Tuesday, July 10, 2012

రామ రామ పాహి రామ , స్వాతి తిరునాళ్ , rAma rAma pAhi rAma , swAti tirunAL, rEvagupti(?)

రామ రామ పాహి రామ , స్వాతి తిరునాళ్ , rAma rAma pAhi rAma , swAti tirunAL, ragam :  rEvagupti(?)
Audio link : Trichur Brothers

పల్లవి
రామ రామ పాహి రామ


అనుపల్లవి
కామకమనీయకాంగ హేమాంబర ముఖవికసితసోమ 
సోమవినుతనృపలలామమహితకాంతిసీమ


చరణం
సేవకజనసమవరద సీతావర సుఖకరద-
రావలోక ఘనశారదరమ్యకేశ వరద
భూవలయాధిప కరదభూప గమజితద్విరద-
భావ సకలగదహర దయావిలసిత రుచిర || 1 ||

కాననవిరచితచరణ కంజతామ్రతరచరణ
సూనహార శుభకరణ సూర్యకులాభరణ
దానవకులమదహరణ దీనదీనజనశరణ
మౌనికల్పితస్మరణ మాననీయ మహితరణ || 2 ||

పాలితకౌశికసవన పద్మనాభ మరుదవన-
శైలవైరికృతనవన శాంతసాగరవన
నీలగాత్ర గుణభవన నీతిహీనఘనపవన
సాలభేదకృతజవన సరోజాక్ష భృతభువన || 3 ||



pallavi
raama raama paahi raama


anupallavi
kaamakamaneeyakaaMga haemaaMbara mukhavikasitasOma sOmavinutanRpalalaamamahitakaaMtiseema


charaNaM
saevakajanasamavarada seetaavara sukhakarada-
raavalOka ghanaSaaradaramyakaeSa varada
bhoovalayaadhipa karadabhoopa gamajitadvirada-
bhaava sakalagadahara dayaavilasita ruchira || 1 ||

kaananavirachitacharaNa kaMjataamrataracharaNa
soonahaara SubhakaraNa sooryakulaabharaNa
daanavakulamadaharaNa deenadeenajanaSaraNa
maunikalpitasmaraNa maananeeya mahitaraNa || 2 ||


paalitakauSikasavana padmanaabha marudavana-
SailavairikRtanavana SaaMtasaagaravana
neelagaatra guNabhavana neetiheenaghanapavana
saalabhaedakRtajavana sarOjaaksha bhRtabhuvana || 3 ||

Thursday, July 5, 2012

సంతాన రామ స్వామినం saMtAna rAmaswAminam, hiMdOLa vasaMtaM - రాగం హిందోళ వసంతం - ముత్తుస్వామి దీక్షితార్

 రాగం హిందోళ వసంతం - ముత్తుస్వామి దీక్షితార్ , తాళం ఆది
Audio link : TM Krishna
Audio link : Nithyashree Mahadevan
Audio link : Radha Jayalakshmi
Audio link : KJ Yesudas
This kriti was composed on Santhana Ramaswamy temple @Needamangalam, Tamilanadu
పల్లవి
సంతాన రామ స్వామినం 
సగుణ నిర్గుణ స్వరూపం భజరే


అనుపల్లవి
సంతతం యమునాంబా పురి నివసంతం
నత సంతం హిందోళ - 
(మధ్యమ కాల సాహిత్యం)
వసంత మాధవం జానకీ ధవం
సచ్చిదానంద వైభవం శివం


చరణం
సంతాన సౌభాగ్య వితరణం
సాధు జన హృదయ సరసిజ చరణం
చింతామణ్యాలంకృత గాత్రం
చిన్మాత్రం సూర్య చంద్ర నేత్రం
(మధ్యమ కాల సాహిత్యం)
అంతరంగ గురు గుహ సంవేద్యం
అనృత జడ దుఃఖ రహితం అనాద్యం



pallavi
saMtaana raama svaaminaM  - saguNa nirguNa svaroopaM bhaja rae


anupallavi
saMtataM yamunaaMbaa puri nivasaMtaM - nata saMtaM hiMdOLa - 
(madhyama kaala saahityaM)
vasaMta maadhavaM jaanakee dhavaM - sachchidaanaMda vaibhavaM SivaM


charaNaM
saMtaana saubhaagya vitaraNaM - saadhu jana hRdaya sarasija charaNaM
chiMtaamaNyaalaMkRta gaatraM - chinmaatraM soorya chaMdra naetraM
(madhyama kaala saahityaM)
aMtaraMga guru guha saMvaedyaM - anRta jaDa du@hkha rahitaM anaadyaM




