్ళలో సత్తెముగ కట్టినట్టుంటాదె!
నన్నిడిసి పెట్టెల్లినాడే
నా రాజు...
మొన్న తిరిగొస్తనన్నాడే!


Monday, December 13, 2010

బడలిక తీర పవ్వళించవే - త్యాగరాజ కృతి , రీతిగౌళ రాగం

ప. బడలిక తీర పవ్వళించవే

అ. సడలని దురితములను తెగ కోసి
సార్వభౌమ సాకేత రామ (బ)

చ. పంకజాసనుని పరితాపము కని
పంకజాప్త కుల పతివై వెలసి
పంకజాక్షితో వనమునకేగి
జింకను వధియించి
మంకు రావణుని మదముననణచి
నిశ్శంకుడగు విభీషణునికి బంగారు
లంకనొసగి సురుల బ్రోచిన
నిష్కళంక త్యాగరాజుని హృదయమున (బ) 

Monday, December 6, 2010

వేదాల్లో ఏముంది , పులిహోర ?

వేదాల్లో ఏముంది , పులిహోర ? మా సాఫ్ట్ వేర్ స్నేహితుడు ఒకరోజు లంచ్ అయ్యాక తిన్నది అరగటానికి అలా గాలికి తిరుగుతూ లోకాభిరామాయణం చర్చించుకునే సమయంలో లేవనెత్తిన టాపిక్. ఇదే ప్రశ్నని చాలా సార్లు అడిగేవాడు, ఆ అడిగే విధానంలో తెలుసుకుందామనే జిజ్ఞాస కంటె వెటకారమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది నాకు. వేదం లో మొత్తం శాఖలు 1195. ఆది శంకరుల కాలం అంటే దాదాపు ఒక 1500 సంవత్సరాల క్రితం వరకు అన్ని శాఖలు అందుబాటులో ఉన్నట్లు మనకి ఆధారలు ఉన్నాయి. అందులొ మనకి ఇప్పుదు మిగిలింది 7. అంతె , 1 % కంటే తక్కువ. ఈ 7 శాఖలని రేవెళ్ళ అవధానులు గారు, ఒక మహారాష్ట్ర పండితుడి చేత చదివించి రికార్డు చేయించటానికి 10 సంవత్సరాల క్రితం పూనుకున్నారు , ఇంక 40 సంవత్సరాల పని మిగిలి ఉందని అంటున్నారు. వేద పరిధి ని తెలుసుకోవటానికి ఈ ఉదాహరణ చాలు. ఒక చిన్న నెల పరీక్షకు సిలబస్ మొత్తం చదివే ఓపిక లేక , ఒకరాత్రి బ్యాటింగ్ చెస్తూ డిగ్రేఏలు సంపాదించే మనకి , ఒక వేదశాఖని 12 సంవత్సరాలు కష్టాపడి నేర్చుకునే ఓపిక వస్తుందా ? ఒక వేద శాఖకి 12 సంవత్సరాలు పడితే , ఇక 1100+ శాఖలకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది , ఆలోచించండి. అందుకే 4 భాగాలుగా విభజించారు. ఇప్పుడు లభ్యమైన 7 శాఖలని నేర్చుకోవటానికి మన కలికాలపు బుర్రలకి జీవితాలు చాలిచావటం లేదు. మనలాంటి మహనుభావులు పుడతారని తెలీదు కాబోలు వేదాలని కొంచెం క్లిష్టాంగా సృష్టించాడు బ్రహ్మ. కెన్నిగన్ రిచీ వ్రాసిన సి పుస్తకం చదవలేక యస్వంత్ కనిత్కర్ లెట్ ఉస్ సి చదివే పులిహార గాళ్ళం మనం. మనకి వేదాల్లో ఎముందో ఎలా తెలుస్తుంది ?[The value of pi is embedded in compled slokas . and also the concept of inifinity, error correction/detection methods , calculas and details of geometry. http://www.hindupedia.com/en/Mathematics_of_the_Vedas ] ఇవన్ని భగవంతుని ఉపాసనా విధాన్ని వివరిస్తూ చెప్పిన విశేషాలే కాని , ఇఈఈ పేపర్లు కావు. పిచ్చి హిందూ సన్యాసులు ఆత్మ/దేవుడి మీద చేసిన పరిశోధన రుద్దుకునే సబ్బుల మీద తిరిగే కార్ల మీద చెయ్యలేదు. అయినా , సిరివెన్నెల పాటలు అర్థం కాని మన బుఱ్ఱలకి వేదాల్లో ఎముందో ఇట్టే ప్రయత్నం లేకుండా తెలిసిపోవాలి. తెలియనందుకు వేదాల్లో ఉన్నది పులిహోర అని విమర్శలు, అలా తెలియజెప్పనందుకు ఈ హిందూ మతం చెడ్డది , దీనికి ఈ గతే పట్టాలి అని సెటైర్లూ. రేమెళ్ళ అవధానులు గారు , వేదాల్లో ఆయన గమనించిన , ఇప్పటి జనాలకి కావాల్సిన కొన్ని విషయాలని ఈ పుస్తకంలో అందించారు. వేదాల్లో ఎముంది అనేవాళ్ళకి? ఎముందో తెలుసుకోవలనుకునే వాళ్ళకి(రెండిట్లోతేడా ఉందండోయ్) ఈ పుస్తకం చక్కటి సమాధానం.[Title of the book : SCIENCE AND TECHNOLOGY IN VEDAS AND SASTRAS Author : Dr.RVSS Avadhanulu ]
Book Review and Where you can get it :