
Thursday, September 17, 2009
బ్రోవవమ్మా బంగారు బొమ్మా - శ్యామశాస్త్రి కృతి
Audio link
ప: బ్రోవవమ్మా బంగారు బొమ్మా మాయమ్మా
ఆను: బ్రోవవమ్మా నాతో మాట్లాడవమ్మా సార్వభౌమ బొమ్మా కామాక్షమ్మా నను
చ: శ్యామకృష్ణ పూజితా సులలితా శ్యామలాంబా ఏకామ్రేశ్వర ప్రియా తామసము
సేయకనే (కామాక్షమ్మా మాయమ్మా) నా పరితాపములను పరిహరించి నను
|
Wednesday, September 16, 2009
శంకరి శ్రీ రాజరాజేశ్వరి - ఊతుక్కాడు వెంకటకవి

Aduio : Lata Ganapathi & Othrs (notworkign)
Audio link : Hummaa
శంకరి శ్రీ రాజరాజేశ్వరి జయ శివ
మంగళకర కుంకుమ ధర మందస్మిత ముఖ విలాసిని
అంకుశ ధనుః పాశ దండ భాస్కర చక్ర నివాసిని
మధ్యమకాలం:
భృంగి సనక మునిగణ వర పూజిత పరమోల్లాసిని బుధజన హితకారిణి
పరపోశణ వహ్నివాసిని వేంకట కవి హృది సరసిజ వివరణ పటుతర
భాసిని విధి హరిహర సుర సమ్మత నిత్యాంతర ప్రకాశిని
చరణం:
పరికీర్తిత నాదాంతర నిత్యాంతర అంగ రక్షాకర త్రయ ప్రకారే
అతి రహస్య యోగినీ పరివారే గిరిరాజ రాజ వర తనయే సృష్టి
స్థిత్యాది పంచ కారణ కృత్యేంద్ర గణ సమ్మానితే యతీంద్ర గణ
సమ్మోదితే శరణాగత నిజ జన వరదే సంకల్ప కల్పతరు నికరే
సహజ స్థితి సవికల్ప నిర్వికల్ప సమాధి సుఖ వరదే
మధ్యమకాలం:
పర తత్వ నిదిధ్యాసన వితరణ సర్వ బీజ ముద్రాధిపతే
భండాసుర మద ఖండన వైభవ చింతామణి నగరాధిపతే
తరుణారుణ ముఖ కమలే సకలే సారస హిత విద్యాధిపతే
సదా చిదంబర నర్తన పదయుగ సమకర నటనాధిపతే జయ శివ
Tuesday, September 15, 2009
భజస్వ శ్రీ త్రిపుర సుందరీం - ఊతుక్కాడు వెంకటకవి


Audio link : Skydrive
పల్లవి:
భజస్వ శ్రీ త్రిపుర సుందరీ
పాహి షోడశదళసర్వాశాపరిపూరకచక్రేశ్వరి మాంపాహి
నిజసుధాలహరీప్రవాహిని నిత్యకామేశ్వరి
మధ్యమకాలం:
గజముఖ జనని శశధర వదని శిశిరిత భువని
శివమనోరమణి
చరణం:
అతి సుందర సవ్యకరతల పాశాంకుశధరణే శశికిరణే
విధి హరి హరనుత చరణే హార కేయూర కిరీట కనకాభరణే
శృతి నిగమాగమ రమణే వేద వేదాంత వితరణే
మధ్యమకాలం: అధ్యద్భుత కమనీయ ఫలైవ కుచ మండల మండిత హారే
Audio link : Savita Narasimhan , Lata Ganapathy , Salem P Gayathri
Monday, September 14, 2009
ఓ జగదంబా - శ్యామశాస్త్రి కృతి
.jpg)