Friday, June 8, 2012

సదాచలేశ్వరం - రాగం భూపాళం , sadAchalESwaraM bhAvayE, bhUpAlaM , ముత్తుస్వామి దీక్షితార్

సదాచలేశ్వరం - రాగం భూపాళం - తాళం ఆది
Audio link : Hyderabad Brothers
Audio link : Malladi Brothers
this kritis is on Achaleswara mahadeva temple. it is in mount abu , rajasthan.

పల్లవి
సదాచలేశ్వరం భావయేऽహం 
చమత్కార పుర గేహం 
(మధ్యమ కాల సాహిత్యం)
గిరిజా మోహం


అనుపల్లవి
సదాశ్రిత కల్ప వృక్ష సమూహం
శరణాగత దేవతా సమూహం
(మధ్యమ కాల సాహిత్యం)
ఉదాజ్య కృత నామధేయ వాహం
చిదానందామృత ప్రవాహం


చరణం
చమత్కార భూపాలాది ప్రసాద -
కరణ నిపుణ మహాలింగం
ఛాయా రహిత దీప ప్రకాశ -
గర్భ గృహ మధ్య రంగం
సమస్త దుఃఖాది హేతు భూత -
సంసార సాగర భయ భంగం
శమ దమోపవృత్యాది సంయుక్త -
సాధు జన హృదయ సరసిజ భృంగం
(మధ్యమ కాల సాహిత్యం)
కమల విజయ కర విధృత కురంగం
కరుణా రస సుధార్ణవ తరంగం
కమలేశ వినుత వృషభ తురంగం
కమల వదన గురు గుహాంతరంగం

Sanjay Subramanyam, Nityasri mahadevan

Thursday, May 31, 2012

శ్రీ రామం రవి కులాబ్ధి - రాగం నారాయణ గౌళ , SrIrAMmam ravikulAbdhisOmam, nArAyana gouLa ముత్తుస్వామి దీక్షితార్

Audio : Yesudas

Audio link : TM Krishna
శ్రీ రామం రవి కులాబ్ధి - రాగం నారాయణ గౌళ - తాళం ఆది


పల్లవి
శ్రీ రామం రవి కులాబ్ధి సోమం
శ్రిత కల్ప భూరుహం భజేऽహం




అనుపల్లవి
ధీరాగ్రగణ్యం వరేణ్యం 
దీన జనాధారం రఘు వీరం
(మధ్యమ కాల సాహిత్యం)
నారదాది సన్నుత రామాయణ - 
పారాయణ ముదిత నారాయణం


చరణం
దశరథాత్మజం లక్ష్మణాగ్రజం
దానవ కుల భీ-కరం శ్రీ-కరం
కుశ లవ తాతం సీతోపేతం 
కువలయ నయనం సు-దర్భ శయనం
(మధ్యమ కాల సాహిత్యం)
సు-శర చాప పాణిం సుధీ మణిం
సూనృత భాషం గురు గుహ తోషం
దశ వదన భంజనం నిరంజనం
దాన నిధిం దయా రస జల నిధిం
Sanjay subramanyan, Trichur Brothers

Sunday, April 15, 2012

జయ జయ జయ జానకీకాంత , jaya jaya janaki kanta , nata- పురందరదాసు కీర్తన , నాట రాగం


Audio link : ML Vasanta kumar
Audio link : Violin : A Kanyakumari
Audio link : Carnatica Brothers

జయ 
జయ జయ జానకీకాంత జయ సాధుజనవినుత
జయతు మహిమానంద జయ భాగ్యవంత


ఆనుపల్లవి
దశరథ మహావీరే/దరథాత్మజ వీర దశకంఠసంహారే
పశుపతీశ్వరమిత్ర పావనచరిత్ర
కుసుమబాణస్వరూప కుశలకీర్తికలాప
అసమసాహసశిక్ష అంబుజదలాక్ష


