Thursday, September 29, 2011

నవరాత్రి దేవికృతులు : కంజదళాయతాక్షి , దీక్షితార్, రాగం కమలా మనోహరి - తాళం ఆది

Audio link :  Mambalam Sisters

Audio : Nadaswaram : Desur DSD Selvarathinam
Audio  : Veena TN Seshagopalan
Audio : Violink : MS Gopalakrishnan
Audio : Veena : E. Gayatri
Audio : Flute : BV Balasai , Durgaprasad
పల్లవి
కంజ దళాయతాక్షి కామాక్షి
కమలా మనోహరి త్రిపుర సుందరి


అనుపల్లవి
(మధ్యమ కాల సాహిత్యమ్)
కుంజర గమనే మణి మండిత మంజుళ చరణే
మామవ శివ పంజర శుకి పంకజ ముఖి
గురు గుహ రంజని దురిత భంజని నిరంజని


చరణమ్
రాకా శశి వదనే సు-రదనే
రక్షిత మదనే రత్న సదనే
శ్రీ కాంచన వసనే సు-రసనే
శృంగారాశ్రయ మంద హసనే
(మధ్యమ కాల సాహిత్యమ్)
ఏకానేకాక్షరి భువనేశ్వరి
ఏకానందామృత ఝరి భాస్వరి
ఏకాగ్ర మనో-లయకరి శ్రీకరి
ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి

variations -
మనోహరి - కమలా మనోహరి
రంజని దురిత భంజని నిరంజని - రంజని నిరంజని దురిత భంజని
కాంచన వసనే - కాంచన సదనే

Youtube Play list : MS Subbalakshmi, Mambalam Sisters, Priya Sisters...

Wednesday, September 28, 2011

నవరాత్రి దేవి కృతులు : మాతే మలయధ్వజ పాండ్య సంజాతే , ముత్తయ్య భాగవతార్, ఖమాస్ రాగం

Audio link :  Sudha Raghunathan (hummaa.com) (muzigle.com)

[పల్లవి]
మాతే మలయధ్వజ పాండ్య సంజాతే మాతంగ వదన గుహ
[అనుపల్లవి]
శాతోధరి శంకరి చాముండేశ్వరి చంద్రకళాధరి తాయే గౌరీ


da da ni da da ni da da ni da da ni pa ma
da da ni ri sa ni sa da ni sa da pa pa ma
da da ni ga ri ni ri sa ni da pa ni da ma
da da ma ga ma pa ma pa da da ni ni da ma
da da ri sa ni da ni da da ma da ni ma ni
da da sa sa pa da ni da da ma ga ri sa ni
da da pa da da ni da da sa da ni da
ma ga ri sa ni da ni sa ni ni da da pa ma



[ముక్తాయి స్వర సాహిత్యం]
దాతా సకల కలా నిపుణ చతుర
దాతా వివిధ మత(?) సమయ సమరస
దాతా సులభ హృదయ మధుర వచన
దాతా సరస రుచిరతర స్వర లయ
గీత సుఖద నిజ భావ రసిక వర ధాతా
మహిశూర నాద నాల్వటి
శ్రీ కృష్ణ రాజేంద్ర ర నదయ(?) సదా పొరె
మహితె హరికేశ మనోహరే సదయే


[చరణం]
శ్యామే సకల భువన సార్వభౌమే శశి మండల మద్యగే
1.MA,MA, pani dada papa magamapa MA,MA, nida MAsani dapadada
Shyame sakala bhuvana sarva bhoume sasi mandala madhyaga
2.nidanida dapapama PAPA nidapama gamaPA nidaMA sanidapa MAnida
Shyame sakala bhuvana sarva bhoume sasi mandala madhyaga
3.saSAsa nidanisa niDApa magamapa maMAma samagama pasanida NI;
nidani padani mapadani gamapadani samagama padani samagari sasanida pada

Shyame sakala bhuvana sarva bhoume sasi mandala madhyaga



Monday, September 26, 2011

దేహి తవ పద భక్తిం - త్యాగరాయ కృతి , సహానా రాగం


Audio link : Bombay Sisters , from album Enchanting Devi Kritis - 2
Audio link : Roopa Nataraj


ప. దేహి తవ పద భక్తిం
వైదేహి పతిత పావని మే సదా


అ. ఐహికాముష్మిక ఫలదే
కమలాసనానన్యజ వర జననీ (దేహి)


చ1. కలశ వారాశి జనితే కనక భూషణ లసితే
కలశజ గీత ముదితే కాకుత్స్థ రాజ సహితే (దేహి)


చ2. అఖిలాండ రూపిణి అళి కుల నిభ వేణి
మఖ సంరక్షణ రాణి మమ భాగ్య కారిణి (దేహి)


చ3. శరణాగత (జన) పాలనే శత ముఖ మద దమనే
తరుణారుణాబ్జ నయనే త్యాగరాజ హృత్సదనే (దేహి)

Thursday, September 22, 2011

పరమ పావని మామవ - అన్నస్వామి శాస్త్రి , అఠాణా రాగం

Video link : Sri Ranganatha Srama 
(Annaswaami Shaastree - Born July 3, 1899, he was a disciple and nephew (adopted son) of Subbaraya Sastri who was son of Shyama Sastry)
Audio link : Sri RangaNatha Sarma

పల్లవి
పరమ పావని మామవ పర్వతరాజ పుత్రి(కే) అంబా(బే)


అనుపల్లవి
సురనర కిన్నర సన్నుతే శోభన గుణజాతే లలితే కర ధృత
పాశాంకుశ సుమ విషిఖేక్షు చాపే కాంచిపుర వాసిని శ్రీ కామాక్షి


చరణం
చరణ వినత సుర గణపతి సు-మనోగణే కర సరసిజ ధృత మణి వీణే చంద్ర వదనే
పరమేశ్వరి సేవక జన రక్షకి(కే) సదా ప్రణత ఫలదాయికే
భండన ఖండన భండ మహిషముఖ చండ దైత్య మండలే రిపుదండే





