Monday, September 14, 2009

ఓ జగదంబా - శ్యామశాస్త్రి కృతి

రాగం : ఆనందభైరవి తాళం : ఆది

పల్లవి :
ఓ జగదంబా నన్ను అంబా
నీవు జవమున బ్రోవు అంబా

ఆనుపల్లవి :
ఈ జగతి గతియై జనులకు మరి తేజమున రాజవినుతయౌ
రాజముఖి సరోజనయన సుగుణ రాజరాజిత కామాక్షి



చరణం 1 :
కన్నతల్లి నాదు చెంతనింత కన్నడ సలుపగ తగునా
నిన్నునే నమ్మియున్నవాడుగదా నన్నోకని బ్రోచుటకరుదా
అన్ని భువనంబులు గాచేవు ప్రసన్నమూర్తి అన్నపూర్ణవరదా
విన్నపంబు విన్నపించి సన్నిధి విపన్నభయ విమోచన ధౌరేయ



చరణం 2 :
జాలమేల శైలబాల తాళజాలను జననీ నిన్నువినా
పాలనార్థముగ వేరే దైవముల లోలమతియై నమ్మితినా
నీలనుత శీలమునేచ్చట - నైనగాన గానలోల హృ_దయ
నీలకంతరాణి నిన్ను నమ్మితిని నిజంబుగబల్కెడి దయచేసి


చరణం 3 :
చంచలాత్ముడేను యేమి పూర్వ - సంచితముల సలిపితినో
కంచి కామాక్షి నేను నిన్నుపొడగాంచితిని శరణు శరణు నీ
వించుకా చంచలగతి నా దేసనుంచవమ్మా శ్యమక్రిష్ణవినుత
మంచికీర్తినిచ్చునట్టి దేవి మన్నించి నాదపరాధముల సహించి


స్వర సాహిత్యం :
వరసితగిరి నిలయుని ప్రియ ప్రణయిని పరాశక్తి మనవిని వినుమా
మరియాదలెఱుగని దుష్ప్రభుల కోరి వినుతింపగ వరంబొసగు

meaning in english

Audio : Bombay Jayashree , from the album : Chiselled Aesthetics
Audio : A. Kanyakumari - Violin

Youtube video play list :
1. Toronto Brothers Ashwin Iyer and Rohin Iyer
2. Sampagodu S Vighnaraja
3&4.Sankaran Namboothiry's

1 comment:

రాఘవ said...

పల్లవిలో "నీవు జవమున బ్రోవుము" అని ఉండాలనుకుంటానండీ. జవమున అంటే వేగంగా అని.