చరణం:
సామగానవిలోల సాధుజనపరిపాల
కామితార్థవిధాత కీర్తిసంజాత
సోమసూర్యప్రకాశ సకలలోకాధీశ
శ్రీమహావీర రఘువీర సింధుగంభీర
చరణం:
సకలశాస్త్రవిచార శరణుజనమందార
వికసితాంబుజవదన విశ్వమయసదన
సుహృతమోక్షాధీశ సాకేతపురవాస
భక్తవత్సల రామ పురందరవిఠల

Wednesday, February 22, 2012

హరి హరి రామ నన్నరమర జూడకు , hari hari rAma - రామదాసు కీర్తన


Audio link : Malladi Bros , kanada ragam 
Audio link : Sri Nedunuri Krishnamurthy teaching to Malladi bros in కానడ రాగం, ఆది తాళం

హరి హరి రామ నన్నరమర జూడకు
నిరతము నీ నామస్మరణ మేమరను


దశరధ నందన దశముఖ మర్దన
పశుపతి రంజన పాప విమోచన


మణిమయ భూషణ మంజుల భాషణ
రణ జయ భీషణ రఘుకుల పోషణ


పతితపావన నామ భద్రాచలధామ
సతతము శ్రీరామదాసు నేలు రామ



Tuesday, January 31, 2012

గోపనందన వలరిపునుత , gOpananNdana valaripunuta, స్వాతి తిరునాళ్, భూశవాళి రాగం

By Prof.Omanakutty
By Sri.MS.Subbalakshmi
By Sreevalsan From Album Bhavayami Raghuramam


ఫల్లవి
గోపనందన వలరిపునుత పద సారస మారమణా పాహి (గోప)


ఆనుపల్లవి
తాపసగేయ కీర్తే భవ తాపవిమొచన మూర్తే
దివ్యహేమ మకుటాదివిరాజిత పద్మనాభ మధుసూదన జయ జయ (గోప)


చరణం
పాత ఫాల్గుణ హరే కరి పరమగమామర పాలన రుచిపద
సామజాధిప భయహర పటుచరిత
పీత (సు)వసన విలసిత మృగమద వాత నందన లాలిత పదయుగ
నీతి సాగర యదుకులవర భవ ఖేదనాశన నవజల హ(ధ?)రసమ (గోప)




Prof.OmanaKutty

meaning from swathithirunal.in
Oh! The son of NANDAGOPA! You are worshipped by INDRA. Oh! MARAMANA- the Lord of goddess LAKSHMI! Please protect me.
Your glory is sung by the sages. You bestow salvation from the misery of the cycle of birth & death. You shine gloriously with an iridescent golden crown. You are PADMANABHA who vanquished the demon MADHU. May you be victorious!
You destroyed the miseries of ARJUNA. Your gait is like an elephant. The celestials find refuge at your beautiful feet. Yours is the glorious exploit of allaying the fear of GAJENDRA. You are clad in golden hued silk. Your forehead is adorned with KASTURI TILAKA; Your feet are massaged by the son of wind god. You are the ocean of justice, the distinguished son of YADU clan, destroyer of the misery of birth, you are with a form resembling dark rain bearing clouds.
You disperse sins like the wind disperses the cloud, Oh compassionate one! You are perceptible through the VEDA-s, your eyes resemble the petals of the lotus blooming in the autumn, your form surpasses the beauty of Cupid, you sport a beatific smile, you protect the cowherds, oh the light of the moon dynasty! You are adorned with the beautiful feathers of the peacock, and you enchant the devotees, who have shed their egos, please protect me.
Please protect me oh lord of the universe! You, whose face resemble the lotus, and have GARUDA for mount. You are worshipped by BRAHMA, have a forehead like the crescent moon, with shining dark tresses which resemble dark clouds, you annihilate the cruel and formidable demons. You recline on the ocean of milk, wearing KAUSTUBHA garland, which adds to your beauty. Please protect me oh lord! Who reside in SESHAPURA.