Tuesday, September 20, 2011

శంభుని కరుణవు నీవమ్మా - శ్రీ గణపతి శచ్చిదానంద స్వామి రచన - శ్రీపాదపినాకపాణి స్వరరచన - మల్లాదివారి గాత్రంలో, రాగం : వలజి


 Video : Valaji ragam : Malladi Brothers
Audio link : Malladi Brothers

శంభుని కరుణవు నీవమ్మా జనని
జగముల ఆయుసు నీవమ్మా


సింహపు జూల శివుజడలు
మెత్తని కుచ్చులు నీ కురులు
ఫెళఫెళ నవ్వుల మొరకతడు
విరిసిన వెన్నెల నీనవ్వు


ప్రళయ మహోగ్రపు శివునెడద
నీయెద మెత్తని పూరేకు
యెముకలగూడ శివు గుండియ
నీవురము పొంగేటి పాలవెల్లి


ఆ కళ్ళు మూడగ్ని గుండాలు
నీ కళ్ళలో ప్రేమ పొంగారు
ఆ ఫాలమే క్రోధ సంలగ్నము
నీ నుదురు అరచందురుని నేస్తము      ...3

ప్రళయార్భటీ ఘోర మా తాండవం

రసరమ్య శుచిహేల నీ నృత్యము
ఉగ్రత్వ మాస్వామి ఉల్లాసము
వాత్సల్యమే నీకు పరమార్థము   



నీవాయనను విడబోవు
నినువీడి ఆయన మనలేడు
మీయిద్దరిదివ్యసంయోగమే
లోకాల బ్రతికించు సచ్చిదానందము

Sunday, September 4, 2011

రావయ్య భద్రాచలధామా శ్రీరామా , భద్రాచల రామదాసు కీర్తన, ఆనంద భైరవి రాగం


Audio link :  Hyd AIR Artists

ప|| రావయ్య భద్రాచలధామా శ్రీరామా | రమణీయ జగదభిరామ లలామా ||


అప|| కేవల భక్తి విలసిల్లునా/విలసిల్లగా | భావము తెలిసిన దేవుడవైతే ||


చ|| ప్రొద్దున నిను పొగడుచు నెల్లప్పుడు | పద్దుమీరకును/పద్దుమీ రగను భజనలు చేసెద |
గద్దరితనమున ప్రొదులు పుచ్చక/పుచ్చుచు | ముద్దులు కులుకుచు మునుపటివలె (నిటు) ||


చ|| నన్నుగన్న తండ్రీ (నా) మదిలో(న) నీ- | కన్న నితరులను కొలిచెదనా ఆ- |
పన్నరక్షకా వర దినకర కుల /[శ్రీకర దివ్య ప్రభాకర పుర]- | రత్నాకర పూర్ణ సుధాకర ||


చ|| అంజలి చేసెద నరమర లేక | కంజదళాక్ష కటాక్షము లుంచము |
ముజ్జగములకును ముదమిడు పదముల | గజ్జెలు కదలగ ఘల్లు ఘల్లుమన ||


చ|| దోషము లెంచని దొరవని నీకు | దోసలి యొగ్గితి తొలుత పరాకు |
దాసుని తప్పులు దండముతో సరి/దీరు | వాసిగ రామదాసు నిక బ్రోవగా ||

pa|| rAvayya BadrAcaladhAmA SrIrAmA | ramaNIya jagadaBirAma lalAmA ||
apa|| kEvala Bakti vilasillunA/vilasillagA | BAvamu telisina dEvuDavaitE ||
ca|| prodduna ninu pogaDucu nellappuDu | paddumIrakunu/paddumIraganu Bajanalu cEseda |
gaddaritanamuna produlu puccaka/puchchuchu | muddulu kulukucu munupaTivale (niTu) ||
ca|| nannuganna taMDrI (nA) madilO(na) nI- | kanna nitarulanu kolicedanA A- |
pannarakShakA vara dinakara kula /[SrIkara divya prabhAkara pura]- | ratnAkara pUrNa sudhAkara ||
ca|| aMjali cEseda naramara lEka | kaMjadaLAkSha kaTAkShamu luMcamu |
mujjagamulakunu mudamiDu padamula | gajjelu kadalaga Gallu Gallumana ||
ca|| dOShamu leMcani doravani nIku | dOsali yoggiti toluta parAku |
dAsuni tappulu daMDamutO sari/dIru | vAsiga rAmadAsu nika brOvagA ||

Monday, July 18, 2011

సౌందర రాజం ఆశ్రయే - దీక్షితార్ కృతి - బృందావన సారంగ

Pics: Nagapattinam Soundararaja swami temple & utsavavigrahalu



Dikshitar kriti on Nagapattanam Soundaraja perumal (one of 108 divyadesams)
Audio link : Sri Aruna Sairam
పల్లవి సౌందర రాజం ఆశ్రయే 
గజ బృందావన సారంగ వరద రాజం


అనుపల్లవి నంద నందన రాజం నాగ పట్టణ రాజం
సుందరి రమా రాజం సుర వినుత మహి రాజం
(మధ్యమ కాల సాహిత్యం)
మంద స్మిత ముఖాంబుజం మందర ధర కరాంబుజం
నంద కర నయనాంబుజం సుందర-తర పదాంబుజం


చరణం శంబర వైరి జనకం సన్నుత శుక శౌనకం
అంబరీషాది విదితం అనాది గురు గుహ ముదితం
అంబుజాసనాది నుతం అమరేశాది /అమరేంద్రాది సన్నుతం /భావితం

అంబుధి గర్వ నిగ్రహం అనృత జడ దుఃఖాపహం
(మధ్యమ కాల సాహిత్యం)
కంబు విడంబన కంఠం ఖండీ-కృత దశ కంఠం
తుంబురు నుత/ తుంబురు నారద  శ్రీ కంఠం దురితాపహ వైకుంఠం