పల్లవి :
ఓ జగదంబా నన్ను అంబా
నీవు జవమున బ్రోవు అంబా
ఆనుపల్లవి :
ఈ జగతి గతియై జనులకు మరి తేజమున రాజవినుతయౌ
రాజముఖి సరోజనయన సుగుణ రాజరాజిత కామాక్షి
చరణం 1 :
కన్నతల్లి నాదు చెంతనింత కన్నడ సలుపగ తగునా
నిన్నునే నమ్మియున్నవాడుగదా నన్నోకని బ్రోచుటకరుదా
అన్ని భువనంబులు గాచేవు ప్రసన్నమూర్తి అన్నపూర్ణవరదా
విన్నపంబు విన్నపించి సన్నిధి విపన్నభయ విమోచన ధౌరేయ
చరణం 2 :
జాలమేల శైలబాల తాళజాలను జననీ నిన్నువినా
పాలనార్థముగ వేరే దైవముల లోలమతియై నమ్మితినా
నీలనుత శీలమునేచ్చట - నైనగాన గానలోల హృ_దయ
నీలకంతరాణి నిన్ను నమ్మితిని నిజంబుగబల్కెడి దయచేసి
చరణం 3 :
చంచలాత్ముడేను యేమి పూర్వ - సంచితముల సలిపితినో
కంచి కామాక్షి నేను నిన్నుపొడగాంచితిని శరణు శరణు నీ
వించుకా చంచలగతి నా దేసనుంచవమ్మా శ్యమక్రిష్ణవినుత
మంచికీర్తినిచ్చునట్టి దేవి మన్నించి నాదపరాధముల సహించి
స్వర సాహిత్యం :
వరసితగిరి నిలయుని ప్రియ ప్రణయిని పరాశక్తి మనవిని వినుమా
మరియాదలెఱుగని దుష్ప్రభుల కోరి వినుతింపగ వరంబొసగు
meaning in english
Audio : Bombay Jayashree , from the album : Chiselled Aesthetics
Audio : A. Kanyakumari - Violin
Youtube video play list :
1. Toronto Brothers Ashwin Iyer and Rohin Iyer
2. Sampagodu S Vighnaraja
3&4.Sankaran Namboothiry's
Sunday, September 13, 2009
అఖిలాండేశ్వరి రక్ష మామ్ - దీక్షితార్ కృతి
Youtube link : MS Subbulakshmi
youtube link : Bombay Jayashree

పల్లవిఅఖిలాండేశ్వరి రక్ష మాం
ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీఅనుపల్లవి
నిఖిల లోక నిత్యాత్మికే విమలే
నిర్మలే శ్యామళే సకల కలేచరణమ్
లంబోదర గురు గుహ పూజితే
లంబాలకోద్భాసితే హసితే
వాగ్దేవతారాధితే వరదే
వర శైల రాజ నుతే శారదే
(మధ్యమ కాల సాహిత్యమ్)
జంభారి సంభావితే జనార్దన నుతే
జుజావంతి రాగ నుతే
ఝల్లీ మద్దళ ఝర్ఝర వాద్య నాద ముదితే
జ్ఞాన ప్రదే
variations -
రాజ నుతే - రాజ సుతే
ఝల్లీ - జల్లీ
Listen to this kriti sung by MS Subbalakshmi , & another version by Bombay Jayashree
Tuesday, September 8, 2009
సుజనరంజని - సిలికాన్-ఆంధ్ర మాసపత్రిక
తెలంగాణా పల్లె మాండలికంలో , ఉద్యోగం కోసం కన్న తల్లి ని ఉన్న పల్లె ని వదిలి పట్నం పోతున్న కొడుకుని చూసి తండ్రి పడే ఆవేదన ఈ కథ. యండమూరి మార్క్ చాలా సందర్భాలలో కనిపిస్తుంది.
""మోచోడు రావిచెట్టి కేసి, పెద్దోడు బస్ స్టాప్ కేసి విడిపోయేరు. సూర్యుడు పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు. రావిచెట్టు నీడ దట్టంగా పరుచుకుంటూంది. గూటికి చేరుకుంటున్న పక్షుల కలకలం అప్పుడే మొదలవుతోంది. మోచోడు పెట్లోంచి సూది దారం తీసేడు. తోలి నీళ్ళలో తడిపి, కుట్టడం ప్రారంభించేడు. దూరంగా ఎక్కడో తీతువుపిట్ట అరుస్తోంది. మువ్వలు గలగల లాడ్తోంటే ఎడ్ల జత ఒకటి పొలం నుంచి పరిగెత్తుకుంటూ వస్తోంది. గొడ్లు కాసుకొనే కుర్రవాడొకడు గొంతెత్తి యేదో పాడుకుంటూ ఇంటికి సాగిపోతున్నాడు.మోచోని పక్కనే వచ్చి కూర్చున్నాడు యాదగిరి.“నీ ఇంటికెల్లే వస్తాన్నా!!“......”
యుగధర్మం - వెంపటి హేమ(click for full story)
రిటైర్ ఐన ఒక మాష్టారుకి తన కొడుకులనుంచి ఎదురైన చేదు అనుభవం ఈ కథ.
"గుండె నిబ్బరం చేసుకో సుగుణా. ఈ రోజుల్లో మనిషికి కావలసింది, ఏ పరిస్థితినైనా ఎదుర్కో గల మనోధైర్యం ! అది లోపిస్తే, స్వార్ధమే పరమార్ధ మైన ఈ కలియుగంలో మనిషి బ్రతకడం చాలా కష్టం. తల్లి తండ్రులకి, వాళ్లు బ్రతికి ఉండగానే, "మదర్సు డే", "ఫాదర్సు డే" - అంటూ దినాలు జరిపించేసి, ఆ రోజునే చేతులు దులిపేసుకోడం ఫేషన్‌గా మారిన ఈ రోజుల్లో మనం పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోడంలో అర్ధం లేదు. తల్లి తండ్రులు కూడా, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం త్యాగాలూ చేసెయ్యకుండా, కనుగలిగి, ముందు చూపుతో వృద్ధాప్యంలో పబ్బం గడుపుకోడం కోసం నాల్గు రాళ్లు వెనకేసుకోవాలి, తప్పదు. కన్న వాళ్లకీ, బిడ్డలకీ మధ్య తప్పని సరిగా ఉండవలసిన పరస్పర సహకారం లోపించడంతో వచ్చే వెలితి ఎప్పటికైనా జనం అర్ధం చేసుకుంటారో లేదో. ఇది ఒక విష వలయం ! ఒకరి సంగతి ఒకరికి పట్టని పరిస్థితిలో క్రమంగా జాతి నిర్వీర్యమై పోతుంది. స్వార్ధమే ఈ యుగ ధర్మం ! మనమేంచెయ్య లేము" అంటూ నిట్టూర్చారు ఆయన.
ఆవకాయోపాఖ్యానము - ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!(click for full article.)
ఆవకాయ మీద పద్యాలపోటీలో సుజనరంజని పాఠకులు రాసిన కొన్ని పద్యాలు
కం// చారెరుగనివాడును, గో
దారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!
కం// శ్రేష్టంబిది పచ్చళ్ళన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!
Saturday, September 5, 2009
జో జో రామ ఆనంద ఘన - రీతిగౌళ - త్యాగరాజకృతి

