Sunday, September 4, 2011

రావయ్య భద్రాచలధామా శ్రీరామా , భద్రాచల రామదాసు కీర్తన, ఆనంద భైరవి రాగం


Audio link :  Hyd AIR Artists

ప|| రావయ్య భద్రాచలధామా శ్రీరామా | రమణీయ జగదభిరామ లలామా ||


అప|| కేవల భక్తి విలసిల్లునా/విలసిల్లగా | భావము తెలిసిన దేవుడవైతే ||


చ|| ప్రొద్దున నిను పొగడుచు నెల్లప్పుడు | పద్దుమీరకును/పద్దుమీ రగను భజనలు చేసెద |
గద్దరితనమున ప్రొదులు పుచ్చక/పుచ్చుచు | ముద్దులు కులుకుచు మునుపటివలె (నిటు) ||


చ|| నన్నుగన్న తండ్రీ (నా) మదిలో(న) నీ- | కన్న నితరులను కొలిచెదనా ఆ- |
పన్నరక్షకా వర దినకర కుల /[శ్రీకర దివ్య ప్రభాకర పుర]- | రత్నాకర పూర్ణ సుధాకర ||


చ|| అంజలి చేసెద నరమర లేక | కంజదళాక్ష కటాక్షము లుంచము |
ముజ్జగములకును ముదమిడు పదముల | గజ్జెలు కదలగ ఘల్లు ఘల్లుమన ||


చ|| దోషము లెంచని దొరవని నీకు | దోసలి యొగ్గితి తొలుత పరాకు |
దాసుని తప్పులు దండముతో సరి/దీరు | వాసిగ రామదాసు నిక బ్రోవగా ||

pa|| rAvayya BadrAcaladhAmA SrIrAmA | ramaNIya jagadaBirAma lalAmA ||
apa|| kEvala Bakti vilasillunA/vilasillagA | BAvamu telisina dEvuDavaitE ||
ca|| prodduna ninu pogaDucu nellappuDu | paddumIrakunu/paddumIraganu Bajanalu cEseda |
gaddaritanamuna produlu puccaka/puchchuchu | muddulu kulukucu munupaTivale (niTu) ||
ca|| nannuganna taMDrI (nA) madilO(na) nI- | kanna nitarulanu kolicedanA A- |
pannarakShakA vara dinakara kula /[SrIkara divya prabhAkara pura]- | ratnAkara pUrNa sudhAkara ||
ca|| aMjali cEseda naramara lEka | kaMjadaLAkSha kaTAkShamu luMcamu |
mujjagamulakunu mudamiDu padamula | gajjelu kadalaga Gallu Gallumana ||
ca|| dOShamu leMcani doravani nIku | dOsali yoggiti toluta parAku |
dAsuni tappulu daMDamutO sari/dIru | vAsiga rAmadAsu nika brOvagA ||

3 comments:

Dr.Suryanarayana Vulimiri said...

శ్రవణ్ కుమార్ గారు, మీరు సంగీత సాహిత్యాలకు చేస్తున్న సేవ అపూర్వం. చాల మంచి కీర్తన పోస్టు చేశారు. ఆనంద భైరవి వింటుంటే చాల ఆహ్లాదంగా వుంది. చక్కని రామదాసు రాచిలుక పలుకులు. నేను గమనించినది ఏమిటంటే, సాహిత్యంకు పాటకు అక్కడక్కడ వ్యత్యాసాలున్నాయి. కొన్ని చోట్ల అది తాళం సరిపోవడానికి మార్చారనుకుంటాను. కాని కొన్ని చోట్ల పూర్తి సాహిత్యమే వేరుగా వుంది. ఒక చరణం "అంజలి చేసెద" ఈ పాటలో లేదు.

Sravan Kumar DVN said...

సూర్యనారాయణ గారు,
ధనయవాదాలు.
ఔనండి, నేను చూసిన సహిత్యానికి , పాడిన దానికి వత్యాసాలున్నాయి. సాధ్యమైన చోట్ల రెండు వర్షన్స్ ఇచ్చాను. చివరి లైన్ నాకు సరిగా అర్థం కాలెదు.

ఆనందభైరవి నాకు చాలా ఇష్టమండి. ఈ రాగంలో మరికొన్ని కీర్తనలు ఇక్కడ చూడండి.

http://ramachilaka.blogspot.com/search/label/%E0%B0%86%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%AD%E0%B1%88%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF


-శ్రవణ్

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

ఈ కీర్తన చదవడమేగానీ నేనెప్పుడూ వినలేదు. బాగా పాడారు. ఆడియో క్వాలిటికూడా బాగుంది. టపా పెట్టినందుకు ధన్యవాదములు.

"మీరు సంగీత సాహిత్యాలకు చేస్తున్న సేవ అపూర్వం" - సూర్యనారాయణ గారి మాటలతో ఏకీభవిస్తున్నాను.