Audio link : Sri Aruna Sairam 

Tuesday, July 12, 2011

కల్యాణరామ రఘురామ సీతా - ఊతుక్కాడు వెంకటకవి - హంసనాదం

Audio link : Aruna SaiRam
 ఊతుక్కాడు వెంకటకవి - హంసనాదం రాగం

కల్యాణరామ రఘురామ సీతా 
కనకమకుట-మరకతమణి-

లోల హార దశరథబాల సీతా


మల్లికాదిసుగంధమయ-
నవమాలికాది శోభితగళేన
ఉల్లాసపరిశీలన చామర 

ఉభయపార్శ్వేన కుండలఖేలన


గౌతమ-వసిష్ఠ-నారద-తుంబురు-కశ్యపాది మునిగణవరపూజిత
ఔపవాహ్య స్కందదేశాలంకృత హైమసింహాసనస్థిత సీతా


ఆగతసురవర-మునిగణ-సజ్జన-అగణిత-జనగణ-ఘోషిత-మంగళ
రాఘవ రామ రఘురామ రామ జనకజారమణ మనోహర సీతా

భాగదేయ బహుమాన సుధాయ ఉభతార్పిత దిశి దిశి రక్షకవర
మేఘవాహనరవాహనాదినుత ఏకరాజ మహారాజ మమరాజ





notation :

Thursday, June 30, 2011

మాధవ మామవ దేవ - నారాయనతీర్థ - నీలాంబరి రాగం

Audio link : Sheik ChinaMoulana (nadaswaram)
Audio link : Karukuruchi P Arunachalam(nAdaswaram)
మాధవ మామవ దేవ
యాదవ కృష్ణ యదుకుల కృష్ణ ||


సాధు జనా ధార సర్వ భావ
మాధవ మామవ దేవ ||


అంబుజ లోచన కంబు శుభ గ్రీవ
బింబాధర చంద్ర బింబానన
చాంపేయ నాసాగ్ర లగ్న సుమౌక్తిక
శారద చంద్ర జనిత మదన ||


కపట మానుష దేహ కల్పిత - జగదండ కోటి మోహిత భారతీ రమణ
అపగత మోహ తదుద్భవ నిజ జనక - కరుణయా ధ్రుత సేహ సులక్షణ ||


తరళ కుండల రవిమండల వికసిత - నిజ జన మానస పంకేరుహ
కరుణ హాస సుధా నిధి కిరణ - శమిత భవ తాపస జన మోహ ||


మురళీ గాన రసామ్రుత పూరిత - వ్రజ యువతీ మానసార్ణవ భో
సరస గుణార్ణవతీర్ణ భవార్ణవ - సతత గీత కీర్తి మండల భో ||


శంఖ చక్ర పద్మ శార్జ గదా ఖడ్గ - వ్య్జయంతీ కౌస్తుభాది భూష
స్వీక్రుత బుధ్యాది తత్వ సమన్విత - దివ్య మంగళ గోపబాలక వేష ||


ఆగమ గిరి శిఖరొ దిత సత్య చిద - ద్వయ లక్ష్ణ సుఖ భానో
భోగి కులోత్తమ భోగ శయన - దుగ్ధ సాగరాజ లక్షణఢ్య తనో ||


ఇందిరయా సహ సుందర కృష్ణ - పురుందరాది వంద్య పద కమల
నంద నందన యోగి వర్య ధురంధర - నారాయణ తీర్థ మతి విహార ||

Youtube Play list (Unnikrishnan, - B.Sasikumar-Balabhaskar Violin Duo,

A.K.C. Natarajan-Clarionet )



The Hindu Article on NarayanaTirtha

Wednesday, June 22, 2011

నీతనయు చేత బ్రతుకమే యశోదమ్మ

Audio link : Sri Mangalampalli Balamuralikrishna
నీతనయు చేత బ్రతుకమే యశోదమ్మ

నీతనయు చేత అతి/అదె ఘాతుకము కాపురము
యేతీరున జేతు మమ వ్రాతఫల మేతీరౌనో

నిన్న నాదు చిన్నకోడలన్న పిన్నకన్నె
మున్నే ఉన్న తానె మిన్నానంచు భర్ణాసరము(??) వెనువేసి
నిన్నే నమ్మియున్నాననెనే దాని చన్నుబట్టి కెంగాలించుకెన్నో చేసెనే
ఆవాడ మాయన్నగారన్నీ చూచెనే యశోదమ్మ

ఉట్టి పాలచట్టి తూట్లుగొట్టి నోరుబట్టి త్రాగునట్టి వేళ నాదు
పట్టి జుట్టుబట్టి కొట్టబోగ వట్టు కొట్టకుమనెనే
నావంటి కుర్రబుట్టుని(??) వట్టు రమ్మనెనే(??)
యీలాంటి సుతునెట్టు గంటివోయమ్మా
మాగుట్టు పోగొట్టి చనుబట్టి మోవినట్టే కరచి పూల/ఁగూల కొట్టెనే యశోదమ్మా

ధరణి వేడురీ జోగి కనయు సుందరాంగ విని వదల జాలక
వ్రేతతరుణి మానధనములెల్ల చూరగొనెనే
ధరణి పరిపూర్ణుడాయనె వీరలకెల్ల(??) కోరికలదీర బ్రోచెనె
భవబంధముల పారద్రోలి చేరదీసెనే యశోదమ్మా

(సాహిత్యంలో తప్పులుంటే దయచేసి తెలియజేయగలరు.
పాట విని లిరిక్స్ వ్రాసినందుకు నారాయణం సుబ్రహ్మణ్యం , ప్రశాంత్ నేతి, శైలజ గార్ల కు ధన్యవాదాలు)

Sunday, June 5, 2011

రామ రామ నీవారము గామా రామ - త్యాగరాజకృతి - ఆనందభైరవి రాగం

Word by Word Meaning :
ప. రామ రామ నీవారము గామా రామ సీతా
రామ రామ సాధు జన ప్రేమ రారా

చ1. మెరుగు చేలము కట్టుక మెల్ల రారా రామ
కరగు బంగారు సొమ్ములు కదల రారా (రామ)

చ2. వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామ
మరుగు జేసుకొనునట్టి మహిమ రారా (రామ)