MS Subbalakshmi

Monday, January 30, 2012

ఏ దారి సంచరింతురా , త్యాగరాజ కృతి, రాగం : శ్రుతి రంజని

M.P.Sruthi Ravali
Sri. M.Balamuralikrishna
ప. ఏ దారి సంచరింతురాయిక పల్కరా


అ. శ్రీ-దాది మధ్యాంత రహిత
సీతా సమేత గుణాకర నే(నే దారి)


చ. అన్ని తానను మార్గమున చనగ
నన్ను వీడను భారమనియాడెదవు
తన్ను బ్రోవు దాస వరదాయంటే
ద్వైతుడనెదవు త్యాగరాజ నుత (ఏ దారి)

Wednesday, December 14, 2011

నీ పదసారస రతులకు - కృష్ణామాచార్య కృతి

నీ పదసారస రతులకు - NCh కృష్ణామాచార్య కృతి  , హైమవతి రాగం(?) 
Audio :  TK Sisters

నీ పదసారస రతులకు నిఱయబాధలుండునే రామ

తాపత్రయమనియెడు పెను దావమందు చిక్కుకొనక

మనసున నీ మంత్రమహిమ, మఱి నాల్కను నామమహిమ
ఒనఱ వీనులందు నీ గుణోత్తర మహిమ
ఘనముగ రోమాంచమడఱ తనువు మఱచి ఆడి పాడి
అనవరతము వర్ధిల్లు మహామహులకు రామ సదా

Thursday, December 8, 2011

గజవదనమాశ్రయే , NC కృష్ణమాచార్యులు , కేదారం

రాగం : కేదారం , రచన/సంగీతం : శ్రీ NC కృష్ణమాచార్యులు 
గజవదనమాశ్రయే, గజవదన మాశ్రయే సతతం, 
గజవదనమాశ్రయే కైలాసాచల సదనం గజవదనమాశ్రయే 
సుజనార్తి శోషణం, శుభగుణం విజయైక కారణం విధృతాహిగణాభరణం  
ఖగవాహన సత్కలావతీర్ణం, కాయజారిరివ పాండురవర్ణం
నిగమశాఖీ సత్ఫలం, ధృతకలం, నీరజారి మదహరం భాస్వరం 
విగళిత మాయామోహావేశం, విరచిత శ్రీగుహ సహసంచరణం
అగణిత మోదక ఖాదన నిపుణం, అగరాట్ దౌహిత్రం సుపవిత్రం
Sri NCh Krishnamacharyulu


కృతి విని సాహిత్యం వ్రాసి అందించిన కౌటిల్య గారికి కృతజ్ణతలు.

Wednesday, October 5, 2011

నవరాత్రి దేవి కృతులు : యోగ యోగేశ్వరీ త్రిపుర వాసిని , ఊతుక్కాడు వేంకట కవి , ఆనందభైరవి రాగం

Audio  : Bombay Sisters

పల్లవి:
యోగ యోగేశ్వరీ త్రిపుర వాసిని
మధ్యమకాలం:
యోజయ మామపి తవ పాద పద్మ మూలే
ముని జనానుకూలే
శ్రీ విద్యా జ్ఞాన భక్తి నాద [గాన] (యోగ)

అనుపల్లవి:
త్యాగేశ హృదయేశ్వరి ప్రసిద్ధ
చతుర్దశ కోణేశ్వరి
భోగ మోక్ష వరదాయకి సర్వ -
సౌభాగ్య దాయక చక్రేశ్వరి (అంబ)
మధ్యమకాలం:
ఆగమాది సకల శాస్త్రార్థ రూపే
అఖిల భువన పాలిత వర ప్రతాపే
నాగరత్న తాళ పత్ర కనకాభే
నతజన మన పర కరుణాయుత శోభే (యోగ)

చరణం:
సంప్రదాయ యోగిని పరివారే
సదాశివ హృదయ విహారే అంబ
హంసతూలికా తల్ప సారే మహా-
మాయా మంత్రార్థ సారే ఏకామ్ర
తరుమూలే శ్రీ కాంచిపుర క్షేత్రే(అంబ)
పవిత్రే తామ్ర వర్ణాంగ మతంగ ముని
పుత్రే సుచరిత్రే (యోగ)
మధ్యమకాలం:
ఈంకారకామకళామంత్రవిహారే
ఈశ్వరతత్వవిచారే ఆనందాది
అధికరణభావ భువనాత్మకానంద-
రూపే చతుర్దశప్రాకారే
youtube Video : 

Tuesday, October 4, 2011

నవరాత్రి దేవి కృతులు : సుధామయి సుధానిధి , ముత్తయ్య భాగవతార్, అమృతవర్షిణి రాగం

Audio : Priya Sisters 

 Audio : Bombay Jayashree 

Youtube : Smt. Gayathri Venkataraghavan
 పల్లవి
సుధామయి సుధానిధి సుమచరేక్షు కోదండే