చ1. జో జో దశరథ బాల రామ - జో జో భూజా లోల రామ (జో)
చ2. జో జో రఘు కుల తిలక రామ - జో జో కుటిల తరాలక రామ (జో)
చ3. జో జో నిర్గుణ రూప రామ - జో జో సు-గుణ కలాప రామ (జో)
చ4. జో జో రవి శశి నయన రామ - జో జో ఫణి వర శయన రామ (జో)
చ5. జో జో మృదు తర భాష రామ - జో జో మంజుళ వేష రామ (జో)
చ6. జో జో త్యాగరాజార్చిత రామ - జో జో భక్త సమాజ రామ (జో)
Wednesday, August 12, 2009
రామా ఇక నన్ను బ్రోవ రాదా దయ లేదా - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

Audio : Bombay Jayashree
పల్లవి
రామా ఇక నన్ను బ్రోవ రాదా దయ లేదా శ్రీ
అనుపల్లవి
తామసంబు జేసితే ఇక తాళను పలరును వేడను
చరణం
ఆరు శత్రువులను బట్టి హతము జేసి
నేరములను మన్నించి నీవే కావ వలెను గాని
Saturday, May 30, 2009
ఆనంద నటన ప్రకాశం
పల్లవి
ఆనంద నటన ప్రకాశం చిత్సభేశం
ఆశ్రయామి శివ కామ వల్లీశం
అనుపల్లవి
భానుకోటి కోటి సంకాశం
భుక్తి ముక్తి ప్రద దహరాకాశం
దీన జన సంరక్షణ చనం
దివ్య పతంజలి వ్యాఘ్రపాద
దర్శిత కుంజితాబ్జ చరణం
చరణం
చితాంసు గంగాధరం నీలకంధరం
శ్రీ కేదారాది క్షేత్ర ఆధారం భూదేశం శార్దూల చర్మాంబరం చిదంబరం భూసురాద్రి సహస్ర మునీశ్వరం విశ్వేశ్వరం
నవనీత హృదయం సదయ గురుగుహ
దాద మధ్యం వేద వేద్యం
వీత రాగిణ మప్రమేయాద్వైత ప్రతిపాద్యం
సంగీత వాద్య వినోద తాండవ
జాత బహుతర వేద చోద్యం
ప ని ని స త క జ ను త స ని ని
జం తరి త స మ గ మ ప; ని మ గ
త జ ను త క మ గ మ మ ప సా ని ని
త జం తరి ప; మ గ త రి కిణతోం
Saturday, April 18, 2009
ninnE bhajana- నిన్నే భజన సేయువాడను nATa ragam, thyagaraj kriti