చ3. మెండైన కోదండ కాంతి మెరయ రారా కనుల
పండువగయుండు ఉద్దండ రారా (రామ)

చ4. చిరు నవ్వు గల మోము జూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా (రామ)

చ5. కందర్ప సుందరానంద కంద రారా నీకు
వందనము జేసెద గోవింద రారా (రామ)

చ6. ఆద్యంత రహిత వేద వేద్య రారా భవ
వేద్య నే నీవాడనైతి వేగ రారా (రామ)

చ7. సు-ప్రసన్న సత్య రూప సుగుణ రారా రామ
అ-ప్రమేయ త్యాగరాజునేల రారా (రామ)

Get this widget | Track details | eSnips Social DNA


Monday, May 9, 2011

చలమేల జేసేవయ్య - నాటకురంజి వర్ణం

Srirangam Moolaveedu Rangaswami Nattuvanar
Flute : N.Ramani
Veena : Jayanthi Kumaresh
Vocal : TM Krishna
చలమేలఁ జేసేవయ్య చక్కని మా రంగయ్య
కలకాలము నీ పాదములే గతియని నమ్మియుండగ

కరి మొఱలిడ విని దురమున వెడలి
మకరిని దునిమి కరివరదుఁడని బిరుదు
ధరను వెలసి సురలు పొగడఁగలిగిన పతితపావనుఁడ
నా మనవిఁ గొను... చలమేలఁ జేసేవయ్య

* * *
నన్ను బ్రోవ నీకు భారమా
ఇదే బాగని యూరకను నీవున్న నిను నే విడచెదన?...
నన్ను బ్రోవ నీకు భారమా

అండాండములకు నధిపతివని నిండా మొఱలిడగ వినివినక
యుండ సరియగునె మదనజనకుండ వరమొసఁగు మనుదినము... నన్ను బ్రోవ నీకు భారమా
...
ఆ ద్రౌపదికి వలువ సభలోఁ దరగకను యొసగిన
మహాదయగల నినుఁ బొగడను నా తరమగున
సిరివెలయు రంగపురిని నేలిన పతి నాఁగల రంగని
కొమరుండఁ దెలిసి తెలియక నడచిన పలు
నడతలను మదిఁ దలుప వలదు వలదు
శరణు శరణు మురహర... నన్ను బ్రోవ నీకు భారమా

YouTube Playlist:

In this clip, we hear the veteran flautist K. S. Gopalakrishnan play this varnam. T. N. Krishnan plays the violin and T. K. Murthy, the mridangam. The recording is from a live concert at Shanmukhananda Hall (Bombay, 1974).

Wednesday, March 9, 2011

పాహి రామ చంద్ర రాఘవ - త్యాగరాజ కృతి , యదుకులకాంభోజి రాగం

Audio link :
1.M.Balamuralikrishna & P.Suseela
link 2 from ensips
2. Musiri-Subrahmanya-Iyer (it is said that he popularized this kriti) image source
ప. పాహి రామ చంద్ర రాఘవ హరే మాం -
పాహి రామ చంద్ర
రాఘవ

చ1. జనక సుతా రమణ కావవే గతి నీవు -
గనుక నన్ను వేగ బ్రోవవే

చ2. ఎంత వేడుకొన్న నీకు నాయందు - ఇసుమంత దయ లేకయుండునా

చ3. కష్టములను తీర్చమంటిని నీవు -
నాకిష్ట దైవమనుకొంటిని



చ4. అంబుజాక్ష వేగ జూడరా నీ - కటాక్షంబు లేని జన్మమేలరా (పాహి)
చ5. ఆటలనుచు తోచియున్నదో లేక నా - లలాట లిఖిత మర్మమెట్టిదో (పాహి)
చ6. శోధనలకు నేను పాత్రమా రామ - యశో ధనులకు నుతి పాత్రమా (పాహి)
చ7. నీవు నన్ను జూడ వేళరా కన్న కన్న - తావుల నే వేడ జాలరా (పాహి)
చ8. నన్ను బ్రోచు వారు లేరురా రామ నీ - కన్న దైవమెందు లేదురా (పాహి)
చ9. రాజ రాజ పూజిత ప్రభో హరే త్యాగ- రాజ రాజ రాఘవ ప్రభో (పాహి)

Musiri Subramanya Iyer

Saturday, February 26, 2011

నారాయణ శతకము - బమ్మెర పోతన

Audio link : Sri Mangalampalli Balamuralikrishna & P.Suseela(?)
నమామి నారాయణ పాద పంకజం - వదామి నారాయణ నామనిర్మలం
భజామి నారాయణ తత్త్వమవ్యయం - కరోమి నారాయణ పూజనం సదా |S1O|

ఆలోక్య సర్వ శాస్త్రాణి - విచార్యచ పునః పునః - ఇదమేకం సునిశ్హ్పన్నం - ధ్యాయేన్నారాయణం సదా |S2O|

శ్రీ రమా హృదయేశ్వరా - భక్త జన చిత్త జలరుహ భాస్కరా - కారుణ్య రత్నాకరా - నీవె గతి కావవే నారాయణా || [1]
పాప కర్మములఁ జేసి - నరక కూపములఁ బడజాల నిఁకను - నీపాద భక్తి యొసఁగి - యొక్క దరిఁ జూపవే నారాయణా || [2]
దాన ధర్మములఁ జేయ-నేర, నీ దాసులను బొగడ నేర, - నా నేరములఁ దలఁపక - దయ చేసి నన్నేలు నారాయణా || [3]
ఆన యించుక లేకను - దుర్భాశ్హ లాడు నా జిహ్వ యందు, - నీ నామ చతురక్షరి - దృఢముగా నిలుప వలె నారాయణా || [4]
ఒకటి పరిశుద్ధి లేక - నా జన్మ మకట! వ్యర్థం బాయెను - అకలంక మగు మార్గముం - జూపవే సకలేశ! నారాయణా || [5]
వేగి లేచినది మొదలు - సంసార సాగరంబున నీఁదుచు -మీ గుణము నొక వేళను - దలఁపగదె మేలనుచు నారాయణా || [6]
లోక వార్తలకు మరఁగి - కర్ణముల మీకథల విన నేరను, - ఏ కరణీ భవ జలధిఁ - దుదముట్ట నీఁదెదను నారాయణా || [7]
ఇల మనుజ జన్మ మెత్తి - సుజ్ఞాన మించు కంతయు లేకను, - కలఁతఁ జెందెడు చిత్తమున్‌ - స్వచ్ఛంబుగాఁ జేయు నారాయణా || [8]
యెంత పాపాత్ముఁడైన - మిముఁ దలంచి కృతకృత్యుఁడౌనుఁ, - బుడమి నింత పరుసము సోఁకిన - లోహంబు హేమమౌ నారాయణా || [9]
కామాంధకారమునను - బెక్కు దుశ్హ్కర్మములఁ జేసి నేను, -నీ మఱుఁగు జొచ్చినాను - నామీఁద నెనెరుంచు నారాయణా || [10]


