Tuesday, September 20, 2011

శంభుని కరుణవు నీవమ్మా - శ్రీ గణపతి శచ్చిదానంద స్వామి రచన - శ్రీపాదపినాకపాణి స్వరరచన - మల్లాదివారి గాత్రంలో, రాగం : వలజి


 Video : Valaji ragam : Malladi Brothers
Audio link : Malladi Brothers

శంభుని కరుణవు నీవమ్మా జనని
జగముల ఆయుసు నీవమ్మా


సింహపు జూల శివుజడలు
మెత్తని కుచ్చులు నీ కురులు
ఫెళఫెళ నవ్వుల మొరకతడు
విరిసిన వెన్నెల నీనవ్వు


ప్రళయ మహోగ్రపు శివునెడద
నీయెద మెత్తని పూరేకు
యెముకలగూడ శివు గుండియ
నీవురము పొంగేటి పాలవెల్లి


ఆ కళ్ళు మూడగ్ని గుండాలు
నీ కళ్ళలో ప్రేమ పొంగారు
ఆ ఫాలమే క్రోధ సంలగ్నము
నీ నుదురు అరచందురుని నేస్తము      ...3

ప్రళయార్భటీ ఘోర మా తాండవం

రసరమ్య శుచిహేల నీ నృత్యము
ఉగ్రత్వ మాస్వామి ఉల్లాసము
వాత్సల్యమే నీకు పరమార్థము   



నీవాయనను విడబోవు
నినువీడి ఆయన మనలేడు
మీయిద్దరిదివ్యసంయోగమే
లోకాల బ్రతికించు సచ్చిదానందము