అ. పన్నగ శాయి పరుల వేడలేను (ని)
చ. స్నానాది జప తప యోగ ధ్యాన
సమాధి సుఖ ప్రద
సీతా నాథ సకల లోక పాలక
త్యాగరాజ సన్నుత (ని)
P ninnE bhajana sEyu vADanu
A pannaga zAyi parula vEDa lEnu (ninnE)
C snAn(A)di japa tapa yOga dhyAna
samAdhi sukha prada
sItA nAtha sakala lOka pAlaka
tyAgarAja sannuta (ninnE)
Gist
O Lord reclining on the couch of zESa!
O Lord who bestows all the comforts that accrues from such actions like bath in holy waters, mental repetition of Your names (with rosary), penance, asceticism, meditation and identification with object of meditation etc! O Consort of sItA! O Nourisher of the entire Worlds! O Lord well-praised by this tyAgarAja!
I chant Your names only.
I shall not beseech others.
Saturday, October 11, 2008
నారాయణ స్తోత్రం


నారాయణ నారాయణ జయగోవింద హరే
Saturday, September 20, 2008
త్యాగరాజ యోగ వైభవం

ఈ దీక్షితార్ కీర్తన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.
ఆనంద భైరవి రాగంలో స్వరపరచబడిన ఈ కృతి లో రెండురకాల యతులను దీక్షితార్ వారు అధ్బుతంగా ప్రకటించారో చూడండి.
Click here to listen/download this kriti
పల్లవి
త్యాగరాజ యోగ వైభవం సదాశివం
త్యాగరాజ యోగ వైభవం సదాశ్రయామి
త్యాగరాజ యోగ వైభవం
రాజ యోగ వైభవం
వైభవం
సమష్టి చరణమ్
నాగ రాజ వినుత పదం నాద బిందు కలాస్పదం
యోగి రాజ విదిత పదం యుగపద్భోగ మోక్ష ప్రదమ్
యోగ రూఢ నామ రూప విశ్వ సృష్ట్యాది కరణం
యుగ పరివృత్యబ్ద మాస దిన ఘటికాద్యావరణమ్
(మధ్యమ కాల సాహిత్యమ్)
శ్రీ గురు గుహ గురుం సచ్చిదానంద భైరవీశం
శివ శక్త్యాది సకల తత్వ స్వరూప ప్రకాశం
శం
తత్వ స్వరూప ప్రకాశం
సకల తత్వ స్వరూప ప్రకాశం
శివ శక్త్యాది సకల తత్వ స్వరూప ప్రకాశమ్
Muthuswami Dikshitar's song: Tyagarajayoga Vaibhavam in
Anandabhairavi contains the two Yatis - Gopuccha Yati and
Srotovaha Yati. The phrases are:
For Gopuccha Yati (like a cow's tail!):
Tyagaraja Yoga Vaibhavam
Agaraja Yoga Vaibhavam
Rajayoga Vaibhavam
Yoga Vaibhavam
Vaibhavam
Bhavam
Vam
and the Srotovaha Yati (Flowing r iver) in
sam
Prakasham
Svaroopa Prakasham
Tattva Svaroopa Prakasham
Sakala Tattva Svaroopa Prakasham
Sivasaktyadi Sakala Tattva Svaroopa Prakasham
Wednesday, June 25, 2008
కాకతాళీయంగా !
అది చూశి, మన కాకి గారు , ఆహా ! మన బరువు తట్టుకోలేక తాటి కాయ క్రింద పడింది అని జబ్బలు (రెక్కలు) చరుచుకుందట.
ఇదండి, "కాకతాళీయంగా ! " అన్న పదం హిస్టరీ !
Wednesday, February 6, 2008
"తు.చ తప్పకుండా" ఎలా వచ్చింది ?
సంస్కృత శ్లోకాలు రాసేటప్పుడు , కొన్ని నియమాలు ఉండేవట.
అందులో ఒకటి , "పంక్తి కి 8 అక్షరాలు ఉండాలి."
ఒక్కోసారి 8అక్షరాలు రాయటం కుదరనప్పుడు, కొన్ని అక్షరాలను ఉంచవచ్చు.(padding)
అవి :
తు, చ, స్వ, హి, వై, ....
ఉదా : రామాయ లక్ష్మనశ్చతు
మరి ఇవి తెలుగులోకి ఎలా వచ్చాయి ?
పూర్వ కాలంలో , సంస్కృత కావ్యాలను తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు , కొంత మంది కవులు, దేవభాష మీది గౌరవంతో , ఈ తు, చ, స్వ, హి, వై లకు కుద ఎవొ అర్ధాలు (కాని,మరియు...) కల్పించి అనువాదం చేసేవారట .
ఇలాంటి అనువాదాన్ని , తు.చ. తప్పకుండా అనువాదం చెయ్యటం అనేవారట.
అలా వచ్చింది ఈ "తు.చ. తప్పకుండా"
భక్తి టివి లొ గరికపాటి నరసింహా రావు గారు చెప్పగా విన్నాను.