అనుపల్లవి
విధీంద్రనుతే విమలే సలహౌ వేదసారే విజయాంబికే

చరణం
సరసిజాక్ష జగన్మోహిని సరసరాగ మణిభూషణి 
హరికేశ ప్రియ కామిని ఆనందామృతక(వ)ర్షణి

Flute : Sikkil Mala Chandrasekhar
 
 Veena : Rajesh Vaidhya
 
 Mandolin U Srinivas
 
Saxophone Kadri Gopalanath
 

Monday, October 3, 2011

నవరాత్రి దేవి కృతులు : కామాక్షీ నాతో వాదా దయ లేదా , శ్యామశాస్త్రి కృతి, బేగడ రాగం

Audio link : Vijay Siva 

Audio link : Vijay Siva , Hummaa.com
పల్లవి
కామాక్షీ నాతో వాదా దయ లేదా
కమలాక్షీ నన్నొకని బ్రోచుట భారమా బంగారు (కామాక్షీ)


అనుపల్లవి
తామసము జేసితే నే తాళనమ్మా నీ
నామ పారాయణము విన వేడితినమ్మా మాయమ్మా (కామాక్షీ)


చరణం
శ్యామ కృష్ణ సోదరీ తల్లీ (అంబా) శుక
శ్యామళే నిన్నే కోరియున్నానమ్మా
మాయమ్మయని నే దలచి దలచి
మాటి మాటికి కన్నీరు విడువ లేదా అంబా
నీవు మాటాడకుండిన నే తాళ లేనమ్మా
నీ బిడ్డను లాలించవే దొడ్డ తల్లివే
కామాదుల చపల చిత్త పామరుడై
తిరిగి తిరిగి ఇలలో
కామిత కథలు విని విని
వేసారి నేను ఏమారి పోతునా (కామాక్షీ)

Youtube Video : Vijay Siva

Sunday, October 2, 2011

నవరాత్రి దేవి కృతులు : అంబా వాణి నన్నాదరించవే - హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్ - కీరవాణి రాగం

Audio link : Subhashini, SowmyaSushma Nittala
Audio link : Bombay Sisters
Audio link : Bombay Jayashree
పల్లవి
అంబా వాణి నన్నాదరించవే


అనుపల్లవి
శంబరారి వైరి సహోదరి కంబు గళేసిత కమలేశ్వరి


చరణం
పరదేవి నిన్ను భజియించే (నిజ) భక్తులను బ్రోచే పంకజాసని
వర వీణాపాణి వాగ్విలాసిని హరికేశపుర అలంకారి రాణి

Saturday, October 1, 2011

నవరాత్రి దేవి కృతులు : సరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీ , శ్యామశాస్త్రి కృతి, శంకరాభరణం రాగం

Audio link : Priya Sisters

Audio link : M.Balamuralikrishna
Audio link : 
Nadaswaram : DSD Desure Selvarathinam
పల్లవి
సరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీ
నీ పదాంబుజములే
సదా నమ్మినానమ్మా శుభమిమ్మా
శ్రీ మీనాక్షమ్మా


అనుపల్లవి
పారాకు సేయక వర దాయకీ నీ
వలే దైవము లోకములో గలదా
పురాణీ శుక పాణీ మధుకర వేణీ
సదా-శివునికి రాణీ (సరోజ)


చరణం 1
కోరి వచ్చిన వారికెల్లను
కోర్కెలొసగే బిరుదు గదా అతి
భారమా నన్ను బ్రోవ తల్లి
కృపాలవాల తాళ జాలనే (సరోజ)


చరణం 2
ఇందు ముఖీ కరుణించుమని నిను
ఎంతో వేడుకొంటిని
నాయందు జాగేలనమ్మా మరియాద
గాదు దయావతి నీవు (సరోజ)


చరణం 3
సామ గాన వినోదినీ గుణ
ధామ శ్యామ కృష్ణ నుతా శుక
శ్యామళా దేవీ నీవే గతి రతి
కామ కామ్యద కావవే నన్ను (సరోజ)

Youtube video playlist : Yesdas, PriyaSisters and Violin : Sandep Bharadwaj