శ్యామ శాస్త్రి కృతి , రాగం : భైరవి
పల్లవి
కామాక్షి అనుదినము మరవకనే నీ -
పాదములే దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచి (కామాక్షి)
స్వర సాహిత్యం[1-8]
కుంద రదనా కువలయ నయనా - తల్లి రక్షించు (కామాక్షి)
కంబు గళ నీరద చికురా విధు - వదనా మాయమ్మా (కామాక్షి)
కుంభ కుచ మద మత్త గజ గమ - పద్మ భవ హరి శంభు నుత పదా
శంకరీ నీవు నా చింతల వేవేగ - దీర్చమ్మావిపుడు (కామాక్షి)
భక్త జన కల్ప లతికా - కరుణాలయా సదయా గిరి తనయా
కావవే శరణాగతుడు గదా - తామసము సేయక వరమొసగు (కామాక్షి)
పాతకములను దీర్చి నీ పద - భక్తి సంతతమీయవే
పావని గదా మొర వినవా - పరాకేలనమ్మా వినమ్మా (కామాక్షి)
దురిత హారిణి సదా నత ఫల - దాయకియని బిరుదు భువిలో
గలిగిన దొరయనుచు - వేదములు మొరలిడగను (కామాక్షి)
నీప వన నిలయా సుర సముదయా - కర విధృత కువలయా మద
దనుజ వారణ మృగేంద్రాశ్రిత - కలుష దమన ఘనా
అపరిమిత వైభవము గల నీ స్మరణ - మదిలో దలచిన జనాదులకు
బహు సంపదలనిచ్చేవిపుడు - మాకభయమియ్యవే (కామాక్షి)
శ్యామ కృష్ణ సహోదరీ శివ - శంకరీ పరమేశ్వరీ
హరి హరాదులకు నీ మహిమలు - గణింప తరమా సుతుడమ్మా
అభిమానము లేదా నాపై దేవీ -
పరాకేలనే బ్రోవవే ఇపుడు శ్రీ భైరవీ (కామాక్షి)
kAmAkshi anudinamu , shyAma Sastry , ragam : bhairavi
pallavi
kaamaakshi anudinamu maravakanae nee -
paadamulae dikkanuchu nammitini Sree kaMchi (kaamaakshi)
kuMda radanaa kuvalaya nayanaa - talli rakshiMchu (kaamaakshi)
kaMbu gaLa neerada chikuraa vidhu - vadanaa maayammaa (kaamaakshi)
SaMkaree neevu naa chiMtala vaevaega - deerchammaavipuDu (kaamaakshi)
bhakta jana kalpa latikaa - karuNaalayaa sadayaa giri tanayaa
kaavavae SaraNaagatuDu gadaa - taamasamu saeyaka varamosagu (kaamaakshi)
paavani gadaa mora vinavaa - paraakaelanammaa vinammaa (kaamaakshi)
durita haariNi sadaa nata phala - daayakiyani birudu bhuvilO
galigina dorayanuchu - vaedamulu moraliDaganu (kaamaakshi)
danuja vaaraNa mRgaeMdraaSrita - kalusha damana ghanaa
aparimita vaibhavamu gala nee smaraNa - madilO dalachina janaadulaku
bahu saMpadalanichchaevipuDu - maakabhayamiyyavae (kaamaakshi)
Syaama kRshNa sahOdaree Siva - SaMkaree paramaeSvaree
hari haraadulaku nee mahimalu - gaNiMpa taramaa sutuDammaa
abhimaanamu laedaa naapai daevee -
paraakaelanae brOvavae ipuDu Sree bhairavee (kaamaakshi)