సమయమైనపుడు మిమ్ముఁ -దలచుటకు శక్తి గలుగునొ కలు - గదో, సమయమని తలఁతునిపుడు -నా హృదయ కమలమున నారాయణా || [11]
ఆటలన్నియు ఱంకులు -నేనాడు మాటలన్నియు బొంకులు, -పాటింప నింతకైన -నున్నదే పాపంబు నారాయణా || [12]
వావి దప్పిన వాఁడను -దుశ్హ్క్రియా వర్తనుఁడ నగుదు నేను, - బావనునిగాఁ జేయవె ననుఁ బతిత పావనుఁడ నారాయణా || [13]
దేహమే దృఢమనుచును -దెలిసి నే మోహబద్ధుఁడ నగుచును, - సాహసంబున జేసితిఁ -నేగురు ద్రోహంబు నారాయణా || [14]
ఎన్ని జన్మము లాయెనో -నేటి కెందెందు జన్మించినానో - నన్ను దరిఁ జేర్పఁ గదవొ -యిఁకనైన నా తండ్రి నారాయణా || [15]
యమ కింకరులఁ దలఁచిన -నాగుండె యావులింపుచు నున్నది - యముని బాధలు మాన్పను -మాయప్ప వైద్యుఁడవు నారాయణా || [16]
అరయఁ గామ క్రోధముల -లోభంబు మోహమద మత్సర - ములు, తఱుఁగ వెప్పుడు మనసున -నిన్నెపుడుఁ దలచెదను || [17]
ఆశా పిశాచి పట్టి, -వైరాగ్య వాసనలఁ జేరనీయదు - గాసి పెట్టుచు నున్నది -నేనేమి చేయుదును నారాయణా || [18]
తాపత్రయంబుఁ జెంది -చాలఁ బరితాప మొందెడు చిత్తము - నీ పాదములఁ జెందినఁ -జల్లనై నిలిచెదను నారాయణా || [19]


చింతా పరంపరలచేఁ -చిత్తంబు చీఁకాకు పడుచున్నది, - సంతోషమునఁ గూర్పవె -దివ్య ప్రసాదములు నారాయణా || [20]
ప్రాయమెల్లను బోయెను -నాశ లెడఁ బాయఁ జాలక యున్నవి - మాయా ప్రపంచమేల -చేసెదవి మాయయ్య నారాయణా || [21]
శరణుఁ జొచ్చినవాఁడను -నేఁ జేయుదురితముల నపహరించి - పరమ పద మొసఁగఁ గదవె -యిఁకనైనఁ బరమాత్మ నారాయణా || [22]
సంకల్పములు పుట్టినఁ -గర్మ వాసనల దృఢముగఁ జేయవు - సంకటము నొందించకే -నను సత్య సంకల్ప నారాయణా || [23]
ఒకవేళ నున్న బుద్ధి -యొక వేళ నుండదిఁక నేమి సేతు - విశదంబుగాఁ జేయవే -నీవు నా చిత్తమున నారాయణా || [24]
నెట్టుకొని సకల జీవ -కోటులను గొట్టి భక్షించినాను - పొట్ట కొఱకై నీచుల -సేవించి రట్టయితి నారాయణా || [25]
నేను పుట్టినది మొదలు -ఆహార నిద్రలనె జనె కాలము - పూని యెప్పుడు సేయుదు -నీపదధ్యానంబు నారాయణా || [26]
ప్రొద్దు వోవక యున్నను -వేసరక పొరుగిండ్లు తిరుఁగుగాని - బుద్ధిమాలిన చిత్తము -నీయందుఁ బొందదే నారాయణా || [27]
ఎన్ని విధములఁ జూచిన -నిత్యమును హృదయమున మిము - మఱవక యున్నంతకన్న సుఖము -వేఱొక్కటున్నదే నారాయణా || [28]
లాభ లోభముల విడిచి -యిహపరంబులను ఫల మాసింపక - నీ భక్తులైన వారు -ధన్యులై నెగడెదరు నారాయణా || [29]
ముందు నీ సృశ్హ్టి లేక -సచ్చిదానంద స్వరూపంబును - బొంది భేదము నొందక -బ్రహ్మమై యుందువఁట నారాయణా || [30]


