Audio link : Hyd AIR Artists
ప|| రావయ్య భద్రాచలధామా శ్రీరామా | రమణీయ జగదభిరామ లలామా ||
అప|| కేవల భక్తి విలసిల్లునా/విలసిల్లగా | భావము తెలిసిన దేవుడవైతే ||
చ|| ప్రొద్దున నిను పొగడుచు నెల్లప్పుడు | పద్దుమీరకును/పద్దుమీ రగను భజనలు చేసెద |
గద్దరితనమున ప్రొదులు పుచ్చక/పుచ్చుచు | ముద్దులు కులుకుచు మునుపటివలె (నిటు) ||
చ|| నన్నుగన్న తండ్రీ (నా) మదిలో(న) నీ- | కన్న నితరులను కొలిచెదనా ఆ- |
పన్నరక్షకా వర దినకర కుల /[శ్రీకర దివ్య ప్రభాకర పుర]- | రత్నాకర పూర్ణ సుధాకర ||
చ|| అంజలి చేసెద నరమర లేక | కంజదళాక్ష కటాక్షము లుంచము |
ముజ్జగములకును ముదమిడు పదముల | గజ్జెలు కదలగ ఘల్లు ఘల్లుమన ||
చ|| దోషము లెంచని దొరవని నీకు | దోసలి యొగ్గితి తొలుత పరాకు |
దాసుని తప్పులు దండముతో సరి/దీరు | వాసిగ రామదాసు నిక బ్రోవగా ||
apa|| kEvala Bakti vilasillunA/vilasillagA | BAvamu telisina dEvuDavaitE ||
ca|| prodduna ninu pogaDucu nellappuDu | paddumIrakunu/paddumIraganu Bajanalu cEseda |
gaddaritanamuna produlu puccaka/puchchuchu | muddulu kulukucu munupaTivale (niTu) ||
ca|| nannuganna taMDrI (nA) madilO(na) nI- | kanna nitarulanu kolicedanA A- |
pannarakShakA vara dinakara kula /[SrIkara divya prabhAkara pura]- | ratnAkara pUrNa sudhAkara ||
ca|| aMjali cEseda naramara lEka | kaMjadaLAkSha kaTAkShamu luMcamu |
mujjagamulakunu mudamiDu padamula | gajjelu kadalaga Gallu Gallumana ||
ca|| dOShamu leMcani doravani nIku | dOsali yoggiti toluta parAku |
dAsuni tappulu daMDamutO sari/dIru | vAsiga rAmadAsu nika brOvagA ||