
Aduio : Lata Ganapathi & Othrs (notworkign)
Audio link : Hummaa
శంకరి శ్రీ రాజరాజేశ్వరి జయ శివ
మంగళకర కుంకుమ ధర మందస్మిత ముఖ విలాసిని
అంకుశ ధనుః పాశ దండ భాస్కర చక్ర నివాసిని
మధ్యమకాలం:
భృంగి సనక మునిగణ వర పూజిత పరమోల్లాసిని బుధజన హితకారిణి
పరపోశణ వహ్నివాసిని వేంకట కవి హృది సరసిజ వివరణ పటుతర
భాసిని విధి హరిహర సుర సమ్మత నిత్యాంతర ప్రకాశిని
చరణం:
పరికీర్తిత నాదాంతర నిత్యాంతర అంగ రక్షాకర త్రయ ప్రకారే
అతి రహస్య యోగినీ పరివారే గిరిరాజ రాజ వర తనయే సృష్టి
స్థిత్యాది పంచ కారణ కృత్యేంద్ర గణ సమ్మానితే యతీంద్ర గణ
సమ్మోదితే శరణాగత నిజ జన వరదే సంకల్ప కల్పతరు నికరే
సహజ స్థితి సవికల్ప నిర్వికల్ప సమాధి సుఖ వరదే
మధ్యమకాలం:
పర తత్వ నిదిధ్యాసన వితరణ సర్వ బీజ ముద్రాధిపతే
భండాసుర మద ఖండన వైభవ చింతామణి నగరాధిపతే
తరుణారుణ ముఖ కమలే సకలే సారస హిత విద్యాధిపతే
సదా చిదంబర నర్తన పదయుగ సమకర నటనాధిపతే జయ శివ