కాలత్రయీ బాధ్యమై -మఱి నిరాకారమై యుండు కతనఁ - జాలఁగాఁ దత్త్వజ్ఞులు -తెలియుదురు సత్తగుట నారాయణా || [31]
జ్ఞాన స్వరూపమునను -నజడమై జడ పదార్థము నెల్లను - గానఁగాఁ జేయు కతనఁ -జిత్తండ్రు ఘనులు నిను నారాయణా || [32]
సుఖ దుఃఖముల రెంటికి -వేఱగుచు సుఖ రూపమైన కతన -నఖిల వేదాంత విదులు -ఆనందమండ్రు నిను నారాయణా || [33]
గుణ మొకటియైన లేని -నీయందు గుణమయంబైన మాయ - గణుతింపఁ గను పట్టెడు -దర్పణము కైవడిని నారాయణా || [34]
అందుఁ బ్రతిబింబించిన -చిత్సదానంద సముదాయమెల్లఁ - జెందు నీశ్వర భావము -త్రిగుణ సం శ్లిశ్హ్టమయి నారాయణా ||[35]
సత్వంబు రజము తమము -నను మూఁడు సంజ్ఞలను గ్రమము - తోడఁ దత్త్వజ్ఞులేర్పరింపఁ -సద్గుణ త్రయములను నారాయణా || [36]
ప్రకృతి నీయందు లీనమై -యుండి స్మృతిని జెందిన వేళను - సకల ప్రపంచ మిటులఁ -గనుపట్టె నకళంక నారాయణా || [37]
మీరు సంకల్పించిన -యిశ్హ్టప్రకారమును జెందు మాయ - యారూఢి వివరించెద -నవ్విధం బొప్పంగ నారాయణా || [38]
పంచభూతములు మనసు -బుద్ధియును బ్రకటహంకారము -లును, నెంచంగ నిట్టిమాయ -యిదిగా ప్రపంచంబు నారాయణా || [39]
భూతపంచక తత్త్వ సం -ఘాతమునఁ బుట్టె నంతఃకరణము - ఖ్యాతిగా నందుఁ దోఁచి -చిత్తు జీవాత్మాయె నారాయణా || [40]



వెస మనో బుద్ధి చిత్తా -హంకార వృత్తు లంతఃకరణము - ప్రచురింప నవి నాలుగు -తత్త్వ రూపములాయె నారాయణా || [41]
భౌతిక రజోగుణములును -నేకమై ప్రాణంబు పుట్టించెను - వాద భేదములచేతఁ -బంచ పాపములాయె నారాయణా || [42]
అలరు ప్రాణ మపానము -వ్యానంబుదానము సమానంబులు - తలఁప నీ సంజ్ఞలమరి -వాయుతత్త్వము లొప్పు నారాయణా || [43]
ప్రత్యేక భూత సత్త్వగుణములన -బరఁగి బుద్ధీంద్రియములు - సత్త్వమున జనియించెను -దత్త్వ ప్రపంచముగ నారాయణా || [44]
చెవులు చర్మముఁ గన్నులు -జిహ్వ నాసికయుఁ బేరుల చేతను - దగిలి బుద్ధీంద్రియముల -విశ్హయ సంతతిఁ దెలియు నారాయణా || [45]
భౌతిక తమోగుణమున -విశ్హయములు తఱుచుగాఁ జనియిం - చెను, శబ్ద స్పర్శ రూప -రస గంధ నామములు నారాయణా || [46]
తాదృశ రజోగుణమున -జనియించె నరక కర్మేంద్రియములు - ఐదు తత్త్వమ్ము లగుచును -గర్మ నిశ్హ్ఠాదులకు నారాయణా || [47]
వాక్పాణిపాదపాయూ -పస్థలను వాని పేళ్ళమరుచుండుఁ - బ్క్వహృదయులకుఁ దెలియు -నీవిధము పరమాత్మ నారాయణా || [48]
పలుకు పనులును నడుపును -మలమూత్రములు విడుచుటీ య - యిదును వెలయఁ గర్మేంద్రియముల -విశ్హయములు నళినాక్ష నారాయణా || [49]
పరఁగఁ జంద్రుండు బ్రహ్మ -క్షేత్రజ్ఞుఁ డరువొందు రుద్రుఁ - డచటి, పరమానసాదులకును -నధిపతులు వివరింప నారాయణా || [50]


అరయ దిక్కున వాయువు -సూర్యుఁడును, వరుణుండు, నశ్విను - లును, బరఁగ శ్రోత్రాదులకును -నధిపతులు పరికింప నారాయణా || [51]
అనలుఁ, డింద్రుఁడు, విశ్హ్ణువు -మృత్యువును, నల ప్రజాపతియుఁ - గూడి, యొనరఁగా నాడులకును -నధిపతులు పరికింప నారాయణా || [52]
పంచీకృతంబాయెను -భూతపంచకము, ప్రబలించి సృశ్హ్టి - పంచీకృతముచేతను -స్థూల రూపము లాయె నారాయణా || [53]
పది యింద్రియముల మనసు -బుద్ధియును, బ్రాణంబులైదు - గూడి, పదియేడు తత్త్వములను -సూక్ష్మరూపములాయె నారాయణా || [54]
స్థూలసూక్ష్మములు రెండు -కలుగుటకు మూలమగు నజ్ఞాన-ము, లీల కారణ మాయెను -జీవులకు నాలోన నారాయణా || [55]
ఈరెండు దేహములకు -విశ్వంబు నెల్లఁ బ్రకటనంబాయెను - నామ రూపముల చేత -లోకైక నాయకుఁడ నారాయణా || [56]
కొన్ని మాయనుఁ బుట్టును -గ్రుడ్లతోఁ గొన్ని తనువులు పుట్టు - ను, గొన్ని ధరణిని బుట్టును -జెమటలను గొన్ని హరి నారాయణా || [57]
ఈ చతుర్విధ భూతములందుఁ -గడు హెచ్చు మానవ జన్మము - నీచమని చూడరాదు -తథ్యమే నిర్ణయము నారాయణా || [58]
ఈ జన్మమందెకాని -ముక్తి మఱి యేజన్మమందు లేదు - చేసేతఁ దను దెలియక -మానవుఁడు చెడిపోవు నారాయణా || [59]
చేతనాచేతనములు -పుట్టుచును రోఁతలకు లోనగుచును - నాతంక పడుచుండును -గర్మములఁ జేతఁనుడు నారాయణా || [60]


