Tuesday, September 8, 2009

సుజనరంజని - సిలికాన్-ఆంధ్ర మాసపత్రిక

పట్నం బస్సు (ఆంధ్రజ్యోతి ‘1975’) - యండమూరి వీరేంద్రనాథ్(click for full story)


తెలంగాణా పల్లె మాండలికంలో , ఉద్యోగం కోసం కన్న తల్లి ని ఉన్న పల్లె ని వదిలి పట్నం పోతున్న కొడుకుని చూసి తండ్రి పడే ఆవేదన ఈ కథ. యండమూరి మార్క్ చాలా సందర్భాలలో కనిపిస్తుంది.
""మోచోడు రావిచెట్టి కేసి, పెద్దోడు బస్ స్టాప్ కేసి విడిపోయేరు. సూర్యుడు పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు. రావిచెట్టు నీడ దట్టంగా పరుచుకుంటూంది. గూటికి చేరుకుంటున్న పక్షుల కలకలం అప్పుడే మొదలవుతోంది. మోచోడు పెట్లోంచి సూది దారం తీసేడు. తోలి నీళ్ళలో తడిపి, కుట్టడం ప్రారంభించేడు. దూరంగా ఎక్కడో తీతువుపిట్ట అరుస్తోంది. మువ్వలు గలగల లాడ్తోంటే ఎడ్ల జత ఒకటి పొలం నుంచి పరిగెత్తుకుంటూ వస్తోంది. గొడ్లు కాసుకొనే కుర్రవాడొకడు గొంతెత్తి యేదో పాడుకుంటూ ఇంటికి సాగిపోతున్నాడు.మోచోని పక్కనే వచ్చి కూర్చున్నాడు యాదగిరి.“నీ ఇంటికెల్లే వస్తాన్నా!!“......”


యుగధర్మం - వెంపటి హేమ(click for full story)
రిటైర్ ఐన ఒక మాష్టారుకి తన కొడుకులనుంచి ఎదురైన చేదు అనుభవం ఈ కథ.
"గుండె నిబ్బరం చేసుకో సుగుణా. ఈ రోజుల్లో మనిషికి కావలసింది, ఏ పరిస్థితినైనా ఎదుర్కో గల మనోధైర్యం ! అది లోపిస్తే, స్వార్ధమే పరమార్ధ మైన ఈ కలియుగంలో మనిషి బ్రతకడం చాలా కష్టం. తల్లి తండ్రులకి, వాళ్లు బ్రతికి ఉండగానే, "మదర్సు డే", "ఫాదర్సు డే" - అంటూ దినాలు జరిపించేసి, ఆ రోజునే చేతులు దులిపేసుకోడం ఫేషన్‌గా మారిన ఈ రోజుల్లో మనం పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోడంలో అర్ధం లేదు. తల్లి తండ్రులు కూడా, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం త్యాగాలూ చేసెయ్యకుండా, కనుగలిగి, ముందు చూపుతో వృద్ధాప్యంలో పబ్బం గడుపుకోడం కోసం నాల్గు రాళ్లు వెనకేసుకోవాలి, తప్పదు. కన్న వాళ్లకీ, బిడ్డలకీ మధ్య తప్పని సరిగా ఉండవలసిన పరస్పర సహకారం లోపించడంతో వచ్చే వెలితి ఎప్పటికైనా జనం అర్ధం చేసుకుంటారో లేదో. ఇది ఒక విష వలయం ! ఒకరి సంగతి ఒకరికి పట్టని పరిస్థితిలో క్రమంగా జాతి నిర్వీర్యమై పోతుంది. స్వార్ధమే ఈ యుగ ధర్మం ! మనమేంచెయ్య లేము" అంటూ నిట్టూర్చారు ఆయన.

ఆవకాయోపాఖ్యానము - ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!(click for full article.)

ఆవకాయ మీద పద్యాలపోటీలో సుజనరంజని పాఠకులు రాసిన కొన్ని పద్యాలు
కం// చారెరుగనివాడును, గో
దారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!


కం// శ్రేష్టంబిది పచ్చళ్ళన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

No comments: