

నీతనయు చేత బ్రతుకమే యశోదమ్మ
నీతనయు చేత అతి/అదె ఘాతుకము కాపురము
యేతీరున జేతు మమ వ్రాతఫల మేతీరౌనో
నిన్న నాదు చిన్నకోడలన్న పిన్నకన్నె
మున్నే ఉన్న తానె మిన్నానంచు భర్ణాసరము(??) వెనువేసి
నిన్నే నమ్మియున్నాననెనే దాని చన్నుబట్టి కెంగాలించుకెన్నో చేసెనే
ఆవాడ మాయన్నగారన్నీ చూచెనే యశోదమ్మ
ఉట్టి పాలచట్టి తూట్లుగొట్టి నోరుబట్టి త్రాగునట్టి వేళ నాదు
పట్టి జుట్టుబట్టి కొట్టబోగ వట్టు కొట్టకుమనెనే
నావంటి కుర్రబుట్టుని(??) వట్టు రమ్మనెనే(??)
యీలాంటి సుతునెట్టు గంటివోయమ్మా
మాగుట్టు పోగొట్టి చనుబట్టి మోవినట్టే కరచి పూల/ఁగూల కొట్టెనే యశోదమ్మా
ధరణి వేడురీ జోగి కనయు సుందరాంగ విని వదల జాలక
వ్రేతతరుణి మానధనములెల్ల చూరగొనెనే
ధరణి పరిపూర్ణుడాయనె వీరలకెల్ల(??) కోరికలదీర బ్రోచెనె
భవబంధముల పారద్రోలి చేరదీసెనే యశోదమ్మా
(సాహిత్యంలో తప్పులుంటే దయచేసి తెలియజేయగలరు.
పాట విని లిరిక్స్ వ్రాసినందుకు నారాయణం సుబ్రహ్మణ్యం , ప్రశాంత్ నేతి, శైలజ గార్ల కు ధన్యవాదాలు)
1 comment:
పాట విని సాహిత్యం రాసిన నారాయణం సుబ్రహ్మణ్యం , ప్రశాంత్ నేతి, శైలజ గార్ల కు నా తరపునుంచికూడా కృతజ్ఞతలు.
Post a Comment