సకలయోనులఁ బుట్టుచుఁ -బలుమాఱు స్వర్గ నరకములఁ బడు - చు, నొకట నూఱట గానక -పరితాప మొందితిని నారాయణా || [61]
వెలయ నెనుబదినాలుగు -లక్ష యోనులయందుఁ బుట్టిగిట్టి - యలసి మూర్ఛలఁ జెందుచు -బహుదుఃఖముల చేత నారాయణా || [62]
క్రమముతో మనుజగర్భ -మునఁ బడుచుఁ గర్మవశగతుఁడగు - చును, నమితముగ నచ్చోటను -గర్భనరకమునఁ బడు నారాయణా || [63]
ఈశ్వరాజ్ఞను బుట్టిన -తెలివిచే హృదయమునఁ దలపోయుచు - విశ్వమునఁ దను బొందిన -పాటెల్ల వేర్వేఱు నారాయణా || [64]
చాలు చీ! యిక జన్మము -నిఁకఁ బుట్టుఁ జాలు, శ్రీహరి భజించి - మేలు చెందెద ననుచును -జింతించు నాలోన నారాయణా || [65]
ప్రసవకాలమునఁ దల్లి -గర్భమునఁ బాదుకొని నిలువలేక - వసుధపయి నూడిపడినఁ -దెలివిచే వాపోవు నారాయణా || [66]
చనుఁబాలు గుడిచి ప్రాణ -ధారణను నిఁక మూత్ర మలము - లోను, మునిఁగితేలుచునుండును, దుర్గంధమున నారాయణా || [67]
బాలత్వమున బిత్తరై -నలుగడలఁ బాఱాడు సిగ్గులేక - పాలుపడి యౌవనమునఁ -విశ్హయానుభవమొందు నారాయణా || [68]
ముదిమి వచ్చిన వెనుకను -సంసారమోహంబు మానకుండఁ - దుదనేఁగుఁ గర్మగతులఁ -బొందుటకు ముదమేమి నారాయణా || [69]
అజ్ఞాన లక్షణమ్ము -లిటువంటివని విచారించి నరుఁడు - సుజ్ఞానమునకుఁ -దగిన మార్గంబు చూడవలె నారాయణా || [70]


వేదాంత వేదియైన -సద్గురుని పాదపద్మములు చెంది - యాదయానిధి కరుణచే -సద్బోధ మందవలె నారాయణా || [71]
ఏ విద్యకైన గురువు -లేకున్న నావిద్య పట్టుపడదు - కావునను నభ్యాసము -గురుశిక్ష కావలెను నారాయణా || [72]
గురుముఖంబైన విద్య -నెన్నికై కొనిన భావజ్ఞానము - చిరతరాధ్యాత్మ విద్య -నభ్యసింపఁగ లేడు నారాయణా || [73]
అనపేక్షకుఁడు సదయుఁడు -వేదాంతనిపుణుఁడయ్యాచార్యు - డు దొరుకుటపురూపమపుడు -గుఱుతైన గుఱి యొప్పు నారాయణా || [74]
అట్టిసద్గురుని వెదకి -దర్శించి యా మహాత్ముని పదములు - పట్టి కృతకృత్యుఁడౌను -సాధకుఁడు గట్టిగా నారాయణా || [75]
మొగి సాధనములు నాల్గు -గలనరుఁడు ముఖ్యాధికారి యగును - దగిన యుపదేశమునకు -యోగసాధకులలో నారాయణా || [76]
ఇది నిత్య మిదియనిత్యం -బనుచుఁ దన మది వివేకించుటొ - కటి, యెదను నిహపర సుఖములు -కోరనిది యిదియొకటి || [77]
ముదముతో శమదమాది -శ్హట్క సంపద గలిగి యుండుటొ - కటి, విదితముగ ముక్తిఁ బొందఁ -గాంక్షించు టదియొకటి || [78]
ఈనాల్గు సాధనముల -నధికారియై నిజాచార్యుఁ జేరి - నానా ప్రకారములను -శుశ్రూశ్హ నడుపవలె నారాయణా || [79]
ఉల్లమునఁ గాపట్యము -లవ మైన నుండ నీయక సతతము - తల్లి దండ్రియుఁ దైవము -గురువనుచుఁ దలఁపవలె నారాయణా || [80]


తనువు, ధనమును, సంపద -గురుని సొమ్మని సమర్పణము - చేసి, వెలసి తత్పరతంత్రుఁడై -నిత్యమును మెలఁగవలె నారాయణా || [81]
ఏనిశ్హ్ఠ గురునిశ్హ్ఠకు -దీటుగాదీ ప్రపంచంబునందు =- మానసము దృఢము చేసి -యలరవలె మౌనియై నారాయణా || [82]
ఇట్టి శిశ్హ్యుని పాత్రత -వీక్షించి హృదయమునఁ గారుణ్యము - నెట్టుకొని బ్రహ్మవిద్య -గురుఁడొసఁగు నెయ్యముగ నారాయణా || [83]
బ్రహ్మంబు గలుఁగఁగానె -యేతత్ప్రపంచంబు గలిగి యుండు - బ్రహ్మంబు లేకున్నను -లేదీ ప్రపంచంబు నారాయణా || [84]
ఈ విధంబున సూక్తుల -బ్రహ్మ సద్భావంబు గలుగఁ జేసి - భావ గోచరము చేయుఁ -జిత్స్వరూపములెల్ల నారాయణా || [85]
ఆ బ్రహ్మమందె పుట్టు -విశ్వంబు నాబ్రహ్మమందె యుండు - నా బ్రహ్మమందె యణఁగు -నదె చూడు మని చూపు నారాయణా || [86]
అది సచ్చిదానందము -అది శుద్ధ మది బద్ధ మది యుక్తము - అది సత్య మది నిత్యము -అది విమలమని తెలుపు నారాయణా || [87]
అదె బ్రహ్మ మదె విశ్హ్ణువు -అదె రుద్రుఁ డదియె సర్వేశ్వరుండు - అది పరంజ్యోతి యనుచు -బోధించు విదితముగ నారాయణా || [88]
భావింప వశముగాదు -ఇట్టిదని పలుక శక్యంబుగాదు - భావంబు నిలుపుచోట -నసి తాను బరమౌను నారాయణా || [89]
అది మాయతోఁ గూడఁగ -శివుఁడాయె, నదియె విద్యను గూ - డఁగ విదితముగా జీవుఁడాయె -నని తెలుపు వేర్వేఱ నారాయణా || [90]


శివుఁడు కారణ శరీరి -కార్యంబు జీవుఁడా లక్షణములు - ద్వివిధముగఁ దెలియు ననుచు -బోధించు వివరముగ నారాయణా || [91]
అరయ నిరువది నాలుగు -తత్త్వంబులై యుండు నందమ - గుచుఁ గరతలామలకముగను -బోధించుఁ బ్రకటముగ నారాయణా || [92]
కారణము కార్యమగుచు -వ్యవహార కారణాఖ్యత నుండును - నారూఢి బ్రహ్మాండము -పిండాండ మని తెలుపు నారాయణా || [93]
ఐదు భూతములు, నింద్రి-యములు పది, యంతరంగములు - నాల్గు, ఐదు విశ్హయములు తత్త్వ -సంఘాతమని తెలుపు నారాయణా || [94]
స్థూల సూక్ష్మాకృతులును -గారణముతో మూడు తెఱఁగులకు - ను, నీలమగు నందు నమరు -నని తెలుపు లాలించి నారాయణా || [95]
వెలసి పంచీకృతములు -నగు భూతములకుఁ బుట్టినది తను - వు, స్థూలంబు నది యనుచును -బోధించు దయతోడ నారాయణా || [96]
ఐదు నయిదింద్రియములు -ప్రాణంబు లయిదు, మనసును బు - ద్ధియుఁ, బాదుకొని సూక్ష్మ మందు -బోధించుఁ బ్రకటముగ నారాయణా || [97]
గాఢమగు నజ్ఞానము -ఈరీతిఁ గారణ శరీర మగును - మూఢులకు వశముగాదు -తెలియ విను మోదమున నారాయణా || [98]
ఈమూఁడు తనువులందు -దా నుండి ఈతనువు తాననుచును - వ్యామోహ పడుచుండు(ను) -జీవుండు వరుసతో నారాయణా || [99]
కలలేక నిద్రించును -కలఁగాంచి కడు మేలుగోరు చుండును - గలకాల మీ జీవుఁడు -త్రివిధములఁ గలసియును నారాయణా || [100]


ప్రాజ్ఞతైజస విశ్వులు -తానె, ఈపర్యాయముగ జీవుఁడు - ప్రజ్ఞగోల్పడ పొందును -సంసార బంధంబు నారాయణా || [101]
మూఁడవస్థలకు సాక్షి -యైనట్టి మూలంబు తాఁ దెలిసినఁ - జూడుమని సన్మార్గము -తేటగాఁ జూపుచును నారాయణా || [102]
నీవు దేహంబు గావు -ప్రాణంబు నీవుగావింద్రియములు - నీవుగాదని తెలుపును -వేదాంత నిలయమున నారాయణా || [103]
అనల తప్తంబు గాదు -జలమునను మునిఁగి తడిఁ జెందఁబో - దు, అనిలశుల్కంబుగాదు -నిరుపమం బని తెలుపు నారాయణా || [104]
కామహంకార మిపుడు -చిత్తంబుగా వీవు బుద్ధి నీవు - కావు మనసులు సత్యము -సాక్షివగు గట్టిగా నారాయణా || [105]
దేహధర్మములు నీకుఁ -దోఁచు టంతేగాని నిత్యముగను - మోహంబు మానుమనుచు -బోధించు ముఖ్యముగ నారాయణా || [106]
ఎన్ని దేహములు చెడిన -నీవు నేక స్వరూపుండ వగుచు - జెన్నలరి యుందు విలను -దత్త్వ ప్రసిద్ధముగ నారాయణా || [107]
అన్ని వేదాంత వాక్య -ములలో మహావాక్యములు నాలుగు - నిన్ను నీశ్వరునిగాను -వర్ణించు నిక్కముగ నారాయణా || [108]
ఉభయ దృశ్యోపాధులు, కడఁద్రోసిపోక యయ్యాత్మ మిగుల - నభయముగ నిటులెప్పుడు -చింతింపు మని తెలుపు నారాయణా || [109]
జీవ శివ తారతంయ -మున నైక్య సిద్ధి కానేర దనుచు - భావ సంశయము దీర్పు -కార్యార్థ పటిమచే నారాయణా || [110]


నిర్వికారుఁడవు నీవు -నీ యందె నిజమైన చందమునను - బర్వుఁ బ్రకృతి వికారము -లని తెలుపు ప్రౌఢిచే నారాయణా || [111]
సద్గురుం డీరీతిగా -బోధించు సరళితో వాక్యార్థము - హృద్గతముఁ జేసియుండి -జగతి జీవింపుదును నారాయణా || [112]
అని చింతనము జేయుచుఁ -జిత్తమునఁ దనివిఁ జెందుచు నెప్పు - డు, కనుదమ్ములను ముడుచుచు -ధ్యానంబుగాఁ జేయు నారాయణా || [113]
అపగతాఘ కృత్యుఁడై -ఈరీతి నభ్యాస మొనరించుచు - నపరోక్ష సిద్ధి నొందు -బ్రహ్మంబు తానగుచు నారాయణా || [114]
కందళిత హృదయుఁడగుచు -సచ్చిదానంద స్వరూపుఁడగు - చు, సందర్శితాత్ముఁడగుచు -నుండు నవికారతను నారాయణా || [115]
అవ్యయానంద పూజ్య -రాజ్య సింహాసనాసీనుఁడగుచు - భవ్యాత్ముఁడై వెలసెను -బూజ్య సంభావ్యుఁడై నారాయణా || [116]
నీవు సకలంబుగాని -యున్నదే నీకన్న వేఱొక్కటి - జీవుఁడని వర్ణించుట -వ్యవహార సిద్ధికిని నారాయణా || [117]
చిలుక పలుకులు పలికితి -నాకేమి తెలియుఁ దత్త్వ రహస్య - ము, వలదు నను నేరమెంచ -సాధులకు నళినాక్ష నారాయణా || [118]
శరణు భక్తార్తిహారి -గురురూప శరణు సజ్జన రక్షక - శరణు దురితౌఘనాశ -శరణిపుడు కరుణించు నారాయణా || [119]