Sunday, June 5, 2011

రామ రామ నీవారము గామా రామ - త్యాగరాజకృతి - ఆనందభైరవి రాగం

Word by Word Meaning :
ప. రామ రామ నీవారము గామా రామ సీతా
రామ రామ సాధు జన ప్రేమ రారా

చ1. మెరుగు చేలము కట్టుక మెల్ల రారా రామ
కరగు బంగారు సొమ్ములు కదల రారా (రామ)

చ2. వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామ
మరుగు జేసుకొనునట్టి మహిమ రారా (రామ)

చ3. మెండైన కోదండ కాంతి మెరయ రారా కనుల
పండువగయుండు ఉద్దండ రారా (రామ)

చ4. చిరు నవ్వు గల మోము జూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా (రామ)

చ5. కందర్ప సుందరానంద కంద రారా నీకు
వందనము జేసెద గోవింద రారా (రామ)

చ6. ఆద్యంత రహిత వేద వేద్య రారా భవ
వేద్య నే నీవాడనైతి వేగ రారా (రామ)

చ7. సు-ప్రసన్న సత్య రూప సుగుణ రారా రామ
అ-ప్రమేయ త్యాగరాజునేల రారా (రామ)

Get this widget | Track details | eSnips Social DNA


No comments: